హైదరాబాద్: పాతబస్తీ భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తలాబ్‌కట్ట, అమన్ నగర్ ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్‌నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన దృవపత్రాలు లేని 83 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
10 మంది రౌడీ షీటర్లతో పాటు 84 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రెండు బెల్ట్ షాపులపై దాడులు చేసిన పోలీసులు 76 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ మండల డీసీప వి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్డన్ సెర్చ్‌లో 400 మంది పోలీసులు పాల్గొన్నారు.
పాతబస్తిలో కార్డన్ సెర్చ్
Published Sat, Sep 10 2016 10:22 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
Advertisement
Advertisement