సాక్షి,హైదరాబాద్:బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(Kaushik Reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం (జనవరి13) కౌశిక్‌రెడ్డిని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్(Sanjaykumar)ను నెట్టివేసిన కేసులో కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు(Karimnagar police) అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అనంతరం కౌశిక్‌రెడ్డిని పోలీసులు కరీంనగర్‌కు తరలించారు.
కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆదివారం తనను కౌశిక్‌రెడ్డి దుర్భాషలాడుతూ నెట్టివేసిన వ్యవహారంలో పోలీసులకు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు.
కాగా, కరీంనగర్ కలెక్టరేట్‌లో ఆదివారం జరిగిన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, సంజయ్‌కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. సంజయ్‌కుమార్ మాట్లాడుతుండగా కౌశిక్‌రెడ్డి కల్పించుకుని ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావని ప్రశ్నించడంతో గొడవ పెద్దదైంది.
ఈ క్రమంలోనే కౌశిక్‌రెడ్డి సంజయ్‌కుమార్‌పై చేయి వేసి ఆయను నెట్టివేశారు. అనంతరం సమావేశ మందిరం నుంచి కౌశిక్‌రెడ్డిని పోలీసులు లాక్కెల్లారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఉండడం గమనార్హం.
ఈ ఘటనపై ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ పోలీసులతో పాటు తన హక్కులకు భంగం కలిగించారని స్పీకర్‌కు కూడా రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు ప్రస్తుతం కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు.
కౌశిక్ రెడ్డి అరెస్టు దారుణం:కేటీఆర్
- హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్య
- పూటకో అక్రమ కేసు పెట్టడం.. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టుచేయడం రేవంత్ సర్కారుకు అలవాటుగా మారింది
- ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారు
- పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టుచేయడం పూర్తిగా అప్రజాస్వామికం
Comments
Please login to add a commentAdd a comment