ఘరానాదొంగ అరెస్ట్ | theft arrested in hyderabad | Sakshi
Sakshi News home page

ఘరానాదొంగ అరెస్ట్

Published Fri, May 27 2016 5:58 PM | Last Updated on Sat, Aug 11 2018 6:04 PM

theft arrested in hyderabad

చంచల్‌గూడ: ఓ ఘరానా దొంగను మాదన్నపేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. మాదన్నపేట కూరగాయల మార్కెట్‌లో కిషన్‌బాగ్‌కు చెందిన పాత నేరస్థుడు సయ్యద్ షహజాద్ (30) అనుమానస్పదంగా సంచరిస్తున్నాడని  సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకుని విచారణ చేపట్టారు. నిందితుడి వద్ద నుంచి 8 తులాల బంగారు ఆభరణాలు లభించాయి. సయ్యద్‌ను స్టేషన్ కు తరలించి పోలీసులు విచారణ చేపట్టగా సౌత్‌జోన్ పరిధిలో పలు ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. జల్సాలకు అలవాటుపడి సునాయసంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. పాతబస్తీలో రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి అర్థరాత్రి సమయంలో పని కానిచ్చేవాడు. నిందితుని వద్ద నుంచి 57 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement