నగరంలోని పాతబస్తీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో శనివారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కామటిపుర, బార్కాస్, వట్టేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 21 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, నాలుగు ఆయుధాలు, 65 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
కల్తీ తేనె, వెనిగర్, అల్లం పేస్ట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు తయారీ గోడౌన్‌ను సీజ్ చేశారు. కల్తీ పాల తయారీ కేంద్రంతో పాటు రెండు కబేళ కేంద్రాలను పోలీసులు సీజ్ చేశారు.