jobs fraud
-
Land for jobs scam: ప్రత్యేక కోర్టులో రబ్డీదేవికి ఊరట
న్యూఢిల్లీ: రైల్వే శాఖలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో బిహార్ మాజీ సీఎం రబ్డీదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లకు ప్రత్యేక కోర్టు ఈ నెల 28వ తేదీ వరకు మధ్యంతర బెయిలిచి్చంది. రెగ్యులర్ బెయిల్ కోసం వీరు పెట్టుకున్న పిటిషన్‌పై స్పందన తెలపాలంటూ ఈడీని ఆదేశిస్తూ స్పెషల్ జడ్జి విశాల్ గొగ్నె తీర్పు వెలువరించారు. కేసు దర్యాప్తు సమయంలో నిందితులను అరెస్ట్ చేయకుండా ఇప్పుడు కస్టడీకి కోరడమెందుకని జడ్జి ఈ సందర్భంగా ఈడీని ప్రశ్నించారు. -
రబ్రీ దేవికి ఢిల్లీ కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: రైల్వేశాఖలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ కోర్టు బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, ఆమె కూతుళ్లు మిసా భారతి, హేమా యాదవ్‌లకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 9వ తేదీన కోర్టులో విచారణకు రావాలంటూ స్పెషల్ కోర్టు జడ్జి విశాల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేసిన చార్జిషీటులో ఆరోపణలకు తగు ఆధారాలున్నాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది నవంబర్ నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యాపారవేత్త అమిత్ కట్యాల్‌ను సైతం తమ ముందు హాజరుపరచాలని ఆదేశించారు. -
పాపం..! నిరుద్యోగులే.. అతని దొంగ ఉద్యోగానికి బలి పశువులు..!!
-
విశాఖలో ఘరానా మోసం
-
కోర్టు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కోర్టుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసా లు జరుగుతున్నాయి. ఒక్కో పోస్టుకు స్థాయి మేరకు రూ. 3లక్షల నుంచి రూ. 5లక్షల వరకు వసూలుకు దిగినట్టుగా ప్రచారం నడుస్తోంది. విశాఖపట్నం, విజయవాడకు చెందిన వ్యక్తులు పైరవీలు చేస్తున్న ట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు చోట్ల కేసులు నమోదవ్వడంతో ఇప్పటికే పోలీసు వర్గాలు అప్రమ త్తమయ్యాయి. తాజాగా జిల్లా జడ్జి కూడా స్పందించారు. నియామకాలన్నీ పారదర్శకంగా జరుగుతా యని, దళారులను నమ్మిమోసపోవద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులో పలు ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కోర్టుల్లో 3,432 పోస్టులు, హైకోర్టులో 241 పోస్టులు భర్తీ చేస్తున్నా రు. వీటికి సంబంధించి ఈనెల 21న, వచ్చే నెల 2వ తేదీన రాత పరీక్ష కూడా జరగనుంది. అయితే, ఇదే అవకాశంగా దళారులు చెలరేగిపోతున్నారు. ఎక్క డైనా నియామకాలు జరిగితే చాలు బ్రోకర్లు రంగంలోకి దిగి క్యాష్ చేసుకుంటున్నారు. సులువుగా ఉద్యోగాలు వచ్చేయాలన్న ఆశతో ఉన్న నిరుద్యోగులను ట్రాప్ చేస్తున్నారు. వీలు చిక్కినంత వసూలు చేసి ఆ తర్వాత చేతులేత్తేసిన పరిణామాలు ఎన్నో ఉన్నాయి. ఎవరికైనా ఉద్యోగం వస్తే అది మా చలవేనని, రాకపోతే రాలేదని కొందరు దళారులు చేతులెత్తేస్తుండగా, మరికొందరు వసూలు చేశాక పత్తా లేకుండా పోతున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిణామాలు ఉద్యోగాల నియామకాలు జరిగిన ప్ర తి సారి జరుగుతున్నాయి. చెప్పాలంటే మధ్యవర్తుల దందా నిత్యకృత్యమైపోయింది. ఇప్పటికే ఉద్యోగాల పేరుతో మోసం చేసిన కేసులు అనేకం జిల్లాలో ఉ న్నాయి. నిరుద్యోగుల అమాయకత్వంతో వీరు ఆడుకుంటున్నారు. తాత్కాలిక, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సైతం మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల అంగన్వాడీ తాత్కాలిక ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుని మోసగించిన కేసు వెలుగు చూసింది. శ్రీకాకుళం టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఏకంగా ఒక దళారిని బాధిత నిరుద్యోగులే పట్టుకుని పోలీసులకు అప్ప గించారు. చెప్పుకుంటూ పోతే జిల్లాలో అనేక ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో కోర్టు ఉద్యోగాల మో సాలు కూడా ప్రచారంలోకి రావడంతో పోలీసు వర్గాలు నిఘా పెట్టాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు ఉద్యోగాల మోసాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 15 కేసులు నమోదైనట్టు సమాచారం. ఇటీవల పెనమలూరులో ఒకర్ని పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తయ్యారు. ఇదే సమయంలో కోర్టు వర్గాలు కూడా తీవ్రంగా పరిగణించి అప్రమత్తం చేస్తున్నాయి. తాజాగా జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా కూడా స్పందించి, నిరుద్యోగులను అప్రమత్తం చేస్తూ పిలుపునిచ్చారు. మోసపోవద్దు రాష్ట్రంలోని కోర్టుల్లో వివిధ కేడర్ల ఉద్యోగాల నియామకాలు పారదర్శకంగా జరుగుతున్నా యి. ఉద్యోగాల కోసం దళారులను నమ్మి మోసపోవద్దు. అర్హతే ప్రామాణికంగా, మెరిట్ ఆధారంగా తీసుకుని నియామకాలు జరుగుతున్నా యి. ఉద్యోగాలు వేస్తామని ఎవరైనా చెబితే పోలీసులను ఆశ్రయించండి. లేదంటే మా దృష్టికి తీసుకురండి. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన వారి మాయ మాటలు నమ్మవద్దు. – జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా -
ఆర్ఎఫ్సీఎల్ కథ కంచికేనా..? బాధితులకు డబ్బులు అందుతాయా!
సాక్షి, కరీంనగర్: రామగుండం ఫెర్టిలైజర్స్ కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో కోట్లు దండుకున్న నలుగురు దళారులను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆర్ఎఫ్సీఎల్ బాధితులకు డబ్బులు అందుతాయా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బాధితులతో రెండురోజులపాటు మాట్లాడి భరోసా కల్పించారు. కర్మాగారంలో శాశ్వత ఉద్యోగాల పేరుతో సుమారు రూ.45 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేసిన దళారులు.. బాధితుల వద్ద ఎలాంటి పత్రాలూ లేకుండా జాగ్రత్త పడ్డారు. కేవలం నోటిమాట ఆధారంగానే బాధితులు రూ.లక్షలు దళారుల చేతిలో పోశారు. దీంతో కార్మికుల్లో కొత్త ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో కొందరు “మీకు ఉద్యోగం కల్పించాం.. డబ్బులిచ్చేది లేదు..’ అని బాధితులతో గొడవకు దిగుతున్న సందర్భాలూ ఉన్నాయి. వారం క్రితం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో దళారిపై పెట్రోల్ పోసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. తాజాగా శుక్రవారం ముంజ హరీశ్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు దళారులుగా ఉన్న నలుగురుపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. చదవండి: కు.ని.ఆపరేషన్‌తో నలుగురు మృతి.. ఇంతకూ ట్యూబెక్టమీ అంటే ఏంటి? దళారులు ఎంతమంది..? ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగ నియామకంలో ఎంతమంది దళారులు, మధ్యవర్తులు ఉన్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది. కొత్త కాంట్రాక్టర్ కార్మికులను తొలగించడంతో మోసపోయామని గ్రహించిన కార్మికులు ఏడు నెలలుగా పోరాటం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రమేయం ఉండడంతో అధికారులు చర్యలు చేపట్టడంలో జాప్యం చేశారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. పర్మినెంట్ హమాలి పేరుతో నగదు దండుకున్న కార్మిక సంఘం నాయకుడిపై ఇప్పటివరకూ కేసు నమోదు కాలేదు. వీరితోపాటు మరికొందరు అధికార, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు ఉన్నారని ప్రచారం జపరుగుతోంది. ఎవరు చెల్లిస్తారు..? బాధితులకు ఇప్పుడు నగదు ఎవరు చెల్లిస్తారనే వ్యవహారంలో స్పష్టత లేకుండా పోయింది. రెండు రోజులుగా కోరుకంటి చందర్ తన క్యాంపు కార్యాలయంలో బాధితులతో సమావేశం నిర్వహించారు. ప్రధాన దళారులు అధికార పార్టీ నాయకులు కావడంతో బాధితులకు నగదు చెల్లించేలా కృషి చేస్తారో లేదో.. వేచి చూడాల్సి ఉంది. -
ఉద్యోగాల పేరిట మోసం.. అజ్ఞాతంలోకి మాజీ మంత్రి
సాక్షి, చెన్నై(తమిళనాడు): అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి సరోజ, ఆమె భర్త అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. వివరాలు.. నామక్కల్ జిల్లా రాశీపురానికి చెందిన అన్నాడీఎంకే నేత సరోజ గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ, పౌష్టికాహార శాఖామంత్రిగా పనిచేశారు. పౌష్టికాహార విభాగంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి రూ.70 లక్షల వరకు తీసుకుని మోసగించినట్లు ఆమె బంధువు గుణశీలన్ పోలీసులకు కొన్నినెలల క్రితం ఫిర్యాదు చేశాడు. దీంతో మాజీమంత్రి సరోజ, ఆమె భర్త లోకరంజన్ తదితరులపై నేర విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సరోజ, లోకరంజన్ నామక్కల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై ఈనెల 15వ తేదీన మళ్లీ విచారణ చేపట్టనున్నారు. కాగా ముందస్తు బెయిల్ పొందడంలో జాప్యం చోటుచేసుకోవడంతో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే సరోజ, లోకరంజన్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పిటిషనర్ గుణశీలన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, పౌష్టికాహారశాఖ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మాజీ మంత్రి సరోజ చెప్పడంతో తాను, భార్య పలువురి వద్ద నుంచి రూ. కోటి వరకూ వసూలు చేసి అందజేశామని అన్నారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వంలో కొలువులు కల్పించకపోవడంతో పోలీసుకు ఫిర్యాదు చేశామన్నారు. మరో రెండురోజుల్లో (15వ తేదీన) కేసు విచారణకు వస్తుండగా సరోజ, లోకరంజన్, వారి కుటుంబ సభ్యులు కలసి ఎక్కడికో వెళ్లిపోయారు. పోలీసులు స్పందిస్తూ.. మాజీ మంత్రి సరోజ, ఆమె భర్తపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. విచారణ నిమిత్తం వారింటికి వెళ్లగా లేరని, కోర్టులో వారు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిసిన తరువాత చర్యలు తీసుకుంటామ్నారు. రాజేంద్ర బాలాజీ పై ఫిర్యాదు తిరువొత్తియూరు: ఆవిన్ పాల సంస్థలో ఉద్యోగం తీసిస్తామని మాజీ మంత్రి రాజేంద్రబాలాజీ స్నేహితుడు, వెంబకోటై యూనియన్ అన్నాడీఎంకె కార్యదర్శి అయిన విజయ నల్లతంబి రూ.30 లక్షలు తీసుకుని మోసం చేసినట్టు ఫిర్యాదులందాయి. కానీ తాను పలువురి వద్ద తీసిచ్చిన రూ.3 కోట్లు నగదును రాజేంద్ర బాలాజీ తిరిగి ఇవ్వలేదని విజయ నల్లతంబి విరుదునగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. విరుదునగర్ జిల్లా సాత్తూరు వెంబకోటై రోడ్డుకు చెందిన రవీంద్రన్ (49). ఇతని సహోదరి కుమారుడికి విరుదునగర్ ఆవిన్ సంస్థలో మేనేజర్ ఉద్యోగం కోసం వెంబకోటై అన్నాడీఎంకే యూనియన్ కార్యదర్శి విజయ నల్లతంబికి రూ.30 లక్షలు ఇచ్చినట్టు తెలిసింది. కానీ ఉద్యోగం ఇప్పించకపోవడంతో ఎస్పీ మనోహర్ వద్ద ఆగస్టు 28న ఫిర్యాదు చేశాడు. రవీంద్రన్ విజయ నల్లతంబిల వద్ద 2021 సెప్టెంబర్ 25న ఇన్స్పెక్టర్ గణేష్ దాసు విచారణ చేశారు. ఈక్రమంలో తాను పలువురు వద్ద తీసుకొచ్చిన రూ.3 కోట్ల నగదును మాజీమంత్రి రాజేంద్రన్ బాలాజీ తిరిగి ఇవ్వలేదని నల్లతంబి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
బురిడీ మాష్టారు.. బండారం బట్టబయలు
సాక్షి విశాఖపట్నం: మాయమాటలు చెప్పి మోసగించిన ఓ ఉపాధ్యాయుడు, అతని భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి భూమి విక్రయించిన వారిద్దర్నీ ఆదివారం అరెస్టు చేసి, నర్సీపట్నం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచారు. న్యాయమూర్తి 15 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఎస్ఐ ధనంజయ్ నాయుడు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మాకవరపాలెంకు చెందిన ఉపాధ్యాయుడు లాలం రమణబాబు, భార్య విజయ్‌దుర్గాదేవి నర్సీపట్నంలో ఆరు సెంట్లతో పాటు, విజయవాడ సమీపంలోని తాడేపల్లి వద్ద మరో రెండు సెంట్ల భూమి విక్రయించేందుకు 2019లో జోగుంపేటకు చెందిన గుడివాడ రాంబాబు నుంచి రూ.19 లక్షలు తీసుకున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో పురోణి రాసి రాంబాబుకు అందజేశారు. ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేయాలని పలు సార్లు రాంబాబు కోరగా వారు స్పందించలేదు. దీంతో అనుమానించిన రాంబాబు ఆ రెండు ప్రాంతాల్లోని భూమికి సంబంధించిన ఈసీ పొందగా అవి వేరే వ్యక్తుల పేరుపై ఉన్నాయి. దీనిపై బాధితుడు రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితులను నర్సీపట్నం న్యాయమూర్తి వద్ద హాజరు పరచగా 15 రోజులపాటు రిమాండ్ విధించారని ఎస్ఐ చెప్పారు. ఉద్యోగాల పేరుతో టోకరా లాలం రమణబాబు, భార్య విజయ్‌దుర్గాదేవి పోస్టల్‌తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పలువురి నుంచి రూ.లక్షలు వసూలు చేసి స్వాహా చేసినట్టు ఎస్ఐ తెలిపారు. మాకవరపాలెం, నాతవరం, నర్సీపట్నం ప్రాంతాల్లో పలువురు వీరి చేతిలో మోసపోయారని చెప్పారు. బాధితులు సంబంధిత పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. నర్సీపట్నంలో మరో కేసు నర్సీపట్నం: ఉపాధ్యాయుడు రమణబాబు నర్సీపట్నంలో కూడా మరో మోసానికి పాల్పడ్డాడు. భూమి విక్రయం పేరుతో తోటి ఉపాధ్యాయురాలు కోనాల సంధ్య వద్ద రూ.30 లక్షలు రమణబాబు దంపతులు తీసుకున్నారు. స్థలం రిజిస్ట్రేషన్ చేయకపోగా డబ్బులు అడిగినందుకు సంధ్యపై దాడికి దిగాడు. సంధ్య పట్టణ పోలీసు స్టేషన్లో జనవరి 23న ఫిర్యాదు చేయడంతో పట్టణ ఎస్ఐ లక్ష్మణ్‌రావు కేసు నమోదు చేశారు. అప్పట్లోనే రమణబాబు దంపతులను పట్టణ పోలీసులు అరెస్టు చేయాల్సి ఉండగా అతను కోర్టు ఆర్డర్ తెచ్చుకోవడంతో కేసు విచారణ దశలో ఉండిపోయింది. ఉపాధ్యాయురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమణబాబు దంపతులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం గొలుగొండ కేసులో రమణబాబు దంపతులు అరెస్టు అయినప్పటికీ రిమాండ్ అనంతరం మళ్లీ అరెస్టు చేయనున్నట్టు ఎస్ఐ లక్ష్మణ్‌రావు తెలిపారు. చదవండి: 67 ఏళ్ళ వయసులో ‘గేట్’ సాధించాడు! -
ఎంఎన్సీల్లో ఉద్యోగాలంటూ అమాయకులకు టోకరా
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకులకు టోకరా వేస్తున్న కి'లేడి'ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన ప్రతిభ అలియాస్ గాయత్రి, ప్రస్తుతం కోల్‌కతాలో నివాసం ఉంటూ ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతుంది. తన ఫోన్ నంబర్‌ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్‌మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో పోస్టు చేసి బ్యాక్‌డోర్ ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులకు టోకరా వేస్తుంది. జాబ్ కన్సల్టెన్సీల ద్వారా నిరుద్యోగుల డాటాను సేకరిస్తున్న ఈ కి'లేడి'.. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలోని ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తానంటూ తనను ఫోన్లో సంప్రదించిన వారిని నమ్మిస్తుంది. తొలుత కొంత సొమ్మును అడ్వాన్స్‌గా తీసుకొని, ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యాక మొత్తం నగదును చెల్లించాల్సి ఉంటుందని షరతులు పెడుతుంది. ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడీలు సృష్టించి, దాని ద్వారా నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేస్తుంది. జాబ్ లెటర్ ఇచ్చిన తరువాత.. ఇక తమ పని అయిపోయిందంటూ మిగిలిన సొమ్మును వసూలు చేసి, సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తుంది. ఇలా చాలా మంది అమాయకులకు బురడీ కొట్టించిన ఈ కిలేడి, చివరకు పోలీసులకు చిక్కింది. ఈమె చేతిలో మోసపోయిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా బ్యాక్ డోర్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ.2,42,520లు కాజేసిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కి'లేడి' ఉచ్చులో చాలామంది అమాయకులు చిక్కుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రతిభ అలియాస్ గాయత్రికి చెందిన ఈ నంబర్ల 781 4226842, 6363506954 ద్వారా ఎవరైనా మోసపోయి ఉంటే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు(9490617310)కు ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు. -
అక్రమాల ఇంద్రుడు
ఆ కాంట్రాక్టర్ టీడీపీ ఎమ్మెల్సీ అనుచరుడు.. విద్యుత్ శాఖలో పైరవీలతో వివిధ కాంట్రాక్టులు సొంతం చేసుకున్నాడు.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఎన్నికల కోడ్ సమయంలో సబ్స్టేషన్ల నిర్వహణ పనులు దక్కించుకున్నాడు.. అంతటితో ఆగకుండా... వాటిల్లో ఆపరేటర్ ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగుల నుంచి అక్రమ వసూళ్లకు తెరదీశాడు. ఇలా దాదాపు ఇరవై మంది నుంచి అడ్వాన్స్ కింద రూ.70లక్షల వరకు వసూలు చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా బాధితులను విచారణకు రమ్మని ఆదేశించారు. సమాచారం తెలుసుకున్న సదరు కాంట్రాక్టర్ వారిని విచారణకు వెళ్లకుండా నిర్బంధించాడు. దీంతో అధికారులు బాధితుల చిరునామా ఆధారంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలోని సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఇప్పిస్తామనే పేరుతో ఓ కాంట్రాక్టర్ భారీగా వసూళ్లకు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఉప కేంద్రాలను దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ అక్రమాలకు తెరతీశాడు. పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని రామలింగాయపల్లె, పందికోన వద్ద కొత్తగా నిర్మించిన సబ్స్టేషన్లు ఈ ఏడాది ఫిబ్రవరిలోపు పూర్తి చేశారు. అయితే వీటిని ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక గత ఎస్ఈ కాంట్రాక్టర్‌కు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. రెండు సబ్స్టేషన్ల పరిధిలో పోస్టుల పేరుతో రూ.70లక్షల వసూలు చేశారనే సమాచారం మేరకు అధికారులు విచారణ జరిపారు. కేటాయింపులు ఇలా.. సాధారణ ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న విడుదలైంది. అదే రోజు నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లోకి వచ్చాక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల మంజూరు, కేటాయింపులు, నోటిఫికేషన్లు జారీ చేయరాదు. అయితే గత అధికారి మాత్రం అందుకు విరుద్ధంగా పందికోన, రామలింగాయపల్లె సబ్స్టేషన్లను హడావిడిగా పూర్తి చేయించారు. వాటి నిర్వహణను టీడీపీకి చెందిన కాంట్రాక్టర్‌కు మార్చి 18న కేటాయిస్తూ సంతకాలు చేశారు. రూ.70లక్షల వసూలు.. రామలింగాయపల్లె, పందికోన సబ్స్టేషన్లు తనకే వచ్చాయని, వాటిలో ఆపరేటర్ పోస్టులు ఇస్తామని నిరుద్యోగుల నుంచి రూ.70లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఒక్కో సబ్‌స్టేషన్‌లో నలుగురు ఆపరేటర్లు, ఒక వాచ్మెన్ ఉంటారు. ఆపరేటర్ పోస్టుకు రూ.8లక్షల నుంచి రూ.10లక్షల వరకు, వాచ్మెన్ ఉద్యోగానికి రూ.5లక్షల వరకు బేరం కుదుర్చుకొని దాదాపు ఇరవై మంది నుంచి అడ్వాన్స్ కింద రూ.70లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. మూడు సార్లు విచారణ.. కోడ్ అమల్లో ఉండగా సబ్స్టేషన్ల కేటాయింపులు జరిగాయని ఓ కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాయింట్ కలెక్టర్–2 మణిమాల తొలుత విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. రెండోసారి చీఫ్ జనరల్ మేనేజర్ లలిత జూన్ 18న క్షేత్రస్థాయికి వెళ్లి సబ్స్టేషన్లు తనిఖీ చేశారు. ఇందులో గతంలో పనిచేసిన అధికారులు నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తరువాత 26, 27వ తేదీల్లో ఎస్పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (తిరుపతి) వెంకటరత్నం విచారణ జరిపారు. బాధితుల నిర్బంధం మోసపోయిన వారిని విచారించేందుకు గత నెల 26న చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ విచారణకు రావడంతో బాధితులను కాంట్రాక్టర్ అడ్డుకున్నారు. ‘మీకు ఉద్యోగాలు వస్తాయి, రాని పక్షంలో మీ డబ్బును తిరిగి ఇస్తాం.. విచారణకు వెళ్లొద్దని నమ్మబలికారు. అయినా వారు బస్సెక్కి వస్తుండగా అడ్డుకొని నిర్బంధించారు. విషయం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దృష్టికి వెళ్లడంతో విజిలెన్స్ అధికారులు బాధితుల అడ్రస్ ద్వారా క్షేత్ర స్థాయిలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. తాను టీడీపీ ఎమ్మెల్సీ అనుచరుడిగా చెప్పుకుంటూ అనేక పైరవీలు చేసుకుంటూ ఎదిగారని విద్యుత్ శాఖలో చర్చ జరుగుతోంది. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆదోనితో పాటు డోన్, కర్నూలు డివిజన్లలో అధికంగా 19 సబ్స్టేషన్లు పొందాడు. కొన్ని టెండర్ల ద్వారా, మరికొన్ని నామినేటెడ్ వర్క్ పేరుతో తీసుకోవడంతోపాటు స్పాట్ బిల్లింగ్ ప్రక్రియ కూడా దక్కించుకున్నాడు. -
ఉద్యోగాల పేరుతో మోసం
కరీంనగర్ క్రైం: ఉద్యోగాల పేరుతో పలువురిని నమ్మించి, రూ.7 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసగాడిని కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పట్టుకున్నారు. ఏసీపీ శోభన్‌కుమార్ సోమవారం కథనం ప్రకారం.. సూర్యాపేటకు చెందిన వెల్ధి రాధాకృష్ణ హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో శ్రీ వెంకటేశ్వర కన్సల్టెన్సీని ఏర్పాటు చేశాడు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలు చేయడం ప్రారంభిం చాడు. 320 మందిని ఉద్యోగాల పేరుతో మోసం చేసి వారి నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేశాడు. రామారావు, రవి చంద్రారెడ్డి, బుట్ట జయరాజ్, నాయిని విద్యాసాగర్, ఈశ్వర వేణుగోపాల్లను అనుచరులుగా ఏర్పాటు చేసుకున్నాడు. కరీంనగర్, వరంగ ల్, ఆదిలాబాద్, ఖమ్మం, మంచిర్యాల, నల్లగొండ, హైదరాబాద్, కర్నూల్, కృష్ణా, పశ్చి మగోదావరి, అనంతపురం జిల్లాలకు చెంది న పలువురు ఇతడి వలలో చిక్కి మోసపోయారు. సెక్రటేరియట్, రెవెన్యూ, కమర్షియ ల్ ట్యాక్స్ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి ఆపైన వసూ లు చేశాడు. కొందరికి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలను కూడా ఇచ్చాడు. గుట్టు వీడింది ఇలా.. కరీంనగర్ మండలం నగునూర్‌కు చెందిన పైడిపాల వెంకటయ్య తనకు తెలిసిన వారిని రాధాకృష్ణకు పరిచయం చేశాడు. వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో వెంకటయ్య రూ. 26 లక్షలు వసూలు చేసి ఇచ్చా డు. రాధాకృష్ణ ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేయడంతో వెంకటయ్య కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ బృందం రాధాకృష్ణను అరెస్టు చేసింది. నాగర్‌కర్నూల్, గోదావరిఖని, నేరేడ్మెట్, అంబర్‌పేట, నల్లగొండ, బహదూర్‌పుర, కరీంనగర్ టుటౌన్, త్రీటౌన్, బేతంచర్ల పోలీస్స్టేషన్లలో రాధాకృష్ణపై పలు కేసులు నమోదయ్యాయి. అతడి నుంచి చెక్‌బుక్స్, విలువైన లావాదేవీలకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఉద్యోగాల పేరుతో బురిడీ
అద్దంకి: నకిలీ డాక్యుమెంట్స్, సీల్స్, ఐడీ కార్డులు ఉపయోగించి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ఎనిమిది మంది నిందితులను అద్దంకి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితులకు సబంధించిన వివరాలను స్థానిక తన కార్యాలయంలో సీఐ హైమారావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. వెల్లంపల్లి శ్రీనివాసులు అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానంటూ తన వద్ద రూ.7 లక్షలు తీసుకుని మోసం చేశాడని ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం కల్లంవారిపాలెం గ్రామానికి చెందిన వీరాంజనేయరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మారెళ్లకు చెందిన వెల్లంపల్లి శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని విచారించగా తీగ లాగితే డొంక కదిలింది. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన ముఠాలో ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం బూచి పాపన్నపాలేనికి చెందిన చింతా చిన్న ఓబయ్య, విజయవాడ బాలాజీ నగర్‌కు చెందిన ముప్పాళ్ల రేఖ, జి.ప్రవీణ్, గన్నవరం మండలం బుద్ధవరం గ్రామానికి చెందిన నక్కా చిన్న వెంకటేశ్వరరావు, పాత గుంటూరులోని రాజీవ్ గృహకల్ప ప్రాంతానికి చెందిన మాలావత్ హనుమంత్‌నాయక్, అనీల్‌కుమార్, రామిరెడ్డి, కొత్తపట్నం ఇందిరమ్మ కాలనీకి చెందిన వి.అంకయ్య, గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన షేక్ హుస్సేన్, సంతమాగులూరు మండలం ఎనిగపాడుకు చెందిన తలారీ మాధవ, గుంటూరులోని పండరీపురానికి చెందిన ముప్పాళ్ల భవ్య, అద్దంకి పట్టణంలోని గరటయ్య కాలనీ చెందిన వర్మ(రవి) అనే 13 మంది ఉన్నట్లు గుర్తించారు. వారిలో వెల్లంపల్లి శ్రీనివాసులు, చింతా చిన్న ఓబయ్య, ముప్పాళ్ల రేఖ, నక్కా చిన్న వెంకటేశ్వరరావు, వి.అంకయ్య, షేక్ హుస్సేన్, తలారి మాధవ, ముప్పాళ్ల భవ్య అనే ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని సీఐ విశ్వాసం వ్యక్తం చేశారు. నిందితులను కోర్టులో హాజరు పర్చనున్నట్లు పేర్కొన్నారు. -
మళ్లీ అక్రమ మార్గమే!
సాక్షి, మచిలీపట్నం : సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ ఏ)లో మళ్లీ అక్రమాలకు తెర లేచింది. అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. అక్రమ మార్గం ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు నేడు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. కాగా ఉద్యోగాల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలన్న ఉద్దేశ్యంతో కలెక్టర్ ఏర్పాటు చేసిన కమిటీ ఈ అక్రమాలను ఎందుకు నిర్మూలించలేకపోయిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవేళ అనర్హులకు ఉద్యోగాలు ఇస్తున్నారన్న విషయం తెలిసినా మిన్నకుండటం వెనుక ఆంతర్యం ఏమిటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే... ఎస్ఎస్ఏ పరిధిలో కొన్ని జిల్లాస్థాయి ఉద్యోగాల భర్తీ ప్రధాన్యాంశంగా మా రింది. అందులో సెక్టోరియల్ పోస్టులు ఆరు, అసిస్టెంటెంట్ సెక్టోరియల్ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి. సెక్టోరియల్ పోస్టులు ఏఎంవో, ఏఎల్‌ఎస్‌వో, సీఎంవో, జీసీడీవో, ఎంఐఎస్ పీఎల్జీ కోఆర్డినేటర్, ఐఈడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టులలో అర్హులైన గెజిటెడ్ ర్యాంకు కలిగిన వారితో భర్తీ చేయాలి. అదే విధంగా అసిస్టెంటెంట్ సెక్టోరియల్ పోస్టులైన ఏపీవో (అసిస్టెంటెంట్ ప్రొగ్రామింగ్ ఆఫీసర్), ఏఎస్వో(అసిస్టెంటెంటు సెక్టోరియల్ ఆఫిసర్) పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టులకు స్కూలు అసిస్టెంటెంట్ కేడర్‌కు చెందిన వారితో భర్తీ చేయాలి. ఆయా పోస్టులకు అర్హులైన వారికి ఇవ్వాలి. అదే విధంగా ఎస్ఎస్ఏలో గతంలో ఐదేళ్లు పని చేసిన వారికి ఇవ్వకూడదనే ఎస్పీడీ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇందుకు విరుద్ధంగా తక్కువ కేడర్ అయిన ఎస్జీటీలతో భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిపై సాక్షిలో వరుస కథనాలు ప్రచురించడంతో స్పందించిన కలెక్టర్ నియామకాలను రద్దు చేశారు. ఈ రద్దు కూడా కాగితాలకే పరిమితమైందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రద్దు చేసినా కొందరు ఆయా పోస్టు ఉద్యోగాల్లో కొనసాగినట్లుగా తెలు స్తోంది. ఇందుకు నిదర్శనం వారు డ్రా చేసిన జీతాల జాబితాలను చూస్తే అర్థమవుతుందనే వాదన ఎస్ఎస్ఏ కార్యాలయం వారే చెబుతుండటం గమనార్హం. రద్దు చేసినట్లు ప్రకటించి కొత్తగా మళ్లీ ఆయా పోస్టులను భర్తీ చేయడానికి జేసీ, డీఆర్వో, ఎస్ఎస్ఏ పీఓతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశా రు. ఆ కమిటీ ద్వారానే నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో కొంత కాలం మిన్నకుండిపోయిన అధికారులు ప్రస్తుతం తిరిగి అనర్హు లకే పోస్టులు కట్టబెట్టినట్లు తెలి సిం ది. కొనసాగుతున్న వారినే మళ్లీ తీసుకుంటున్నారనే వాదన కూడా ఉంది. ఇంత జరుగుతున్నా కమిటీ ఏం చేస్తోం దన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరిగిందంటే... సెక్టోరియల్ పోస్టులు గెజిటెడ్ వారితో, అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులు స్కూల్ అసిస్టెంట్‌తో భర్తీ చేయాలి. దీనికి విరుద్ధంగా ఎస్జీటీ క్యాడర్‌తో భర్తీ చేసినట్లు సమాచారం. ఎస్ఎస్ఏ శాఖలో 5 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన వారు తిరిగి అదే శాఖలో విధులు నిర్వహించేందుకు అనర్హులు. ఇదే విషయాన్ని ఆ శాఖ రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలున్నాయి. కానీ పోస్టు గ్రాడ్యుయేషన్ లేని వారిని సైతం ఉద్యోగాలకు ఎంపిక చేయడం వెనుక అంతర్యమేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని..
హైదరాబాద్: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మభ్యపెట్టి యువతుల నుంచి బంగారు ఆభరణాలు దోచుకుంటున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ. 4 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి వారిని ఇంటర్వ్యూల పేరుతో నిర్మానుష ప్రదేశాలకు తీసుకెళ్లి వారి వద్ద ఉన్న ఆభరణాలు, నగదు దోచుకుంటున్న రావళ్లె స్వరాజ్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు డీసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలు తెలిపారు. jobs fraud, software company, man arrest, ఉద్యోగాల మోసం, సాఫ్ట్ వేర్ కంపెనీలు, యువకుడి అరెస్టు