హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో శుక్రవారం అర్థరాత్రి నుంచి పోలీసులు కాల్డెన్‌సర్చ్ నిర్వహించారు. 15 బృందాలలో దాదాపు 400 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 172 మంది పాతనేరస్తులు, రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి కత్తులు, తపంచాలు స్వాధీనం చేసుకున్నారు.