vehicles seized
-
ఇవి పార్కింగ్‌లో పెట్టిన బండ్లు కావు..!
ఇక్కడ కనిపిస్తున్న ఈ బండ్లు పార్కింగ్ చేసినవి కావు. ఏదో మార్కెట్‌కు వచ్చి నిలిపి ఉంచిన బండ్లయితే అసలే కావు. లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా రోడ్లపై తిరుగుతున్న వెహికిల్స్‌పై పోలీసులు కొరడా ఝులిపించారు. మంగళవారం ఉదయం వివిధ కూడళ్లలో సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. సడలింపు సమయం ఉదయం 10 గంటలు ముగిసి తర్వాత కూడా పలువురు రోడ్లపైకి వచ్చారు. అలా వచ్చిన బండ్లను తనిఖీ చేసి సీజ్ చేశారు. సాయంత్రం వరకు 7,059 కేసులు నమోదు చేయగా.. 2099 వాహనాలను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను కోర్టులో డిపాజిట్ చేస్తామని సీపీ వెల్లడించారు. - కరీంనగర్‌క్రైం -
‘వాకింగ్ కోసం బయటకు రావొద్దు.. ’
హైదరాబాద్ : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు మరోసారి హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు.. 24 గంటలు ప్రతి ఒక్కరి కదిలికలని గమనిస్తున్నారని చెప్పారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్యలో ప్రజలెవ్వరూ రోడ్లపైకి రావద్దని సూచించారు. ఇదేకాకుండా.. లాక్డౌన్ నిబంధనలు ఎవరూ ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసకుంటామని తెలిపారు. (చదవండి : అధికారులపై మంత్రి హరీష్ ఆగ్రహం) లాక్డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి 20,591 వాహనాలకు సీజ్ చేశామని.. అందులో 16,000 టూ వీలర్స్, 1,401, త్రీ వీలర్స్, 2,246 ఫోర్ వీలర్స్, 144 ఇతర వాహనాలు ఉన్నాయని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. 24 గంటల పాటు ప్రత్యేక తనిఖీలు చేపడుతూ.. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించినవారిపై కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు మొత్తంగా నిబంధనలు ఉల్లంఘించిన 9,15,182 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించడం ద్వారా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రించవచ్చని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. అలాగే నగరవాసులకు పలు సూచనలు జారీచేశారు. ► ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ కోసమని బయటకు రావొద్దు. ► బర్త్‌డే పార్టీలు, ఇతర పార్టీలు.. అలాగే జనసముహాలకు అనుమతి లేదు ► అన్ని షాపులు, సంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలు సాయంత్రం 6 గంటల్లోపే మూసివేయాలి.. అప్పుడే అందులో పనిచేస్తున్నవారు సాయంత్రం 7 గంటల్లోపు ఇంటికి చేరుకోవడానికి వీలు పడుతుంది.. ఒకవేళ సాయంత్రం 7 గంటల తర్వాత రోడ్డుపై ఎవరైనా వాహనాలతో కనిపిస్తే వాటిని సీజ్ చేస్తాం. ► బంధువుల ఇళ్లకు వెళ్తున్నా, ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా వంటి పిచ్చి సాకులతో ప్రజలు బయటకురావొద్దు. ► లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా, సరైన కారణాలు లేకుండా రోడ్లపైకి వచ్చేవారి వాహనాలను సీజ్ చేసి, ఐపీసీ సెక్షన్ 188, ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేస్తాం. -
కార్డన్ సెర్చ్.. పోలీసుల అదుపులో 25మంది
-
కార్డన్ సెర్చ్.. పోలీసుల అదుపులో 25మంది
హైదరాబాద్: పాతబస్తీలోని కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కమేళ, మెయిన్ పురా, మిశ్రీ గంజ్ ప్రాంతంలో సౌత్ జోన్ డీసీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం వేకువజామున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. అక్రమంగా జంతువుల మాంసం విక్రయిస్తున్న 12 కబేళాలపై దాడులు నిర్వహించారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మాంసాన్ని పరిశీలించారు. ఈ దాడుల్లో 25 మంది అనుమానితులు, సరైన ధ్రువపత్రాలులేని 5 ఆటోలు, 25 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మత్తుపదార్థాలను 300 రూపాయలకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. -
జూబ్లీహిల్స్‌లో డ్రంకన్ అండ్ డ్రైవ్ : వాహనాలు సీజ్
హైదరాబాద్ : మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్లో శనివారం రాత్రి పోలీసులు డ్రంకన్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 11 కార్లు, 12 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో రెచ్చిపోయిన నైజీరియన్లు
హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ మాఫియాలో ఆరితేరిన నైజీరియన్లు ఇక పోలీసులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఫిలింనగర్లో నలుగురు నైజీరియన్లు హల్చల్ సృష్టించారు. డ్రంకన్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై దాడికి యత్నించారు. హైదరాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి పలుచోట్ల పోలీసులు డ్రంకన్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఫిలింనగర్లో తనిఖీలు చేస్తున్న పోలీసులపై నైజీరియన్లు దురుసుగా ప్రవర్తించారు. బ్రీత్ అనలైజర్ పరీక్షను నిరాకరిస్తూ రోడ్డుపై గందరగోళం చేశారు. పోలీసులపై దాడికి యత్నించడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. నైజీరియన్లపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి రోడ్డుపై బైఠాయించి పోలీసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. మద్యం సేవించి వాహనాలు నడిపిన మరికొందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. -
కార్డన్ సెర్చ్.. 40 వాహనాలు సీజ్
కరీంనగర్: కరీంనగర్ హుస్సేన్‌పురాలో పోలీసులు బుధవారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ ఉదయం 5.30 గంటల నుంచి ప్రారంభమైన ఈ కార్డన్ సెర్చ్ 9 గంటల సమయంలోనూ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని 35 ద్విచక్రవాహనాలను, 5 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 450 లీటర్ల కిరోసిన్(రేషన్)ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కమిషనర్ కమలాసన్‌రెడ్డి, ఏసీపీ రామారావుల ఆధ్వర్యంలో పదిమంది సీఐలు, 300మంది పోలీసు సిబ్బంది ఈ కార్డన్ సెర్చ్‌లో పాల్గొన్నారు. -
ఆర్టీఏ కొరడా.. బస్సులు సీజ్
-
ఆర్టీఏ కొరడా.. బస్సులు సీజ్
హైదరాబాద్: నగరంలో ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. పలు ఏరియాలలో ఆర్టీఏ విస్తృత తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎల్బీనగర్ లో తనిఖీలు చేపట్టిన ఆర్టీఏ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న నాలుగు ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. మరో 10 ప్రైవేట్ బస్సుల యజమానులపై కేసులు నమోదుచేశారు. వారి వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేవని అందుకే చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
కార్డన్ సెర్చ్.. 49 వాహనాలు సీజ్
గరిడేపల్లి: సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో పోలీసులు కార్డన్‌సెర్చ్ చేపట్టారు. శనివారం వేకువజామున మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు సాగిన ఈ తనిఖీలలో నలుగురు ఎస్సైలతోపాటు 70 మంది పోలీసు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. స్థానిక తుంబాయిగడ్డ ప్రాంతంలో అన్ని ఇళ్లల్లో సోదాలు చేసిన పోలీసులు కొందరు అనుమానితులను ప్రశ్నించారు. ఎలాంటి పత్రాలు లేని 47 ద్విచక్రవాహనాలతోపాటు రెండు ఆటోలను సీజ్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఓవర్‌లోడు వాహనాలు సీజ్
హైదరాబాద్: జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించిన అధికారులు ఓవర్‌లోడుతో వెళ్తున్న 32 వాహనాలను సీజ్ చేశారు. వరంగల్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై గురువారం ఉదయం ఆర్టీఏ, విజిలెన్స్, సేల్స్‌టాక్స్ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓవర్‌లోడుతో వెళ్తున్న 32 వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేయడంతో పాటు సుమారు రూ. 4 లక్షల జరిమానా విధించారు. -
పెద్దపల్లి జిల్లాలో కార్డన్‌సెర్చ్
ధర్మారం : పెద్దపల్లి జిల్లాలో పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ధర్మారం మండలం బంజేరుపల్లి సీఐ మహేశ్ ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తయారు చేస్తున్న 5 లీటర్ల గుడుంబా, 60 లీటర్ల పానకాన్ని ధ్వంసం చేశారు. ఎలాంటి పత్రాలు లేని 36 ద్విచక్రవాహనాలు, 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్.. 25 వాహనాలు సీజ్
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 25 మంది వాహనదారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి వద్ద నుంచి 21 బైక్‌లు, 3 కార్లు, ఒక లారీ సీజ్ చేసినట్లు సమాచారం. -
డ్రంక్ అండ్ డ్రైవ్.. 10 వాహనాలు సీజ్
-
సిద్దిపేటలో కార్డన్ సెర్చ్.. వాహనాలు సీజ్
సిద్దిపేట జిల్లా కేంద్రంలో పోలీసులు శనివారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలోని వీరముష్టికాలనీలో సీపీ శివకుమార్ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ చేశారు. తనిఖీలలో భాగంగా సరైన డాక్యుమెంట్లు, ఆధారాలు చూపించని కారణంగా 25 వాహనాలను సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
30 ఓవర్ లోడ్ వాహనాలు సీజ్
వరంగల్: అనుమతులు లేని వాహనాలపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. ఓవర్‌లోడుతో పాటు అనుమతి పత్రాలు లేకుండా సరుకులు రవాణా చేస్తున్న వాహనాలను తనిఖీలు చేపట్టారు. వరంగల్ అర్బన్ జిల్లా ఖిల్లావరంగల్ మండల పరిధిలో శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆర్టీఏ, విజిలెన్స్ అధికారులు పరిమితికి మించి లోడును తీసుకెళ్తున్న 30 లారీలను సీజ్ చేసి ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు. -
ఐడియా అదుర్స్
కేజ్‌వీల్స్ ట్రాక్టర్ల రాకపోకలపై ఆంక్షలు రోడ్డెక్కితే కొరడా ఝళిపిస్తున్న అధికారులు ప్రత్యామ్నయం ఆలోచించిన రైతులు ప్రత్యేక ట్రాలీలపై ట్రాక్టర్ల తరలింపు మోర్తాడ్:రోడ్లపై కేజ్‌వీల్స్ ట్రాక్టర్ల రాకపోకలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డుపై కనబడితే చాలు జరిమానాలు, కేసు నమోదులతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తున్నారు. దీంతో కేజ్‌వీల్స్ ట్రాక్టర్లను పొలాల వరకు తరలించడం రైతులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే అన్నదాతలు తమ ఆలోచనకు పదును పెట్టారు. రోడ్లు పాడవకుండా కేజ్‌వీల్స్ ట్రాక్టర్‌ను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేజ్‌వీల్స్ ఉన్న ట్రాక్టర్‌ను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడానికి ప్రత్యేకంగా ట్రాలీని తయారు చేయించారు. ఈ ట్రాలీలో కేజ్‌వీల్స్‌తో కూడిన వాహనాన్ని ఉంచి, మరో ట్రాక్టర్ సాయంతో పొలాలకు తరలిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతో వరినాట్లు జోరందుకున్నాయి. వరినాట్లు వేసేందుకు కేజ్‌వీల్స్‌తో పొలాలను దమ్ము చేస్తారు. ఎడ్లతో దమ్ము చేసే విధానం ఎప్పుడో కనుమరుగైంది. రైతులు పూర్తిగా యాంత్రీకరణపైనే ఆధారపడ్డారు. కేజ్‌వీల్స్ ఉన్న ట్రాక్టర్లతో దమ్ము చేసి నాట్లు వేస్తున్నారు. అయితే కేజ్‌వీల్స్ ఉన్న ట్రాక్టర్లు రోడ్లపై వెళ్తుండడంతో రహదారులు త్వరగా దెబ్బ తింటున్నాయి. ఎంతో ఖర్చు చేసి తారు రొడ్లు నిర్మిస్తే కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్ల రాకపోకలతో రహదారులను పాడు చేస్తున్నారని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. రోడ్లపై కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్లను తిప్పడాన్ని పూర్తిగా నిషేధించింది. ఒకవేళ ఎవరైనా కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్లను తిప్పితే జరిమానాల విధింపుతో పాటు వాహనాలను సీజ్ చేస్తున్నారు. కేజ్‌వీల్స్‌ను ట్రాక్టర్‌కు అమర్చిన తరువాత వాటిని తొలగించి మళ్లీ అమర్చాలంటే అంత సులభం కాదు. అలాగని రోడ్లపై తిప్పితే అధికారులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేజ్‌వీల్స్ ట్రాక్టర్లను తరలించేందుకు మోర్తాడ్ మున్నూరు కాపు సంఘానికి చెందిన కొందరు రైతులు ప్రత్యేకంగా ట్రాలీని తయారు చేయించారు. దీనిపై కేజ్‌వీల్స్ ట్రాక్టర్‌ను ఉంచి, మరో ట్రాక్టర్ సాయంతో పంట పొలాలకు తరలిస్తున్నారు. ట్రాలీ తయారీకి రూ.70 వేల వరకు ఖర్చయిందని రైతులు తెలిపారు. తమ కేజ్‌వీల్స్ ట్రాక్టర్లతో పాటు ఇతరుల వాహనాలు కూడా తరలించేందుకు అద్దెకు ఇస్తున్నారు. దూరాన్ని బట్టి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. -
రూ.37 లక్షల ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు : అక్రమంగా తరలిస్తున్న రూ.37 లక్షల విలువైన 31 ఎర్రచందనం దుంగలను శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్టు అటవీ శాఖ, పోలీసు అధికారులు తెలిపారు. అలాగే ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశామన్నారు. టాటాఏస్ వాహనం, మినీ ట్రక్కును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. చిత్తూరు సీఐ వెంకటప్ప మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని ఇరువారం కూడలి వద్ద వాహనాల తనిఖీ చేపట్టామన్నారు. తిరుపతి నుంచి వచ్చిన టాటా ఏస్ పరిశీలించగా మూడు ఎర్రచందంనం దుంగలను గుర్తించామని తెలిపారు. వాటిని తీసుకెళుతున్న విఎం.సెల్వం(40)ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. విచారణలో సేలంకు చెందిన చిత్తయ్య న్ ఆదేశాలతో తిరుపతి నుంచి ఎర్రచందనం దుంగల్ని తీసుకెళుతున్నట్లు అంగీకరించాడని తెలిపారు. వాహ నం, దుంగల విలు వ రూ.5 లక్షలు ఉంటుందన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించామన్నారు. భాకరాపేట రేంజర్ రఘునాథ్ మాట్లాడుతూ తలకొన సెంట్రల్ బీట్ పరిదిలో కూంబింగ్ చేస్తుండగా ఎర్రావారిపాళెం వుండలం కూరపర్తివారిపల్లెకు చెందిన చెంగల్‌రెడ్డి ఎర్రచందనం దుంగలు తీసుకొస్తుండగా పట్టుకున్నావుని చెప్పారు. విచారణలో మరోచోట రెండు దుంగలు ఉన్నట్లు చెప్పడంతో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నావుని వివరించారు. వాటి విలు వ రూ.2 లక్షలు ఉంటుందన్నారు. బంగారుపాళెం పోలీసులు మా ట్లాడుతూ కాణిపాకం బైపాస్ రోడ్డు లో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వాహనం వస్తోందన్న సమాచారంతో నిఘా పెట్టామన్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా దుండగులు అశోక్ లైలాండ్ మినీ ట్రక్కును బంగారుపాళెం వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో ఆపి పారిపోయారని తెలిపారు. వాహనంలో పరిశీలించగా 25 ఎర్రచందనం దుంగలు ఉన్నట్టు గుర్తించామన్నారు. వాటిని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వీటి విలువ సమూరు రూ.30 లక్షలు ఉంటుందని వివరించారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ : 8 మందిపై కేసులు నమోదు
శంషాబాద్: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై రంగారెడ్డి జిల్లా పోలీసులు శనివారం రాత్రి పంజా విసిరారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే రహదారిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టిన శంషాబాద్ ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. 3 కార్లు, 6 బైక్‌లు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. 8 మందిని కోర్టులో హాజరు చేస్తామని పోలీసులు తెలిపారు. -
కార్డన్ సెర్చ్.. 40 వాహనాలు స్వాధీనం
హైదరాబాద్: మాదాపూర్, పంజగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ఆదివారం వేకువజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ సిద్ధిక్‌నగర్‌లో డీసీపీ కార్తికేయ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు ఆదివారం ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలోనూ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. హాస్టళ్లలో తనిఖీల సందర్భంగా 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇసుక ట్రాక్టర్లు సీజ్.. ముగ్గురిపై కేసు నమోదు
అనంతపురం: అనంతపురం జిల్లాలో మూడు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసినట్టు బ్రహ్మసముద్రం ఎస్ఐ శివ తెలిపారు. ఈ నేపథ్యంలో తమ వాహనాలు సీజ్ చేస్తావా అంటూ టీడీపీ నేతలు దుర్భాషలాడినట్టు ఎస్ఐ తెలిపారు. ఇసుక ట్రాక్టర్లను టీడీపీ నేతలు దౌర్జన్యంగా తీసుకెళ్లినట్టు ఆయన చెప్పారు. టీడీపీ సర్పంచ్ తిమ్మప్ప చౌదరి సహా ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శివ పేర్కొన్నారు.