
కార్డన్ సెర్చ్: 250 వాహనాలు స్వాధీనం
వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ విశ్వజిత్ ఆధ్వర్యంలో డీఎస్పీ సుధాకర్, సీఐలు, అన్ని పోలీసు స్టేషన్ల ఎస్సైలు, సిబ్బంది మొత్తం 300మంది దేవస్థానం వసతి గృహాలు, ప్రైవేటు లాడ్జిలు, ఇళ్లల్లో తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా 90మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 250 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.