హైదరాబాద్: భాగ్యనగరం విశ్వనగరంగా రూపొందుతున్న క్రమంలో నగరంలో అసాంఘిక శక్తులను గుర్తించడానికి పోలీసులు వరుస నిర్బంధ తనిఖీలు చేపడుతున్నారు. చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కమలానగర్‌లో తూర్పు మండల డిఫ్యూటీ కమిషనర్ వి. రవీందర్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. పలువురి అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది.