తెల్లారితే నిశ్చితార్థం.... యువకుడి అదృశ్యం | Young Man missing from suraram colony in hyderabad | Sakshi
Sakshi News home page

తెల్లారితే నిశ్చితార్థం.... యువకుడి అదృశ్యం

Published Wed, Dec 11 2013 8:27 AM | Last Updated on Wed, Aug 1 2018 2:35 PM

Young Man missing from suraram colony in hyderabad

హైదరాబాద్ : తెల్లవారితే నిశ్చితార్థం.... ఏం జరిగిందో తెలియదు యువకుడు అదృశ్యం అయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం సూరారం కాలనీకి చెందిన బొమ్మబోయిన శేఖర్ (26) సూరారం చౌరస్తాలో ఎలక్ట్రికల్ రిపేరింగ్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈనెల 7న రాత్రి 11 గంటలకు దుకాణం మూసివేఇ బైక్పై ఇంటికి బయల్దేరాడు.

మధ్యలో ఫోన్ రావటంతో తిరిగి దుకాణానికి వచ్చాడు. బైక్ను పార్కు చేసి వాచ్మెన్ సత్యనారాయణతో చెప్పి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. తెల్లవారితే శేఖర్కు నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అన్నిచోట్ల వెతికినా ఆచూకీ లేకపోవటంతో కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement