విజయవాడ: విజయవాడలోని కొత్త రాజరాజేశ్వరిపేటలో శుక్రవారం పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఏసీపీ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో 13 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులతో పాటు ధ్రువీకరణ పత్రాలు లేని 36 బైకులను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.