ఆదివారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో కౌశిక్‌రెడ్డి-సంజయ్‌ల మధ్య వాగ్వాదం(ఫైల్‌ఫోటో)
కరీంనగర్ జిల్లా: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(kaushik reddy) తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. నిన్న (ఆదివారం) ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) లో కౌశిక్‌రెడ్డి తనను నెట్టివేశాడని సంజయ్ కుమార్(Sanjay Kumar)ఆరోపించారు. ‘ నిన్న జరిగింది అధికారిక సమావేశం. నన్ను కౌశిక్‌రెడ్డి నెట్టేశాడు. కౌశిక్‌రెడ్డి ఇలా చేయడం ఎంతవరకూ కరెక్ట్.
నేను ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిని దూషించలేదు. కౌశిక్‌రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే ఆయనపై కేసులున్నాయి. కౌశిక్‌రెడ్డికి బెదిరించడం అలవాటు,. వరంగల్‌లో బెదిరించి సెటిల్మెంట్ చేశాడు. స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశాను. స్పీకర్ దీనిపై చర్యలు తీసుకోవాలి. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను ఎవరూ హర్షించరు. నేను ప్రజా సమస్యలపై మాట్లాడుతామనుకుంటే నాకు ఆటంక కల్గించాడు. జగిత్యాల అభివృద్ధి కొరకే ప్రజలు నన్ను గెలిపించారు.. అభివృద్ధి చేయడం నా ధర్మం . కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తే ఇంత అక్కసు ఎందుకు? అని ప్రశ్నించారు సంజయ్.
సమీక్షా సమావేశంలో తోపులాట
ఆదివారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్‌రెడ్డి(kaushik reddy)ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ‘నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత’ అనేంత స్థాయిలో వాగ్వాదం జరిగింది.
జిల్లా సమీక్షా సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే సంజయ్(MLA Sanjay) మాట్లాడుతుండగా పాడి కౌశిక్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇంతకీ మీ పార్టీ ఎంటంటూ సంజయ్‌ను కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రస్థాయికి చేరి ఇద్దరు తోసుకునేంతవరకూ వెళ్లింది. దాంతో కౌశిక్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఇదంతా ముగ్గురు తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబుల సమక్షంలో జరగడం శోచనీయం.
కౌశిక్‌రెడ్డి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూఊ. ‘ ఎమ్మెల్యే సంజయ్ అమ్ముడుపోయారు. సంజయ్‌కు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష. దమ్ముంటే సంజయ్ రాజీనామా చేయాలి. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్లా అంటూ కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment