Teacher Attempt Sexual Assault On Girl Child In Hyderabad Falaknuma School - Sakshi
Sakshi News home page

చిన్నారిపై ఉపాధ్యాయుడి ఆత్యాచారయత్నం.. బాలిక వీపుపై..

Published Sun, Feb 6 2022 6:24 AM | Last Updated on Sun, Feb 6 2022 11:35 AM

Teacher Molestation on Child at Hyderabad - Sakshi

చాంద్రాయణగుట్ట (హైదరాబాద్‌): విద్యబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కామంతో కండ్లు మూసుకుపోయి ఓ చిన్నారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. వివరాల ప్రకారం... పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో ఆశ్వక్‌ అహ్మద్‌ ఖాన్‌ (35) 2015 నుంచి ఎస్‌జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా శనివారం  పాఠశాలలో సుమారు 8.30 గంటలకు సమయంలో అదే పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న 10 సంవత్సరాల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడటమే కాకుండా బాలిక వీపుపై విచక్షణారహితంగా కొట్టాడు.

బాలిక అదే పాఠశాలలో చదువుతున్న తన సోదరుడితో ఈ విషయం చెప్పడంతో ఆ బాలుడు తండ్రికి సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న బాలిక తండ్రి ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధ్యాయుడికి మతిస్థిమితం సరిగా లేదని తోటి ఉద్యోగులు తెలిపారు.   

చదవండి: (Hyderabad: నగరంలో 8 మంది అదృశ్యం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement