madannapet
-
మాదన్నపేటలో భారీ అగ్నిప్రమాదం
-
మాదన్నపేట మార్కెట్.. డబ్బు కొట్టు..బండి పెట్టు!
సాక్షి, చంచల్‌గూడ: పాతబస్తీలోని మాదన్నపేట మార్కెట్లో దళారీలు పేట్రేగిపోతున్నారు. ఈ మార్కెట్ ప్రైవేటు యాజమాన్యాది కావడంతో ప్రభుత్వ అజమాయిషీ ఉండదు. కేవలం రైతుల కూరగాయలు అమ్మిపెట్టే కమీషన్ ఏజెంట్ల వద్ద నుంచి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మార్కెట్ ఫీజు వసూలు చేస్తుంది. ఆకు కూరల విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం రైతులు, కమీషన్ ఏజెంట్ల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయదు. పలు రకాల ఆకు కూరలుతో పాటు కొత్తిమీర, కరివేపాకు విక్రయించేందుకు రంగారెడ్డి జిల్లాతో పాటు పలు రాష్ట్రాల నుంచి రైతులు నేరుగా ఈ మార్కెట్‌కు వస్తుంటారు. మార్కెట్లోని వ్యాపారులు రైతుల వద్ద నుంచి కూరగాయలు కొనుగోలు చేసి హోల్‌సేల్, రిటైల్ విక్రయాలు నిర్వహిస్తుంటారు. వాహనానికి రూ. 500 నుంచి రూ. 2 వేలు వసూలు ఇదిలా ఉండగా కొందరు రైతులు తమ వాహనాల్లో కూరగాయలు తెచ్చి నేరుగా అమ్మకాలు చేస్తారు. వాహనం నిలిపి విక్రయాలు చేస్తున్నందుకు కొందరు స్థానికులు, పాత నేరస్తులు రైతుల నుంచి ప్రతి రోజూ అక్రమంగా డబ్బులు దండుకుంటున్నారు. ఒక్కో వాహనానికి రూ. 500 నుంచి రూ. 2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అమ్మకాలను బట్టి మామూళ్ల ధరలు నిర్ణయిస్తున్నారు. రైతులు స్థానికేతరులు కావడంతో అక్రమార్కులకు తలొగ్గి గత్యంతరం లేక డబ్బులు చెల్లిచుకుంటున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి వ్యవసాయ మార్కెట్, పోలీసు శాఖ దృష్టి సారించి రైతులపై జరుగుతున్న దౌర్జన్యాలను అడ్డుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. పీడీ యాక్ట్ నమోదు చేయాలి మాదన్నపేట కూరగాయల మార్కెట్లో అక్రమ వసూళ్లపై పోలీసులు, మార్కెట్ శాఖ దృష్టి సారించాలి. కూరగాయల రైతుల నుంచి కమీషన్ వసూలు చేసే వ్యవస్థను రద్దు చేయాలి. 2 శాతం కమీషన్ తీసుకోవాల్సిన ఏజెంట్లు అక్రమంగా 10 శాతం వరకు వసూలు చేస్తున్నా మార్కెట్ శాఖ చర్యలు తీసుకోవడం లేదు. ఏజెంట్ల ఆగడాలను అరికట్టేందుకు మార్కెట్లో ఫిర్యాదు సెల్‌ను ఏర్పాటు చేయాలి. రైతులను వేధిస్తే పీడీ యాక్ట్ నమోదు చేయాలి. – సహదేవ్‌యాదవ్, మాజీ కార్పొరేటర్ -
పోలీసులు అదుపులో కరడుగట్టిన నేరస్థులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్ర నగర్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 250 మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలో సరైన ధ్రువపత్రాలు లేని 62 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. తాము అదుపులోకి తీసుకున్న 15 మంది అనుమనితులో ముగ్గురు కరడుగట్టిన నేరస్థులున్నారని సమాచారం. నిషేధిత కార్బైడ్‌తో మామిడి పండ్లను మగ్గిస్తున ఒమర్ అనే నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని 300 ప్యాకెట్ల కార్బైడ్‌ని సీజ్ చేశారు. కార్డెన్ సెర్చ్ నిర్వహించేందుకు సహకరించాలని పాతబస్తీ ప్రజలను కోరినట్లు డీసీపీ వి సత్యనారాయణ తెలిపారు. -
ఎస్ఐపై యువకుడి దాడి
-
పాతబస్తీలో ఆరుగురు రౌడీషీటర్లు అరెస్ట్
హైదరాబాద్ : పాతబస్తీలోని మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 44 బైకులతోపాటు మూడు ఆటోలను సీజ్ చేశారు. అలాగే ఆరుగురు రౌడీషీట్లర్లతోపాటు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7 మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో దాదాపు 250 మంది పోలీసులు ఈ కార్డన్ సెర్చ్‌లో పాల్గొన్నారు. -
విధి మరోలా తలచింది..
చంచల్‌గూడ (హైదరాబాద్) : పోలీసు ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలని కలలు కన్న ఓ యువకుడి విషయంలో విధి మరోలా తలచింది. ఉద్యోగ యత్నాల్లో భాగంగా రన్నింగ్ ప్రాక్టీసు చేస్తున్న ఆ యువకుడు గుండెనొప్పితో మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం కుర్మగూడ మాదన్నపేట బస్తీలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదన్నపేట హరిజనబస్తీకి చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ దర్శనం గణేష్ పెద్ద కొడుకు సునీల్ కుమార్ (28) డిగ్రీ పూర్తి చేశాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎస్ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న సునీల్ రాత పరీక్షలో క్వాలిఫై అయ్యాడు. ఈ నెల 8వ తేదీన శరీర దారుఢ్య పరీక్షలు ఉండటంతో రన్నింగ్ ప్రాక్టీసు చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ప్రాక్టీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చిన సునీల్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే స్పృహ కోల్పోయాడు. దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా సునీల్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
ఘరానాదొంగ అరెస్ట్
చంచల్‌గూడ: ఓ ఘరానా దొంగను మాదన్నపేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. మాదన్నపేట కూరగాయల మార్కెట్లో కిషన్‌బాగ్‌కు చెందిన పాత నేరస్థుడు సయ్యద్ షహజాద్ (30) అనుమానస్పదంగా సంచరిస్తున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకుని విచారణ చేపట్టారు. నిందితుడి వద్ద నుంచి 8 తులాల బంగారు ఆభరణాలు లభించాయి. సయ్యద్‌ను స్టేషన్ కు తరలించి పోలీసులు విచారణ చేపట్టగా సౌత్‌జోన్ పరిధిలో పలు ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. జల్సాలకు అలవాటుపడి సునాయసంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. పాతబస్తీలో రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి అర్థరాత్రి సమయంలో పని కానిచ్చేవాడు. నిందితుని వద్ద నుంచి 57 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పట్టపగలే రియల్ ఫైట్..
-
హైదరాబాద్‌లో పట్టపగలే రియల్ ఫైట్..
హైదరాబాద్ : హైదరాబాద్‌లో పట్టపగలు సినిమా ఫైట్‌ను తలపించేలా శనివారం ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలు, సోడా బుడ్డిలతో ఫైట్ చేసుకున్నారు. మాదన్నపేట దోభీ ఘాట్ విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ...చిలికి చిలికి గాలివానగా మారింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు దిగడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దోభిఘాట్ ప్రభుత్వ స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని స్థానికులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. స్థలాన్ని కబ్జా చేసేందుకు మాఫీయ యత్నాలను స్థానికులు అడ్డుకున్నారు. అయితే అప్పటికే సమాచారం అందుకున్న కబ్జారాయుళ్ల అనుచరులు అక్కడ వీరంగం సృష్టించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను శాంతింపచేసేందుకు ప్రయత్నించినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. పోలీసుల ఎదుటే... కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నిలకడగానే ఉన్నా స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. గతంలో స్థానిక బస్తివాసులు ఈ వ్యహహారంపై గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేశారు.