సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్ర నగర్‌లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 250 మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలో సరైన ధ్రువపత్రాలు లేని 62 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. తాము అదుపులోకి తీసుకున్న 15 మంది అనుమనితులో ముగ్గురు కరడుగట్టిన నేరస్థులున్నారని సమాచారం. నిషేధిత కార్బైడ్‌తో మామిడి పండ్లను మగ్గిస్తున ఒమర్ అనే నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని 300 ప్యాకెట్ల కార్బైడ్‌ని సీజ్ చేశారు. కార్డెన్ సెర్చ్ నిర్వహించేందుకు సహకరించాలని పాతబస్తీ ప్రజలను కోరినట్లు డీసీపీ వి సత్యనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment