సెల్‌ఫోన్ దుకాణంలో అగ్ని ప్రమాదం
అనంతపురం సెంట్రల్ : అనంతపురం కమలానగర్లో గురువారం మధ్యాహ్నం ఓ సెల్‌ఫోన్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. షాపులోని మొత్తం ఫర్నీచర్లు, సెల్ఫోన్లు కాలిబూడదయ్యాయి. కమలానగర్లో డీసీఎంఎస్ రోడ్డులో రామానాయుడు అనే వ్యక్తి ఇండియన్ మొబైల్స్ షాపు నిర్వహిస్తున్నాడు.
మధ్యాహ్నం 2 గంటలకు భోజనానికి ఇంటికివెళ్లారు ఆ సమయంలో షాపులో షార్టు సర్కూ్యట్తో మంటలు వ్యాపించాయి. షాపులో నుంచి పొగలు రావడంతో స్థానికులు ఫైరింజన్‌కు సమాచారం అందించారు. వారొచ్చే సరికే విలువైన సెల్ఫోన్లు, ఫర్నీచర్ అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.6.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లి ఉంటుందని అగ్నిమాపక అధికారి లింగమయ్య తెలిపారు.