
హైదరాబాద్ : లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు మరోసారి హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు.. 24 గంటలు ప్రతి ఒక్కరి కదిలికలని గమనిస్తున్నారని చెప్పారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్యలో ప్రజలెవ్వరూ రోడ్లపైకి రావద్దని సూచించారు. ఇదేకాకుండా.. లాక్‌డౌన్ నిబంధనలు ఎవరూ ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసకుంటామని తెలిపారు. (చదవండి : అధికారులపై మంత్రి హరీష్ ఆగ్రహం)
లాక్‌డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి 20,591 వాహనాలకు సీజ్ చేశామని.. అందులో 16,000 టూ వీలర్స్, 1,401, త్రీ వీలర్స్, 2,246 ఫోర్ వీలర్స్, 144 ఇతర వాహనాలు ఉన్నాయని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. 24 గంటల పాటు ప్రత్యేక తనిఖీలు చేపడుతూ.. లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించినవారిపై కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు మొత్తంగా నిబంధనలు ఉల్లంఘించిన 9,15,182 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలు పాటించడం ద్వారా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రించవచ్చని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. అలాగే నగరవాసులకు పలు సూచనలు జారీచేశారు.
► ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ కోసమని బయటకు రావొద్దు.
► బర్త్‌డే పార్టీలు, ఇతర పార్టీలు.. అలాగే జనసముహాలకు అనుమతి లేదు
► అన్ని షాపులు, సంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలు సాయంత్రం 6 గంటల్లోపే మూసివేయాలి.. అప్పుడే అందులో పనిచేస్తున్నవారు సాయంత్రం 7 గంటల్లోపు ఇంటికి చేరుకోవడానికి వీలు పడుతుంది.. ఒకవేళ సాయంత్రం 7 గంటల తర్వాత రోడ్డుపై ఎవరైనా వాహనాలతో కనిపిస్తే వాటిని సీజ్ చేస్తాం.
► బంధువుల ఇళ్లకు వెళ్తున్నా, ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా వంటి పిచ్చి సాకులతో ప్రజలు బయటకురావొద్దు.
► లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుండా, సరైన కారణాలు లేకుండా రోడ్లపైకి వచ్చేవారి వాహనాలను సీజ్ చేసి, ఐపీసీ సెక్షన్ 188, ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment