
కమలాపూర్: ‘నువ్వు పీసీసీ అధ్యక్షుడివి అయ్యాక జరుగుతున్న మొట్టమొదటి ఎన్నిక ఇది. నీకు దమ్ముంటే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ తెచ్చుకో’అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘బిడ్డా రేవంత్‌రెడ్డి.. తెలంగాణ లో అక్కడక్కడ సభలు పెడుతున్నావు. కానీ, హుజూరాబాద్ గురించి ఎందుకు మాట్లాడుతలేవు? ఈటలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నవా?’అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది పాదయాత్ర కాదని, అది విహారయాత్ర అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment