
టెన్త్ విద్యార్థినిపై మేనమామ పైశాచికం..
తనపై మేనమామ లైంగిక దాడి చేస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో పదో తరగతి చదువుతున్న బాలిక ఓ ఎస్పీ ఇంటి ముందుకు వెళ్లి ఆత్మహత్యకు దిగింది.
జింద్: తనపై మేనమామ లైంగిక దాడి చేస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో పదో తరగతి చదువుతున్న బాలిక ఓ ఎస్పీ ఇంటి ముందుకు వెళ్లి ఆత్మహత్యకు దిగింది. విషం తీసుకొని స్పృహకోల్పోయింది. ప్రస్తుతం ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జింద్ జిల్లాలోని కైతాల్ దయోరా ఖురానా అనే ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న బాలిక తన మేనమామ ఇంట్లో ఉండి చదువుకుంటోంది.
అయితే, గత కొద్ది రోజులుగా అతడి విచక్షణను మరిచి ఆ బాలిక పై లైంగిక దాడి చేస్తూ వస్తున్నాడు. దీంతో ఆ బాలిక మహిళా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కానీ వారు ఫిర్యాదు నమోదు చేసుకోకపోవడంతోపాటు వెళ్లి పంచాయతీలో తేల్చుకోవాలని చెప్పారు. దీంతో ఆ బాలిక నేరుగా విషయం తీసుకొని వెళ్లి ఎస్పీ ఇంటి ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలిక0 మేనమామను అరెస్టు చేసేందుకు ప్రత్యేక టీంను పంపించింది.