సాక్షి, మచిలీపట్నం : సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్ ఏ)లో మళ్లీ అక్రమాలకు తెర లేచింది. అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. అక్రమ మార్గం ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు నేడు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. కాగా ఉద్యోగాల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలన్న ఉద్దేశ్యంతో కలెక్టర్ ఏర్పాటు చేసిన కమిటీ ఈ అక్రమాలను ఎందుకు నిర్మూలించలేకపోయిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవేళ అనర్హులకు ఉద్యోగాలు ఇస్తున్నారన్న విషయం తెలిసినా మిన్నకుండటం వెనుక ఆంతర్యం ఏమిటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే...
ఎస్‌ఎస్‌ఏ పరిధిలో కొన్ని జిల్లాస్థాయి ఉద్యోగాల భర్తీ ప్రధాన్యాంశంగా మా రింది. అందులో సెక్టోరియల్ పోస్టులు ఆరు, అసిస్టెంటెంట్ సెక్టోరియల్ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి. సెక్టోరియల్ పోస్టులు ఏఎంవో, ఏఎల్‌ఎస్‌వో, సీఎంవో, జీసీడీవో, ఎంఐఎస్ పీఎల్‌జీ కోఆర్డినేటర్, ఐఈడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టులలో అర్హులైన గెజిటెడ్ ర్యాంకు కలిగిన వారితో భర్తీ చేయాలి. అదే విధంగా అసిస్టెంటెంట్ సెక్టోరియల్ పోస్టులైన ఏపీవో (అసిస్టెంటెంట్ ప్రొగ్రామింగ్ ఆఫీసర్), ఏఎస్‌వో(అసిస్టెంటెంటు సెక్టోరియల్ ఆఫిసర్) పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టులకు స్కూలు అసిస్టెంటెంట్ కేడర్‌కు చెందిన వారితో భర్తీ చేయాలి. ఆయా పోస్టులకు అర్హులైన వారికి ఇవ్వాలి. అదే విధంగా ఎస్‌ఎస్‌ఏలో గతంలో ఐదేళ్లు పని చేసిన వారికి ఇవ్వకూడదనే ఎస్‌పీడీ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇందుకు విరుద్ధంగా తక్కువ కేడర్ అయిన ఎస్జీటీలతో భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిపై సాక్షిలో వరుస కథనాలు ప్రచురించడంతో స్పందించిన కలెక్టర్ నియామకాలను రద్దు చేశారు.
ఈ రద్దు కూడా కాగితాలకే పరిమితమైందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రద్దు చేసినా కొందరు ఆయా పోస్టు ఉద్యోగాల్లో కొనసాగినట్లుగా తెలు స్తోంది. ఇందుకు నిదర్శనం వారు డ్రా చేసిన జీతాల జాబితాలను చూస్తే అర్థమవుతుందనే వాదన ఎస్‌ఎస్‌ఏ కార్యాలయం వారే చెబుతుండటం గమనార్హం. రద్దు చేసినట్లు ప్రకటించి కొత్తగా మళ్లీ ఆయా పోస్టులను భర్తీ చేయడానికి జేసీ, డీఆర్వో, ఎస్‌ఎస్‌ఏ పీఓతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశా రు. ఆ కమిటీ ద్వారానే నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో కొంత కాలం మిన్నకుండిపోయిన అధికారులు ప్రస్తుతం తిరిగి అనర్హు లకే పోస్టులు కట్టబెట్టినట్లు తెలి సిం ది. కొనసాగుతున్న వారినే మళ్లీ తీసుకుంటున్నారనే వాదన కూడా ఉంది. ఇంత జరుగుతున్నా కమిటీ ఏం చేస్తోం దన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏం జరిగిందంటే...
సెక్టోరియల్ పోస్టులు గెజిటెడ్ వారితో, అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులు స్కూల్ అసిస్టెంట్‌తో భర్తీ చేయాలి. దీనికి విరుద్ధంగా ఎస్‌జీటీ క్యాడర్‌తో భర్తీ చేసినట్లు సమాచారం. ఎస్‌ఎస్‌ఏ శాఖలో 5 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన వారు తిరిగి అదే శాఖలో విధులు నిర్వహించేందుకు అనర్హులు. ఇదే విషయాన్ని ఆ శాఖ రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలున్నాయి. కానీ పోస్టు గ్రాడ్యుయేషన్ లేని వారిని సైతం ఉద్యోగాలకు ఎంపిక చేయడం వెనుక అంతర్యమేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment