డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో రెచ్చిపోయిన నైజీరియన్లు | Nigerians attack on film nagar drunk and drive police | Sakshi
Sakshi News home page

డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో రెచ్చిపోయిన నైజీరియన్లు

Published Sat, Feb 4 2017 6:54 AM | Last Updated on Wed, Oct 17 2018 5:28 PM

డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో రెచ్చిపోయిన నైజీరియన్లు - Sakshi

డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో రెచ్చిపోయిన నైజీరియన్లు

ఫిలింనగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి నలుగురు నైజీరియన్లు హల్‌చల్‌ సృష్టించారు.

హైదరాబాద్‌ : నగరంలో డ్రగ్స్‌ మాఫియాలో ఆరితేరిన నైజీరియన్లు ఇక పోలీసులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఫిలింనగర్‌లో నలుగురు నైజీరియన్లు హల్‌చల్‌ సృష్టించారు. డ్రంకన్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న పోలీసులపై దాడికి యత్నించారు.

హైదరాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి పలుచోట్ల పోలీసులు డ్రంకన్‌ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఫిలింనగర్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులపై నైజీరియన్లు దురుసుగా ప్రవర్తించారు. బ్రీత్ అనలైజర్ పరీక్షను నిరాకరిస్తూ రోడ్డుపై గందరగోళం చేశారు. పోలీసులపై దాడికి యత్నించడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. నైజీరియన్లపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి రోడ్డుపై బైఠాయించి పోలీసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. మద్యం సేవించి వాహనాలు నడిపిన మరికొందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement