మహబూబ్ నగర్: విచారణలో ఉన్న రిమాండ్ ఖైదీ గొంతు కొసుకుని బలవన్మరణానికి యత్నించాడు. ఈ ఘటన మంగళవారం గద్వాల్‌లో వెలుగులోకి వచ్చింది. రాజు అనే పాత నేరస్తుడిని ఓ దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా స్టేషన్ ఆవరణలో బ్లేడుతో గొంతుకొసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో పోలీస్ సిబ్బంది సదరు వ్యక్తిని కర్నూలులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.