స్థానికులతో మాట్లాడుతున్న డీసీపీ
భువనగిరిఅర్బన్ : భువనగిరిలోని అర్బన్‌కాలనీలో ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రాంచంద్రారెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ కాలనీలో ఎక్కువ మంది అనుమానితులు, రౌడీషీటర్లు, పాత నేరస్తులు ఉన్నం దున నిఘా పెంచినట్టు చెప్పారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 34 బైక్‌లు, 6 ఆటోలు, 6 వంట గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
అలాగే 8 మంది రౌడీషీటర్లు, ఆరుగురి అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చె ప్పారు. అర్బన్‌కాలనీలో కల్తీ కల్లు విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి 3 పెట్టెల కల్లును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పా రు. కార్డన్ సెర్చ్‌కు కాలనీ ప్రజలు సహకరించా రని, ఇక ముందు కూడా ఇలాంటి కార్డన్ సెర్చ్‌లు నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ జితేందర్‌రెడ్డి, 8 మంది సీఐలు, 15మంది ఎస్‌ఐలు, 150 కానిస్టేబుల్ పాల్గొన్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment