కరీంనగర్ క్రైం: ఉద్యోగాల పేరుతో పలువురిని నమ్మించి, రూ.7 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసగాడిని కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పట్టుకున్నారు. ఏసీపీ శోభన్‌కుమార్ సోమవారం కథనం ప్రకారం.. సూర్యాపేటకు చెందిన వెల్ధి రాధాకృష్ణ హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో శ్రీ వెంకటేశ్వర కన్సల్టెన్సీని ఏర్పాటు చేశాడు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలు చేయడం ప్రారంభిం చాడు. 320 మందిని ఉద్యోగాల పేరుతో మోసం చేసి వారి నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేశాడు. రామారావు, రవి చంద్రారెడ్డి, బుట్ట జయరాజ్, నాయిని విద్యాసాగర్, ఈశ్వర వేణుగోపాల్‌లను అనుచరులుగా ఏర్పాటు చేసుకున్నాడు. కరీంనగర్, వరంగ ల్, ఆదిలాబాద్, ఖమ్మం, మంచిర్యాల, నల్లగొండ, హైదరాబాద్, కర్నూల్, కృష్ణా, పశ్చి మగోదావరి, అనంతపురం జిల్లాలకు చెంది న పలువురు ఇతడి వలలో చిక్కి మోసపోయారు. సెక్రటేరియట్, రెవెన్యూ, కమర్షియ ల్ ట్యాక్స్ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి ఆపైన వసూ లు చేశాడు. కొందరికి నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్ కాపీలను కూడా ఇచ్చాడు.
గుట్టు వీడింది ఇలా..
కరీంనగర్ మండలం నగునూర్‌కు చెందిన పైడిపాల వెంకటయ్య తనకు తెలిసిన వారిని రాధాకృష్ణకు పరిచయం చేశాడు. వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో వెంకటయ్య రూ. 26 లక్షలు వసూలు చేసి ఇచ్చా డు. రాధాకృష్ణ ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేయడంతో వెంకటయ్య కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ బృందం రాధాకృష్ణను అరెస్టు చేసింది. నాగర్‌కర్నూల్, గోదావరిఖని, నేరేడ్‌మెట్, అంబర్‌పేట, నల్లగొండ, బహదూర్‌పుర, కరీంనగర్ టుటౌన్, త్రీటౌన్, బేతంచర్ల పోలీస్‌స్టేషన్లలో రాధాకృష్ణపై పలు కేసులు నమోదయ్యాయి. అతడి నుంచి చెక్‌బుక్స్, విలువైన లావాదేవీలకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఉద్యోగాల పేరుతో మోసం
Published Tue, Feb 12 2019 4:00 AM | Last Updated on Tue, Feb 12 2019 4:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment