లంగర్‌హౌస్ : నగరంలో నైజీరియన్లు మరోసారి టై పుట్టించారు. డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపై మద్యం మత్తులో ఉన్న నైజీరియన్లు దాడికి దిగారు. దీంతో వారు స్థానికుల సహాయంతో ఒక నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్దరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు కథనం మేరకు నైజీరియాకు చెందిన షోమ్యివ అబయోమి యూసుఫ్ (26) ఉన్నత చదువుల కోసం ఇండియాకు వచ్చాడు. మణికొండలోని అత్తాపూర్ టౌన్‌షిప్‌లో ఉంటున్న ఇతను శుక్రవారం రాత్రి నార్సింగి ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి డ్రగ్స్, మ ద్యం సేవించాడు.
అర్దరాత్రి దాటిన తర్వాత స్నేహితుల తో కలిసి కారు(ఏపీ 28 డీఈ 7410)లో మెహిదీపట్నానికి వెళుతుండగా లంగర్‌హౌస్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న టోలీచౌకీ ట్రాఫిక్ పోలీసులు వారి కారును ఆపి మద్యం పరీక్ష చేసుకోవాలని కోరారు. అయితే అందుకు వారు నిరాకరించడంతో పోలీసులతో వారికి వాగ్వివాదం జరిగింది. దీనిని గమనించిన ఎస్సై బాలకిషన్‌గౌడ్ అక్కడికి వెళ్లి నోట్లో పైప్ పెట్టే ప్రయత్నం చేస్తుండగా నైజీరియన్లు ఒక్కసారిగా అతనిపై దాడికి దిగారు.
కానిస్టేబుళ్లు ఆపడానికి ప్రయత్నించగా వారిని నెట్టేసి పారిపోతుండగా అబయోమి చెప్పు తెగిపోవడంతో అతను కిందపడ్డాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు స్థానికుల సహాయంతో అతన్ని అదుపులోకి తీసుకొని లంగర్‌హౌస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని శనివారం రిమాండ్‌కు తరలించారు.
ట్రాఫిక్ పోలీసులపై నైజీరియన్ల దాడి
Published Sun, Apr 19 2015 1:08 AM | Last Updated on Wed, Oct 17 2018 5:28 PM
Advertisement