![డ్రంక్ అండ్ డ్రైవ్ : 8 మందిపై కేసులు నమోదు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/51455275369_625x300_0.jpg.webp?itok=kVy8jVR-)
డ్రంక్ అండ్ డ్రైవ్ : 8 మందిపై కేసులు నమోదు
శంషాబాద్: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై రంగారెడ్డి జిల్లా పోలీసులు శనివారం రాత్రి పంజా విసిరారు.
శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే రహదారిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టిన శంషాబాద్ ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. 3 కార్లు, 6 బైక్‌లు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. 8 మందిని కోర్టులో హాజరు చేస్తామని పోలీసులు తెలిపారు.