హైదరాబాద్: బాలానగర్ సురారం కాలనీ మైత్రినగర్‌లో ఆదివారం తెల్లవారుజామునుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అడిషినల్ డీసీపీ నివాస్ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులతో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 45 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 22 బైకులు, 10 ఆటలోలు, కారు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.