
పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
పోలీసుల వేధింపులు తాళలేక ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఈ సంఘటన జరిగింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలీసులు వెంటనే మంటలు ఆర్పి బాధితుణ్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్ప్రత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.
బాధితుడి మూడేళ్ల క్రితం దొంగతనం కేసులో నిందితుడు. ఇటీవల మియాపూర్ ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువగా జరగడంతో అతణ్ని పిలిపించి పోలీసులు విచారించారు. అయితే ప్రస్తుతం తాను దొంగతనం చేయడం మానేశానని, పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని బాధితుడు చెప్పాడు. అయినా పోలీసులు వేధించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని బాధితుడు ఆరోపించాడు.