భార్యను కాల్చి చంపిన బీజేపీ నేత.. పరారీ | BJP leader shoots dead wife, attempts suicide | Sakshi
Sakshi News home page

భార్యను కాల్చి చంపిన బీజేపీ నేత.. పరారీ

Published Sun, Feb 19 2017 9:14 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

భార్యను కాల్చి చంపిన బీజేపీ నేత.. పరారీ - Sakshi

భార్యను కాల్చి చంపిన బీజేపీ నేత.. పరారీ

మీరట్‌: ఉత్తరప్రదేశ్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యే దారుణానికి దిగాడు. భార్యతో గొడవపడి ఆమెపై కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకునేందుకు సిద్ధపడ్డాడు. అయితే, ఇంట్లో ఉన్న ఇతరులు అతడి చర్యను అడ్డుకోవడంతో ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. భార్య మాత్రం చనిపోయింది. బీజేపీ నాయకుడు కులదీప్‌ తోమర్‌ తన భార్య పూనమ్‌తో తొలుత గొడవపడ్డాడు.

ఆ తర్వాత విపరీతంగా తిట్టుకున్నారు. తొలుత చేయి చేసుకున్న ఆయన అనంతరం తన దగ్గర ఉన్న తుపాకీతో భార్యపై కాల్పులు జరిపాడు. అనంతరం తనకు తుపాకీ ఎక్కుపెట్టుకొని కాల్చుకోబోతుండగా ఇంట్లో మేనళ్లుడు వచ్చి అడ్డుకున్నాడు. పూనమ్‌ను ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే, భార్య చనిపోయిందనే భయంతో ప్రస్తుతం కులదీప్‌ పరారీలో ఉన్నాడు. మొత్తం ఆయన కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement