suraram colony
-
సూరారం కాలనీలో ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని సూరారం కాలనీ భగత్‌సింగ్ నగర్లో శుక్రవారం అర్ధరాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికంగా ప్రతిష్టించిన వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తున్న సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన యువకులు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి భారీగా పోలీసులను మొహరించారు. -
బాలానగర్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్
-
బాలానగర్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్: బాలానగర్ సురారం కాలనీ మైత్రినగర్‌లో ఆదివారం తెల్లవారుజామునుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అడిషినల్ డీసీపీ నివాస్ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులతో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 45 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 22 బైకులు, 10 ఆటలోలు, కారు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
సూరారం కాలనీకి భారీసంఖ్యలో పోలీసులు
-
సూరారం కాలనీకి భారీసంఖ్యలో పోలీసులు
హైదరాబాద్: సూరారం కాలనీలోని 60 గజాల బస్తీకి మంగళవారం ఉదయం భారీసంఖ్యలో పోలీసుల చేరుకున్నారు. అక్రమార్కులను ఖాళీ చేయించాలంటూ కోర్టు నుంచి జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో వెంటనే స్పందించిన అధికారులు అక్రమంగా ఆ స్థలంలో ఉంటున్న వారిని అక్కడినుంచి ఖాళీచేయించేందుకు సూరారం కాలనీకి పోలీసులను పంపించారు. కాలనీలో అల్లర్లు జరగకుండా ముందస్తుగా పలువురు బస్తీవాసులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన 60 గజాల బస్తీలో లబ్ధిదారులు కాకుండా బయటివ్యక్తులు ఉండటంతో వారు కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. -
తెల్లారితే నిశ్చితార్థం.... యువకుడి అదృశ్యం
హైదరాబాద్ : తెల్లవారితే నిశ్చితార్థం.... ఏం జరిగిందో తెలియదు యువకుడు అదృశ్యం అయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం సూరారం కాలనీకి చెందిన బొమ్మబోయిన శేఖర్ (26) సూరారం చౌరస్తాలో ఎలక్ట్రికల్ రిపేరింగ్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈనెల 7న రాత్రి 11 గంటలకు దుకాణం మూసివేఇ బైక్‌పై ఇంటికి బయల్దేరాడు. మధ్యలో ఫోన్ రావటంతో తిరిగి దుకాణానికి వచ్చాడు. బైక్‌ను పార్కు చేసి వాచ్మెన్ సత్యనారాయణతో చెప్పి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. తెల్లవారితే శేఖర్‌కు నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అన్నిచోట్ల వెతికినా ఆచూకీ లేకపోవటంతో కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.