remand prisoner
-
స్కిల్ నుంచి సంక్రాంతి బెల్లం వరకూ అంతా స్కామే
కాకినాడ : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టైన ప్రధాన నిందితుడు చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించడంపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయి రాజకీయ కక్ష సాధింపు అని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో స్కిల్ నుంచి సంక్రాతి బెల్లం వరకు అంతా స్కామేనని అన్నారు. కక్ష సాధింపు.. చంద్రబాబు అరెస్టయినప్పటి నుంచి ఇది రాజకీయ కక్ష సాధింపని అదేపనిగా విమర్శిస్తున్నారు ప్రభుత్వానికి ఆ అవసరసం ఏ మాత్రం లేదన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. కాకినాడలో మీడియా సమావేశం నిర్వహించిన కన్నబాబు మాట్లాడుతూ.. చాలా నీతిమంతుడినని తనకు తానే భుజకీర్తులు తగిలించుకుని మీడియా బలంతో పేట్రేగిపోయే చంద్రబాబు పాపం పండి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారన్నారు. సహజ న్యాయం అంటూ ఒకటి ఉంటుందని అహంకారంతో విర్రవీగిపోతుంటే దాన్ని ఎప్పటికప్పుడు సరిచేసే వ్యవస్థలూ ఉంటాయని అన్నారు. 2014-19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారీగా అవినీతి జరిగిందని అధికారాన్నిఅడ్డం పెట్టుకుని సొంత మనుషులకు ఏ విధంగా దోచిపెట్టారో అర్థమౌతుందన్నారు. ఈ స్కిల్ స్కామ్‌ను మొదట వెలుగులోకి తీసుకొచ్చింది కేంద్ర సంస్థలని గుర్తుచేశారు. ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా? చంద్రబాబును జైల్లో పెట్టకుండా, ఇంట్లో పెట్టి హౌస్ అరెస్టు చేస్తే కావాల్సిన వారితో మాట్లాడుకుంటూ ఉంటారట.. సపర్యలు అన్నీ అక్కడే చేయాలంట. మరి, దాన్ని అరెస్టు అంటారా? చంద్రబాబుకు వర్తించేది మిగతావారికి వర్తించదా? చంద్రబాబుకేమన్నా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? అని ప్రశ్నించారు. సాక్ష్యాధారాలతో సహా పట్టుబడిన తర్వాత కూడా ఆయన జిత్తులు చూస్తే ఎంత పెద్ద మ్యానిపులేటరో అర్థం చేసుకోవచ్చు. పెద్ద మ్యానిపులేటర్.. రాష్ట్ర బీజేపీకి అధ్యక్షురాలైన సొంత వదిన గారు పురంధేశ్వరి చంద్రబాబు అరెస్టు అక్రమం అంటారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకాల్లో చంద్రబాబు నిర్వాకాలు చాలా ఉన్నాయి. చంద్రబాబు అరెస్టు చూసి జనసేన అధినేత మధన పడిపోతున్నాడు. ఇక కమ్యూనిస్టులైతే చంద్రబాబుకు ఆప్తుల్లా వ్యవహరిస్తూ ఉంటారు. అదేంటో ఆయనపై మమకారాన్ని చూపకుండా ఉండలేరు. ఇంతకాలం చంద్రబాబు స్కిల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో అందరం చూశాం. బ్యాక్‌డోర్‌లో వ్యవస్థలను మేనేజ్ చేయటంలో చంద్రబాబును కొట్టేవాడు రాష్ట్రంలోనే లేడు. ఓటుకు నోటు కేసులోనే ఆయనను ఎప్పుడో అరెస్టు చేసి ఉండాలన్నారు. . గాల్లో విభూది సృష్టించినట్లే.. రాష్ట్రంలో చూస్తే ఎక్కడా స్కిల్ లేదు.. ఒక ఇన్స్టిట్యూట్ లేదు. చూస్తుండగానే మాయ చేసి రూ. 371 కోట్లు లాగేశారు. సీమెన్స్ సంస్థ రూ.3500 కోట్లతో వచ్చిందని 10% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలని కాగితాలపై చూపించారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే దోపిడీ మొదలుపెట్టారు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. ఏం జరగలేదన్నట్లు ఎప్పటికప్పుడు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. ఇవాళ కూడా అయాన్ అదే తీరులో వ్యవహరించారు. గాల్లో విభూది సృష్టించినట్లు రూ.371 కోట్లు కొట్టేశారు. మొదటగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కాంను జీఎస్టీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు వెలికితీశాయి. సీఐడీ కూడా దర్యాప్తు చేసి ఏడుగురిని అరెస్టు చేసింది. పాపం పండింది.. ఎల్లో మీడియా బలాన్ని చూసుకుని చంద్రబాబు- తనను ఎవ్వరూ ఏమీ పీకలేరని అనేవారు. నిన్నటి తీర్పుతో చట్టం చంద్రబాబు చుట్టం కాదని తేలిపోయింది. తప్పుచేస్తే ఒకరోజు కాకపోయినా మరో రోజు పాపం పండుతుందని నిన్న అర్థమైంది. 15 రోజులుగా లోకేశ్, చంద్రబాబు వాడుతున్న భాషతో వారు ఎంత ఫ్రస్టేషన్‌తో ఉన్నారో అర్థమౌతోంది. ఎవ్వరూ ఏమీ పీకలేరని అంటారు. మీ నాన్నే ఏమీ చేయలేదు. నువ్వు ఏమి చేస్తావని పదే పదే అన్నారు. అన్ని మాటలు మాట్లాడతారు కానీ ఎక్కడా అవినీతి జరగలేదని మాత్రం చెప్పరు. > మరో వకీల్ సాబ్.. నిన్న ఢిల్లీ నుంచి సిద్ధార్థ లూథ్రాను తీసుకువచ్చారు. ఆయన కోర్టులో వచ్చి నిలబడితే చాలు క్లయింట్ గెలుస్తారని ప్రచారం. సినిమాల్లోనూ లేనంత సీన్ కోర్టులో క్రియేట్ చేశారు. ఇంతమంది వకీల్‌లకు తోడు.. ఇంకో వకీల్‌సాబ్ వచ్చి రోడ్డు మీద పడుకున్నారు. ఎంతమంది వకీల్‌సాబ్‌లు వచ్చినా చివరకు న్యాయమే గెలిచిందని బాబును రిమాండ్ నుంచి ఎవ్వరూ తప్పించలేకపోయారన్నారు. ఎంతసేపూ టెక్నికల్‌గా మాట్లాడతారు తప్ప అవినీతి చేయలేదన్న మాట మాత్రం ఎవ్వరూ అనరు. ప్రతిదీ స్కామే.. చంద్రబాబు స్కాంల లిస్టు చూస్తే.. స్కిల్ డెవలప్మెంట్, రాజధాని భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు, సెక్రటేరియట్ నిర్మాణాల ద్వారా షెల్ కంపెనీలకు రూ.118 కోట్లపై ఐటీ నోటీసులు, ఏపీ ఫైబర్ గ్రిడ్, రూ.150 కోట్ల ఈఎస్ఐ కుంభకోణం జరిగాయి. ఇలా టీడీపీ హయాంలో అవినీతి ఆరోపణలపై కేబినెట్ సబ్ కమిటీని వేశారు సీఎం జగన్ గారు. అందులో నేను కూడా ఒక సభ్యుడిని. చంద్రన్న సంక్రాంతి కానుకలోనూ బెల్లం స్కాం చేశారు. అందులో అనకాపల్లి వ్యాపారులు, రైతులు పాల్గొనకుండా నిబంధనలు పెట్టారు. వేరే రాష్ట్రాల నుంచి బెల్లం కొనుగోలు చేశారు. టెండర్లు లేకుండా హెరిటేజ్ నుంచి నెయ్యి కొన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేసవి కాలంలో మజ్జిగ కూడా హెరిటేజ్ నుంచి కోట్లలో కొనుగోలు చేయమని జీఓ ఇచ్చారు. ఏ ఒక్కటైనా వదిలారా? ముట్టుకుంటే అవినీతి. మీ స్కాంలు.. స్కీంలు ఎవరికీ తెలియని బాగోతాలు అనుకుంటున్నారా? టీడీపీ నాయకులు అర్థం చేసుకుంటే మంచిది. ఎలివేషన్స్ తగ్గిస్తే మంచిది.. ఎల్లో మీడియాలో చంద్రబాబును అన్నాహజారేకి బ్రదర్‌లా చూపిస్తారు. దేశంలో గొప్ప ప్రతిభావంతమైన నాయకుల్లో ఒకడిగా రాస్తారు. చంద్రబాబుకే అన్యాయం జరిగినట్లు రాస్తారు. చంద్రబాబును ఓ హీరోగా. ఆయన కొడుకు ఎదిగొస్తున్న హీరోగా. మా పార్టీని, మా నాయకుడిని విలన్లా చూపిస్తారు. నువ్వు అక్రమాలకూ పాల్పడ్డావు అంటే ఒప్పుకోరు. ఎదుటివాడే దొంగ అన్నట్లు విమర్శలు చేస్తారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ భ్రమల్లోనే.. మిగతావారి సంగతెలా ఉన్నా చంద్రబాబు కోసం పవన్ మాత్రం బాగా బాధపడ్డాడు. రోడ్ల మీద పడుకున్న ఫొటోలూ చూశాం. ఈ సందర్భంగా టీడీపీ, జనసేనలు బలపడ్డాయని పవన్ అన్నట్లు ఈనాడులో రాశారు. కోనసీమ వారాహి యాత్రలో ఏదో దుర్ఘటన చేయాలని కుట్ర పన్నారని పవన్ విమర్శిస్తారు. అసలు సినిమాల మాదిరిగా బయట కూడా పవన్ భ్రమలో బతుకుతున్నారు. ప్రభుత్వం మారగానే జగన్ గారిని అంతర్జాతీయ కోర్టుల చుట్టూ తిప్పిస్తామని పవన్ చెబుతున్నారు. ఇన్నాళ్లు రాష్ట్రం, కేంద్రం అనేవారు.. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయం అంటున్నాడు. జాతీయమో, అంతర్జాతీయమో చంద్రబాబుకు ఉన్న ఖ్యాతి భవిష్యత్తులో తెలుస్తుంది. చంద్రబాబుకు రిమాండ్ నెంబర్ ఖైదీగా 7691 నెంబర్ ఇచ్చారట. అడ్డంగా దొరికిపోయి.. గతంలో కూడా చంద్రబాబుపై ఎన్నో కేసులు నమోదైనా మ్యానిప్యులేట్ చేస్తుకుంటూ కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటూ, ఏ కేసులోనూ దర్యాప్తు జరగకుండా చూసుకుంటున్న చంద్రబాబు, ఇప్పుడు అడ్డంగా దొరికిపోవడంతో అక్రమ అరెస్టు.. రాజకీయ కక్ష అని ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోంది. చంద్రబాబును ప్రేమిస్తున్న వారి బాధ వర్ణణాతీతం. అచ్చెన్నాయుడు ఫోన్లో కార్యకర్తలను రోడ్ల మీదకు రమ్మని బ్రతిమిలాడుకుంటున్నాడు. ఎందుకంటే, టీడీపీ వాళ్లు కూడా చంద్రబాబు నొక్కేసి ఉంటాడనే నమ్ముతున్నారు. అవినీతితో సానుభూతి రాదు.. ఈ అవినీతి దెబ్బతో చంద్రబాబుకు సానుభూతిగానీ, విజయంగానీ దక్కదు. 2004-05 ముందు అలిపిరి ఘటన జరిగినా ఎలాంటి విజయం దక్కిందో చూశాం. గతంలో సోషల్ మీడియా లేనప్పుడు ఆ మీడియా చెప్పిందే నమ్మాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళ ప్రజలకు వాస్తవాలు అర్థమౌతున్నాయి. ఎన్ని కుంభకోణాలు.. అవినీతి మేత పెట్టుకుని అబద్ధాలు చెప్పుకుంటూ గ్యారెంటీ ఇస్తానంటూ చంద్రబాబు రోడ్డు మీదకు రావటానికి ఎంత ధైర్యం ఉండాలి. జగన్ గారిది జన బలం.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతి పథకాన్ని దేశంలోనే ఒక మోడల్‌గా అందిస్తుంటే అది టీడీపీ వాళ్లకు, ఎల్లో మీడియాకు కనిపించదు. లోకేశ్ పాదయాత్ర చూస్తే అంతా ఫాస్ట్ ఫార్వార్డ్లోనే జరుగుతోంది తెల్లవారే సరికి జిల్లాలు మారిపోతున్నాడు. ఎంత ఫిట్నెస్ ఉంటే మాత్రం అంతంత దూరం ఎలా నడుస్తున్నాడో ఎవరికీ అర్థం కావట్లేదు. కవర్ చేసే మీడియా బలం, ధనబలం ఉంది. అన్ని పార్టీల చెవులు కొరికే నాయకులు ఉన్నారనే ధైర్యం. వీరంతా ఒక ఎత్తు అయితే.. జగన్ గారు ఒక్కరే మరో ఎత్తు. జగన్ గారి వైపు జనం ఉంటే.. చంద్రబాబు వైపు ఎల్లో మీడియా, దుష్ట చతుష్టయం మాత్రమే ఉందని జగన్ గారు ఏదైనా చేయాలని పట్టుపడితే ఆయన సంకల్పమే ఆయనకు బలమవుతుందన్నారు. వాటి గురించి వారే చెప్పాలి.. ఇది యుద్ధమని అంటారు పవన్ కళ్యాణ్. నిజానికిది పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమని జగన్ గారు ఎప్పుడో చెప్పారు. మీ కుట్రలు ఎదుర్కోవటానికి మేము సిద్ధంగానే ఉన్నామని ప్రజల మా పక్షాన ఉన్నారన్నారు. అంతర్జాతీయ కోర్టుల చుట్టూ తిప్పుతామంటున్నారు. సీఎం పిల్లల చదువుల కోసం లండన్ వెళ్తే.. లోకేశ్, భజన బృందాలు స్పెషల్ ఫ్లైట్ అని పచ్చిగా మాట్లాడుతున్నారు. నిన్న ఒక్కరోజే నాలుగైదు స్పెషల్ జెట్లు టీడీపీ వారే వాడారు. లాయర్‌కు ఒకటి, ఆయన పార్టీ మద్దతు ఇచ్చే నాయకుడికి ఒకటి, కుటుంబ సభ్యులకు ఒకటి, పైన వాళ్లకి, కింద వాళ్లకి ఒకటి మొత్తంగా ఐదో, ఆరో ఫ్లైట్లు వాడారు. ఈ డబ్బులు ఏ స్కిల్ వాడితే టీడీపీకి వచ్చాయో వారే చెప్పాలన్నారు. పక్కా సాక్ష్యాధారాలున్నాయి.. ప్రభుత్వం అనుకుంటే ఎవ్వరినీ జైలుకు పంపలేదు. సాక్ష్యాధారాలు చూసి తప్పు జరిగిందని కోర్టు నమ్మింది కాబట్టే చంద్రబాబును రిమాండ్‌కు పంపింది. రాజకీయ కక్షతో సీఎం జగన్ గారు చంద్రబాబును జైలుకు పంపినట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఢిల్లీ నుంచి రాష్ట్రంలోని న్యాయ నిపుణులంతా చంద్రబాబు పక్షాన వాదించారు. అయినా స్కిల్‌లో తప్పు జరిగిందని సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటికైనా రాజకీయ వైరంగా ప్రచారం చేయటం మానుకోవాలని అన్నారు. ఇది కూడా చదవండి: స్కిల్ స్కాం ఆరంభం మాత్రమే: మంత్రి పెద్దిరెడ్డి -
మూడ్ పాడైతే బ్లేడ్, నెయిల్ కట్టర్, తాళం... ఎనీథింగ్ హాంఫట్!
గాంధీ ఆస్పత్రి: అతడి పేరు గోవర్ధన కార్తీక్... డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు చిక్కి జైలుకు చేరాడు... ఏమాత్రం మూడ్ బాగోలేకపోయినా చేతికి అందిన దాన్ని గుటుక్కుమనిపిస్తాడు. ఇలా పక్షం రోజుల్లో బ్లేడ్, నెయిల్ కట్టర్, తాళం చెవితో పాటు, ఇనుప రేకు ముక్కల్నీ మింగేశాడు. ఇతగాడి వ్యవహారశైలితో అటు జైలు అధికారులు, ఇటు గాంధీ ఆస్పత్రి వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. చేతికి దొరికింది నోట్లో వేసుకుని... విజయవాడకు చెందిన కార్తీక్ (22) మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. వాటిని ఖరీదు చేయడానికి అవసరమైన డబ్బు కోసం విక్రతగా మారా డు. కొన్నాళ్ల క్రితం పోలీసులకు చిక్కిన ఈ పెడ్లర్ ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మత్తు మందులు దొరక్కో, జైల్లో పెట్టారనే అసహనమో తెలియదు కానీ ఇతగాడికి తరు మూడ్ పాడవుతూ ఉంటుంది. ఆ సమయంలో జైలులో తన చుట్టూ అందుబాటులో ఉన్న చిన్న, చిన్న ఇనుప వస్తువులను అమాంతం మింగేస్తుంటాడు. పక్షం రోజులుగా ఈ వ్యవహారశైలితో జైలు అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాడు. అయితే ఎనిమా లేదంటే ఎండోస్కోపీ... గతంలో జైల్లో ఉండగానే తీవ్రమైన కడుపునొప్పి రావడంతో జైలు డాక్టర్లు పరీక్షించారు. ఈ నేపథ్యంలోనే అతడు ఇనుప వస్తువులు మింగిన విషయం బయటపడింది. కొన్నిసార్లు ఎనిమా ద్వారా బయటకు వచ్చేలా చేస్తుండగా... మరికొన్ని సార్లు మాత్రం ఆస్పత్రికి తీసుకురావాల్సి వచ్చింది. జైలు అధికారుల సూచన మేరకు గత నెల 28న మొదటిసారిగా గాంధీ ఆస్పత్రి ప్రిజనర్స్ వార్డులో అడ్మిట్ అయ్యాడు. వైద్య పరీక్షల్లో కార్తీక్ కడుపులో ఇనుప వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. ఎండోస్కోపీ ద్వారా పెద్ద పేగుల మధ్య ఇరుకున్న చేతి బేడీలకు వేసే తాళం చెవిని బయటకు తీశారు. ప్రిజనర్స్ వార్డు నుంచి డిశ్చార్జీ చేసి జైలుకు తరలించగా నెయి ల్కట్టర్, బ్లేడ్లు మింగాడు. కొన్ని ఎనిమా ద్వారా బయటకు రాగా, మరికొన్ని ఎండోస్కోపీ ద్వారా బయటకు తీశారు. తాజాగా సోమవారం మరోసారి... కార్తీక్ ఈసారి ఇనుప రేకు ముక్కను మింగేశాడు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న అతడిని జైలు అధికారులు ఈ నెల 7న మరోసారి గాంధీ ఆస్పత్రిలోని ప్రిజనర్స్ వార్డులో చేర్చారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగ వైద్యులు సోమవారం తీవ్రంగా శ్రమించి ఎండోస్కోపీ విధానంలో అతడి పేగుల మధ్య ఇరుక్కున్న రేకు ముక్కను బయటకు తీశారు. ఆయా వస్తువులు పేగుల్లో ఇరుక్కోవడంతో తీవ్రమైన నొప్పితో బాధపడటమే కాకుండా ప్రాణా పాయం ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యలు చెప్తున్నారు. గాంధీ వైద్యులు పక్షం రోజుల్లో కార్తీక్‌కు మూడుసార్లు ఎండోస్కోపీ చేసి కడుపులో చిక్కుకున్న ఆయా వస్తువులను బయటకు తీశారు. రిమాండ్ ఖైదీ చేతికి ఎలా... చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కార్తీక్‌కు ప్రమాదకరమైన ఇనుప వస్తువులు ఎలా అందుబాటులోకి వస్తున్నాయన్నది కీలకంగా మారింది. ఈ విషయంపై అతడేమీ చెప్పట్లేదని, తమకూ అర్థం కావడం లేదని ఎండోస్కోపీ నిర్వహించిన గాంధీ ఆస్పత్రి వైద్యులు అంటున్నారు. కార్తీక్ కడుపులో నుంచి మూడుసార్లు తీసిన వస్తువులు ప్రమాదకరమైనవే అని గాంధీ ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంట్రాలజీ హెచ్ఓడీ శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు. రిమాండ్ ఖైదీగా ఉన్న కార్తీక్ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడని, తక్షణమే మానసిక వైద్యులకు చూపించాలని సూచించానని ఆయన వివరించారు. (చదవండి: ఇంటర్ ఛేంజర్లతో ఇక్కట్లు!) -
ముగ్గురిని చంపాడు.. చివరకు దోస్తుల చేతిలోనే హత్య
అనంతపురం క్రైం: నగరంలో ఆదివారం రాత్రి ఓ రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. తాగిన మైకంలో స్నేహితులే అతన్ని మట్టుబెట్టారు. అనంతపురం వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి తెలిపిన మేరకు.... నగరంలోని రాజమ్మ కాలనీకి చెందిన గుజిరీ వ్యాపారి ఖాదర్‌బాషా, ఖైరూన్‌బీ దంపతుల కుమారుడు షేక్ సికిందర్ బాషా అలియాస్ సీకే (31) టైల్స్ పనిచేసేవాడు. మద్యానికి బానిసైన సికిందర్ బాషా వైఖరి నచ్చక ఐదేళ్ల క్రితం అతని నుంచి భార్య విడిపోయింది. ఈ క్రమంలోనే సికిందర్ బాషా మరింత జులాయిగా మారాడు. తాగుడు కోసం ఇతరులను బెదిరించి డబ్బు వసూలు చేసుకునేవాడు. ఇందులో భాగంగానే డబ్బు ఇవ్వలేదన్న కసితో 2011లో అనంతపురంలోని గుత్తి రోడ్డులో జిలాన్బాషాని, 2020లో కనకదాసు విగ్రహం ఐదు లైట్ల కూడలిలోని ప్రభుత్వ పాఠశాల ఎదుట ఖాదర్బాషాని, ఈ ఏడాది రియల్ ఎస్టేట్ వ్యవహారంలో బెంగళూరులో మరో వ్యక్తిని హతమార్చాడు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సికిందర్ 20 రోజుల క్రితం విడుదలై అనంతపురానికి వచ్చాడు. అనాలోచితం.. అనివార్యం.. సికిందర్‌కు అనంతపురంలోని కృష్ణదేవరాయనగర్‌కు చెందిన షెక్షావలి అలియాస్ బ్రూస్లీ, లింగమయ్య కొట్టాలకు చెందిన కుక్కల జిలాన్, అన్సర్, భవానీ నగర్ నివాసి అడపాల చంద్రశేఖర్ ప్రాణస్నేహితులు. వీరంతా మద్యం, ఇతర వ్యసనాలకు బానిసలు. వీరిలో బ్రూస్లీపై రౌడీషీట్, అడపాల చంద్రశేఖర్‌పై సస్పెక్ట్ షీట్ ఉన్నాయి. ఈ నెల 1న రాత్రి వీరంతా కలిసి గుత్తి రోడ్డులోని ఓ బార్లో మద్యం సేవించారు. అనంతరం రెండు బైక్‌లపై ఇళ్లకు బయలుదేరారు. మార్గమధ్యలో వాణి రైస్ మిల్లు వద్దకు చేరుకోగానే కుక్కల్ జిలాన్‌ను సికిందర్ తిట్టాడు. దీంతో అన్సర్ జోక్యం చేసుకుని ఎందుకు తిడుతున్నావంటూ ప్రశ్నించడంతో ఖాళీ బీరు బాటిల్‌తో అన్సర్ తలపై సికిందర్ కొట్టాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన స్నేహితులు అనాలోచితంగానే సికిందర్‌పై తిరుగుబాటు చేశారు. ఈ ఘటన మనసులో పెట్టుకుని తమపై ఎప్పటికైనా దాడి చేస్తాడని భావించారు. దీంతో రాయి, ఇటుక పెళ్లలతో సికిందర్‌పై దాడి చేశారు. ఓ పెద్ద బండరాయిని బ్రూస్లీ ఎత్తి సికిందర్‌పై వేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, 2021లో ఉమాశంకర్ అనే వ్యక్తిని ఇదే తరహాలో బండరాయి వేసి హత్య చేసిన కేసులో బ్రూస్లీ నిందితుడు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
కరోనా పరీక్షలకు తీసుకెళ్తే ఖైదీ పరార్
సాక్షి, వరంగల్ అర్బన్: కరోనా పరీక్షలకు ఆస్పత్రికి తీసుకెళ్లిన పోలీసుల కళ్లుగప్పి ఓ ఖైదీ పరారైన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. హన్మకొండ సుబేదారికి చెందిన ఖైదీ సయ్యద్ ఖైసర్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి పరారయ్యాడు. కరోనా లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షల నిమిత్తం జైలు అధికారులు ఖైసర్‌ను గురువారం ఉదయం ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. అతని వద్ద శాంపిల్స్ సేకరించి.. కోవిడ్ వార్డులో చేర్పించారు. అక్కడ ఎస్కార్ట్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఖైసర్ తప్పించుకొని పారిపోయాడు. దీంతో మట్టెవాడ పోలీస్ స్టేషన్లో జైలు సిబ్బంది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఖైదీ అతడి కోసం గాలిస్తున్నారు. ఇక 14 చోరీలు చేసిన ఖైసర్ గత నెలలోనే పట్టుబడ్డాడు. ఈ కేసుల్లో ప్రస్తుతం అతడు వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. (మోసం చేశాడు.. న్యాయం చేయండి) -
సెంట్రల్ జైల్ రిమాండ్ ఖైదీకి కోవిడ్ పాజిటివ్
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: కరోనా వైరస్ (కోవిడ్–19) వ్యాధితో మహిళ మృతి చెందిన సంఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం సీటీఆర్ఐకు చెందిన 55 ఏళ్ల మహిళ కరోనా వ్యాధితో గురువారం మృతి చెందింది. ఈనెల 16వ తేదీ రాత్రి వ్యాధితో బాధపడుతున్న ఆమెను చికిత్స కోసం రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సోమ సుందరరావు పర్యవేక్షణలో డాక్టర్ నాయక్ ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఈనేపథ్యంలో గురువారం ఆమె మృతి చెందింది. ఆమెకు షుగర్, బీపీ వంటి వ్యాధులు ఉన్నట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సోమసుందరరావు తెలిపారు. మహిళ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు పది మందికి కరోనా టెస్ట్‌లు నిర్వహించామని ఆయన తెలిపారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే క్వారంటైన్‌కు తరలించి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. రిమాండ్ ఖైదీకి పాజిటివ్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రేప్ కేసులో విజయవాడ కోర్టు రిమాండ్ విధించడంతో శిక్ష అనుభవించేందుకు నిమిత్తం ఖైదీని ఈనెల 16న రాజమహేంద్రవరం సెంట్రల్‌జైల్ కు తరలించారు. రిమాండ్ ఖైదీకి పాజిటివ్ ఉన్నట్టు ఈనెల 17వ తేదీ రాత్రి జైల్ అధికారులకు విజయవాడ నుంచి సమాచారం అందించడంతో వెంటనే చికిత్స కోసం అతడిని క్వారంటైన్‌కు తరలించామని సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ఎస్. రాజారావు తెలిపారు. ఖైదీతో పాటు బ్లాక్‌లో ఉన్న సహ రిమాండ్ ఖైదీలకు, సెంట్రల్ జైల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కరోనా టెస్ట్‌లు చేయిస్తున్నామని సెంట్రల్‌జైల్ సూపరింటెండెంట్ తెలిపారు. ఖైదీల్లో ఎవరికైనా పాజిటివ్ కేసులు నమోదైతే వెంటనే క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. -
ఖైదీకి కరోనా.. జడ్జితోపాటు 100 మంది..
తిరువనంతపురం: రిమాండ్ ఖైదీకి కరోనా పాజిటివ్ రావడంతో 100 మంది క్వారంటైన్‌కు వెళ్లిన సంఘటన కేరళలో చోటుచేసుకుంది. వారిలో ఓ కోర్టు జడ్జితో పాటు, మరో సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు. అక్రమ మద్యం కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్టవగా వారిని నెడుమాంగడ్ కోర్టులో ఆదివారం ప్రవేశపెట్టారు. కోర్టు వారికి 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. దీంతో పూజాపుర సెంట్రల్ జైలుకు వారిని తరలించారు. అయితే, అంతకు క్రితమే సేకరించిన వారి లాలాజల నమూనాలను పరీక్షించగా.. ఆ ముగ్గురిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. (చదవండి: కేరళ ఆఫర్‌కు ఓకే చెప్పిన 'మహా' సర్కార్) విషయం తెలుసుకున్న జిల్లా కోవిడ్ నియంత్రణ అధికారులు నిందితులను ప్రవేశపెట్టిన కోర్టు జడ్జి, అరెస్టు చేసి లాకప్‌లో ఉంచిన వెంజరాముడు పోలీస్ స్టేషన్‌కు చెందిన 34 మంది పోలీసు సిబ్బంది, 12 మంది పూజాపుర సెంట్రల్ జైలు సిబ్బంది, లాలాజల నమూనాలు సేకరించిన ప్రభుత్వాస్పత్రి సిబ్బందిని క్వారైంటన్‌కు పంపించారు. ఇదిలాఉండగా.. మలయాళ నటుడు సూరజ్ వెంజరాముడు, వామన్‌పురం ఎమ్మెల్యే డీకే మురళి (సీపీఐ) కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. వెంజరాముడు సీఐ పాల్గొన్న విందులో వీకు కూడా పాల్గొనడమే దీనికి కారణం. (చదవండి: కరోనా: అప్పుడు కుదరలేదు.. ఇప్పుడైనా వెళ్లండి!) -
స్టేషన్లో నిందితుడి పుట్టినరోజు వేడుక
కర్ణాటక ,యశవంతపుర : రిమాండ్ ఖైదీ పుట్టిన రోజు వేడుకలు పోలీసు స్టేషన్లో జరిగాయి. ఈ విచిత్ర ఘటన విద్యారణ్య పోలీసు స్టేషన్లో జరిగింది. పోలీసు అధికారి పేరిట ప్రజల నుండి డబ్బులు వసూలు చేసిన కేసులో అభిషేక్ అలియాస్ అభిని గతేడాది పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో అభి పుట్టిన రోజు వేడుకలను పోలీసు స్టేషన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితుడు అభికి ఆ పోలీసు స్టేషన్ ఎస్ఐ కేక్ తినిపిస్తున్న ఫోటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఎస్ఐ, స్టేషన్ సిబ్బంది నిందితుడికి కేక్ తినిపిస్తున్న వీడియో, ఫోటోలు వైరల్ కావడంతో ప్రజల ఆక్రోశానికి గురవుతున్నారు. బాడుగకు తీసుకున్న కారును ధ్వసం చేసిన నిందితుడు అభిషేక్.. కారు యజమాని రిపేర్‌కు డబ్బులు అడిగితే నేను పోలీసును, నన్నే డబ్బులు అడుగుతావా.. కేసు నమోదు చేస్తానంటూ కారు యజమానిని బెదిరించారు. ఇదే కాకుండాకారు యజమాని నుంచి వేల రూపాయలను వసూలు చేశాడు. ఇందుకు సంబంధించి దాసరహళ్లి నివాసి కార్తీక్ విద్యారణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అభిషేక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి జతలో పోలీసులు కేక్ తిన్న విషయంపై ఉన్నత అధికారులను వివరణ కోరగా నిందితుడు పోలీసులతో సన్నిహితంగా ఉండేవాడు. ఏడాది క్రితం పుట్టిన రోజును స్టేషన్లో జరిపారు. అయితే నాలుగు నెలల క్రితం అక్కడి ఎస్ఐతో పాటు పోలీసులు బదిలీ అయినట్లు వివరించారు. ఎవరిపై చర్యలు తీసుకోవాలో అర్థం కావటంలేదన్నారు. -
విదేశీ ఖైదీ హల్చల్
చంచల్‌గూడ: సైబర్ నేరాల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నైజీరియన్ దేశస్తుడు న్వాంబా గురువారం జైలు వద్ద హల్చల్ చేశాడు. జైల్లో విదేశీయుల బ్యారెక్‌లో ఉన్న అతను ఇతరులతో గొడవ పడటంతో ప్రత్యేక సెల్‌కు తరలించారు. మానసిక వ్యాధితో బాధ పడుతున్న అతడిని జైలు అసుపత్రి వైద్యుల సూచన మేరకు ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించే క్రమంలో గురువారం పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. -
ప్రభుత్వాస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరార్..
సాక్షి, తూర్పు గోదావరి: కాకినాడ ప్రభుత్వాస్పత్రి నుంచి రిమాండ్‌లో ఉన్న ఓ ఖైదీ పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే.. సామర్లకోట మండలం గూడపర్తి గ్రామంలో జరిగిన బండి సత్యవతి హత్యకేసులో ప్రధాన ముద్దాయి, హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సురేష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతన్ని నిన్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఈ క్రమంలో తప్పించుకున్న రిమాండ్ ఖైదీ బండి సురేష్ ఇదే అదనుగా భావించి పరారయ్యాడు. -
రిమాండ్ ఖైదీ పరారీ
నెల్లూరు(క్రైమ్): రైల్వే పోలీసుల కళ్లు గప్పి రిమాండ్ ఖైదీ పరారైన ఘటన బుధవారం అర్ధరాత్రి నెల్లూరులో జరిగింది. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా బంగారుపేట మండలం సనత్‌నగర్‌కు చెందిన రంగా అలియాస్ ఎలాంగో అలియాస్ రవి చిన్నతనం నుంచే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు రైళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల రేణిగుంట పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి నెల్లూరు రైల్వే కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించింది. అప్పటి నుంచి నిందితుడు నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ అనుభవిస్తున్నారు. నిందితుడిపై తమిళనాడు రాష్ట్రం జోలార్‌పేటై రైల్వేపోలీసుస్టేషన్ పరిధిలో కేసులు ఉన్నాయి. నిందితుడిని తిరువత్తూరు జేఎఫ్‌సీఎం(111) కోర్టులో హాజరు పరిచేందుకు జోలార్‌పేటై రైల్వే సీఐ ఎస్.శివాహమిరమి తన సిబ్బందితో కలిసి బుధవారం నెల్లూరుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారం నుంచి పీటీ వారెంట్‌పై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బంగారు వ్యాపారిని తరలించే యత్నం.. అడ్డుకున్న సహచర వ్యాపారులు రంగాను రైల్వేపోలీసులు ఓ దొంగతనం కేసుకు సంబంధించి విచారించగా చిన్నబజారులోని ఓ బంగారు దుకాణంలో చోరీ సొత్తును విక్రయించాడని వెల్లడించారు. దీంతో పోలీసులు నిందితుడిని వెంట బెట్టుకుని సదరు బంగారు దుకాణం వద్దకు వెళ్లి దుకాణ యజమానిని విచారించారు. అతను తన వద్ద అమ్మలేదని చెప్పడంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా సహచర వ్యాపారులు పోలీసులను అడ్డుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న సంతపేట ఎస్సై సుభాన్ ఘటన స్థలానికి చేరుకుని రైల్వేపోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అందరూ కలిసి సంతపేట పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. అక్కడ నిందితుడు చెప్పిన వివరాల మేరకే వ్యాపారిని అదుపులోకి తీసుకుంటున్నామని తమిళనాడు పోలీసులు సంతపేట పోలీసులకు తెలిపారు. అయితే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపకపోవడంతో అవి తీసుకు వచ్చి వ్యాపారిని తీసుకెళ్లాలని పోలీసులు చెప్పడంతో వారు వెనుదిరిగినట్లు సమాచారం. ప్యాసింజర్‌లో తరలిస్తుండగా కళ్లుగప్పి బుధవారం రాత్రి నెల్లూరు రైల్వేస్టేషన్ నుంచి కాకినాడ తిరుపతి ప్యాసింజర్‌లో తిరుపతికి బయలుదేరారు. రైలు సిగ్నల్ కోసం కొమ్మరపూడి సమీపంలో ఆగగా నిందితుడు మరుగుదొడ్డికి వెళ్లాలని చెప్పడంతో వారు అతన్ని బాత్రూమ్వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు వారిని తోసేసి రైల్లోంచి దూకి పరారయ్యాడు. ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న రైల్వే సిబ్బంది, సీఐ హుటావుటిన రైల్లో నుంచి దిగి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ ప్రాంతమంతా చీకటిగా ఉండటంతో అప్పటికే నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ మేరకు సీఐ నెల్లూరు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఎస్డీ సిరాజుద్దీన్ కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
పరారీ నిందితుడి కోసం వెళితే..
ధర్మవరం అర్బన్: పరారీలో ఉన్న రిమాండ్ నిందితుడి కోసం వెళితే మరో ఇద్దరు నిందితులు కూడా పోలీసులకు పట్టుబట్టారు. వివరాల్లోకి వెళితే... బత్తలపల్లి మండలం రామాపురం వద్ద జీవిస్తున్న సంచారజీవుల మధ్య 2017 డిసెంబర్ 4న గొడవలు జరగడంతో షికారి రోహి అలియాస్ రవి, ఆయన సోదరుడు శ్రీకాంత్‌లు శ్రీనివాసులు దంపతుల గొంతులు కోశారు. ఈ ఘటనలో శ్రీనివాసులు మృతి చెందగా భార్య ప్రాణాలతో బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు షికారి రోహిని మూడునెలల క్రితం బద్వేలు వద్ద అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు. ధర్మవరం సబ్‌జైలులో ఉన్న రిమాండ్ నిందితుడు షికారి రోహిని జూలై 17న బత్తలపల్లి పోలీసులు బాలకృష్ణ ఎస్కార్ట్‌తో ధర్మవరం కోర్టుకు తరలించారు. కోర్టులో పోలీసుల కళ్లుగప్పి షికారి రోహి పారిపోయాడు. ఎలాగైనా అతడిని పట్టుకోవాలని ధర్మవరం, బత్తలపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు నిందితున్ని పట్టుకునేందుకు పక్కా ప్రణాళిక వేశారు. దీంతో పోలీసు బృందం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలో నిందితుని కోసం గాలించారు. షికారి రోహి స్వస్థలం అయిన మహారాష్ట్రలోని నాందేడ్జిల్లా ముఖేడ్ తాలూకాలో ఉన్నట్లు సమాచారం అందింది. పోలీసులు పక్కా వ్యూహంతో నిందితుడు షికారి రోహి ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. షికారి రోహితోపాటు అదే హత్య కేసులో ఉన్న అతని సోదరుడు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు కడప జిల్లా బద్వేల్ ప్రాంతంలో వివిధ కేసుల్లో ఉన్న మరో నిందితుడు వెంకటేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒకరి కోసం వెళితే మరో ఇద్దరు నిందితులు దొరకడంతో పోలీసు యంత్రాంగం ఊపిరిపీల్చుకున్నట్లు అయింది. పరారైన రిమాండ్ నిందితుడు షికారి రోహి, అదే హత్య కేసులో నిందితుడు శ్రీకాంత్, మరో కేసులో నిందితుడు వెంకటేష్‌లను పట్టుకున్నందుకు ప్రత్యేక పోలీసు బృందం కానిస్టేబుళ్లు వేణుగోపాల్, భాస్కర్‌నాయుడు, బాలకృష్ణలను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. నిందితులను సోమవారం బత్తలపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకురానున్నట్లు సమాచారం. -
పోలీసుల కళ్లుగప్పి
నెల్లూరు(క్రైమ్): ఎస్కార్ట్ పోలీసుల కళ్లు గప్పి రిమాండ్ ఖైదీ పరారైన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు పలు కేసుల్లో మోస్ట్‌వాంటెడ్ కావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాలు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లింగేశ్వరనగర్‌కు చెందిన నిమ్మల హరీష్ అలియాస్ హరి చిన్నతనం నుంచే దొంగతనాలకు అలవాటుపడ్డాడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. గుంటూరు జైల్లో ఉన్న సమయంలో హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన విజయకుమార్ అలియాస్ విక్కీ అలియాస్ రెడ్డితో పరిచయమైంది. జైలు నుంచి బయటకొచ్చిన వారు కార్లలో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడేవారు. నిందితులు ఇటీవల కడప పోలీసులకు చిక్కారు. పోలీసుల విచారణలో నెల్లూరు బాలాజీనగర్‌లో 2017లో ఓ ఇంట్లో దొంగతనం చేసినట్లు నిందితులు నేరం అంగీకరించారు. అప్పటి నుంచి నిందితులు తిరుపతి స్పెషల్ సబ్జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల పదిన నెల్లూరు బాలాజీనగర్ పోలీసులు నిందితులను దొంగతనం కేసులో విచారించేందుకు తిరుపతి స్పెషల్ సబ్‌జైల్ నుంచి నెల్లూరు కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో అదే రోజు జిల్లా కేంద్రకారాగారానికి తరలించారు. అనంతరం కోర్టు అనుమతితో 14వ తేదీన హరీష్, విజయకుమార్‌ను బాలాజీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి 15వ తేదీన జిల్లా కేంద్రకారాగారానికి తరలించారు. ఈ నేపథ్యంలో తిరుపతి నగరంలోని తిరుచానూరు పోలీసులు దొంగతనం కేసులో విచారించేందుకు పీటీ వారెంట్‌పై హరీష్‌ను మరో రిమాండ్ ఖైదీని నెల్లూరు కేంద్రకారాగారం నుంచి ఈ నెల 16న తీసుకెళ్లారు. 17వ తేదీన నిందితులను ప్రాపర్టీ రికవరీ కోసం తిరుపతిలోని పద్మావతిపురానికి తీసుకెళ్లగా, శ్రీహరిమెస్ వద్ద పోలీసుల కళ్లుగప్పి హరీష్ పరారయ్యాడు. దీనిపై ఎస్కార్ట్ పోలీసులు అదే రోజు తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. రిమాండ్ ఖైదీ పరారైన ఘటనపై తిరుచానూరు పోలీసులు ఈ నెల 18న నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారానికి సమాచారం అందించారు. నిమ్మ ల హరీష్‌పై తిరుపతిలో 12, మదనపల్లి, చిత్తూరు, కడపల్లో నాలుగు పెండింగ్ వారెంట్లు ఉన్నాయి. -
నివేదికలో ఏముంది?
వేములవాడ: వేములవాడ పట్టణానికి చెందిన సంచారిజీవి కడమంచి వెంకటేశ్ (28) మృతదేహానికి బుధవారం రీపోస్టుమార్టం చేశారు. మృతదేహం ఖననం చేసిన మూలవాగు వద్ద వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ వైద్యనిపుణులు సుమారు ఆరుగంటలపాటు శవపరీక్ష నిర్వహించారు. వేములవాడలోనే తొలిసారి రీపోస్టుమార్టం చేయడంతో సమీప ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రజా, దళిత సంఘాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. వేములవాడ: రాష్ట్రమంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేటలో జూలై 5న పర్యటించిన సందర్భంగా ఓ వ్యక్తి పర్సు చోరీ చేశాడనే కారణంతో వెంకటేశ్‌ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు కేసులు నమోదు చేసి అదేనెల 13న కరీంనగర్ జైలుకు తరలించారు. అక్కడ తీవ్రఅనారోగ్యానికి గురవడంతో జైలు అధికారుల పర్యవేక్షణలో అదేనెల 26న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిరిత్స పొందుతూనే వెంకటేశ్ ఆగస్టు 3వ తేదీన చనిపోయాడు. మరుసటి రోజు కుటుంబసభ్యులు వేములవాడ మూలవాగులో ఖననం చేశారు. చేయని నేరం మోసి ఒప్పుకోవాలంటూ పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించడంతోనే తన భర్త చనిపోయాడని, దీనిపై నిజానిజాలు తెలికి తీసి, తనకు న్యాయం చేయాలని మృతుడి భార్య రేణుక హైకోర్టును ఆశ్రయించింది. వివిధ ప్రజాసంఘాలు సైతం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. స్పందించిన హైకోర్టు.. రీ–పోస్టుమార్టం చేసి నివేదికను సీల్డ్కవర్లో సమర్పించాలని ఆదేశించింది. దీంతో కాకతీయ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ వైద్యనిపుణులు ప్రొఫెసర్ కృపాల్‌సింగ్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాజామొయినుద్దీన్, రజామాలిక్‌ఖాన్ బుధవారం ఉదయం 11.30 గంటలకు వేములవాడకు చేరుకున్నారు. జిల్లా వైద్యాధికారి ఎ.రాజేశం, ఆర్డీవో పాండురంగారావు, తహసీల్దార్ శ్రీనివాస్, వెంకటేశ్ భార్య రేణుక, బంధువులు, ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. వీరిసమక్షంలో వెంకటేశ్ శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేశారు. సుమారు 6గంటల తర్వాత సాయంత్రం 5.30 గంటలకు శవపరీక్ష ప్రక్రియ ముగిసింది. నివేదికను సీల్డ్కవర్లో హైకోర్టుకు సమర్పిస్తామని కృపాల్‌సింగ్ తెలిపారు. రూ.20 లక్షల పరిహారం చెల్లించాలి వెంకటేశ్ ఊరూరా తిరుగుతూ కూలీ పనులు చేస్తూ భార్యాపిల్లలను పోషించుకుండేవాడని, పోలీసులు చోరీ కేసు నమోదు బనాయించి చిత్రహింసలకు గురి చేశారని, దీంతోనే జైలు తీవ్రఅనారోగ్యానికి గురై మృతి చెందాడని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయవింధ్యాల ఆరోపించారు. మూలవాగులో ఆమె విలేకరులతో మాట్లాడారు. వెంకటేశ్ మృతితో అతడి భార్య రేణుక, ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారని అన్నారు. జిల్లా పోలీసులు పౌరహక్కులు ఉల్లంఘిస్తున్నారని దుయ్యబట్టారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. టీ మాస్ స్టీరింగ్ కమిటీ సభ్యు కె.చంద్రన్న, తెలంగాణ పునర్నిర్మాణ మిషన్ ప్రధాన సమన్వయకర్త ఎంఏ షోయబ్, అబ్దుల్ మసూద్, మొహమ్మద్ యూకూబా, శ్రీనివాస్, డీఎల్ఎఫ్ నాయకులు మార్వాడి సుదర్శన్, కమటం అంజయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆవునూరి ప్రభాకర్, కోనాపురం లక్ష్మణ్, గుండా థామస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగీతం శ్రీనివాస్, సాగారం వెంకటేశ్, ముడిక చంద్రశేఖర్, ఆకునూరి బాలరాజులు పాల్గొన్నారు. మమ్మల్ని ఆదుకోండి కడమంటి రేణుక పోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే తన భర్త వెంకటేశ్ మరణించాడని రేణుక ఆరోపించింది. నా భర్త చావుకు కారణమైన ఎస్పీ, సీసీఎస్ ఎస్సై, పోలీసులపై చర్య తీసుకోవాలని వేడుకుంది. తన కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని విన్నవించింది. తహసీల్దార్‌తో వాగ్వాదం తహసీల్దార్ శ్రీనివాస్‌తో మృతుడి కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు. రీపోస్టుమార్టం నివేదిక రూపొందిస్తుండగా.. వెంకటేశ్ మృతికి ఎవరిపైనన్నా అనుమానం ఉందా? అని తహసీల్దార్ అడిగారు. దీంతో ఎస్పీ, సీసీఎస్ ఎస్సై, పలువురు పోలీసుల తీరుతో తన భర్త చనిపోయాడని మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. ఇందులో ఒకరిద్దరు పేర్లు నమోదు చేసేందుకు తహసీల్దార్ నిరాకరించడంతో ఎందుకు రాయరంటూ మృతుడి కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు. అధికారులు నిజాయితీగా వ్యవహరించాలని ప్రజాసంఘాల నాయకులు జయవింధ్యాల, చంద్రన్న, షోయబ్, మార్వాడి సుదర్శన్, విజయ్ దుయ్యబట్టారు. -
రోశయ్య మృతదేహానికి పోస్టుమార్టం
రిమాండ్ ఖైదీ రోశయ్య మృతదేహానికి పోస్టుమార్టం మార్కాపురం : గుండెపోటుతో మృతి చెందిన మార్కాపురం సబ్‌జైలు రిమాండ్ ఖైదీ నీలం రోశయ్య మృతదేహానికి ఏరియా వైద్యశాలలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఒంగోలుకు చెందిన ప్రొఫెసర్ రాజ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సుబ్బారావులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆర్డీఓ పెంచల కిశోర్, సీఐ బత్తుల శ్రీనివాసరావు, పట్టణ, రూరల్ ఎస్సైలు శ్రీకాంత్, మల్లికార్జునరావు, జైలు సూపరింటెండెంట్ ఉమామహేశ్వరరావులు ఉన్నారు. న్యాయ విచారణకు డిమాండ్.. మృతుడు రోశయ్య కుటుంబానికి న్యాయం చేయాలని దళిత సంఘా నాయకులు ఏరియా వైద్యశాలలో మార్చురీ గది మంగళవారం సాయంత్రం ధర్నా నిర్వహించారు. జిల్లా పౌరహక్కుల సంఘం సభ్యుడు కె.జయరాం, రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు దారా అంజయ్య, ఉపాధ్యక్షుడు దాసరి శివాజీ, సీపీఐ జిల్లా కార్యదర్శి కె.అరుణ ధర్నాలో పాల్గొన్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు జూలియస్ మాట్లాడుతూ దోర్నాల పోలీసుల చిత్రహింసలు, జైలు సిబ్బంది నిర్లక్ష్యం రోశయ్య ప్రాణాలను బలితీసుకుందని ఆరోపించారు. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. -
బ్లేడుతో ఒళ్లంతా కోసుకుని..
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న రిమాండ్ ఖైదీ బ్లేడుతో ఒళ్లంతా గాయపరుచుకుని బీభత్సం సృష్టించాడు. ఈ సంఘటనతో నివ్వెరపోయిన పోలీసులు అతనిని రహస్యస్థావరంలో ఉంచారు. దాదాపు 150 కేసుల్లో నిందితుడుగా ఉన్న తమిళనాడుకు చెందిన నవాజ్‌షరీఫ్‌ను చెన్నై పోలీసులు మంగళారం ఉదయం తీసుకువచ్చి ఇక్కడి కేసుల విచారణ నిమిత్తం ఒంగోలు జైలు అధికారులకు అప్పగించారు. అయితే విచారణ నిమిత్తం పీటీ వారెంట్‌పై టూటౌన్ పోలీసులు నవాజ్‌షరీఫ్‌ను మంగళవారం సాయంత్రం స్టేషన్‌కు తీసుకువచ్చారు. అక్కడ మంగళవారం రాత్రి కడుపులో దాచుకున్న బ్లేడును బయటికి తీసి శరీరమంతా విచక్షణారహితంగా కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావంతో సోమ్మసిల్లి పడిఉన్న నవాజ్‌షరీఫ్‌ను గమనించిన పోలీసులు కంగారుపడి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళి ప్రాథమిక చికిత్స చేయించి రహస్యస్థావరంలో ఉంచారు. కడుపులో దాచుకున్న బ్లేడును నీళ్లు తాగి వెలుపలికి తెచ్చే చాకచక్యం నవాజ్‌షరీఫ్‌కు తెలుసునని, దాని ద్వారానే ఈ అరాచకానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. ఒళ్లంతా బ్లేడు గాట్లు ఉండడంతో జైలు అధికారులు అతనిని జైలులో ఉంచుకునేందుకు తిరస్కరించారు. దీంతో దిక్కుతోచని పోలీసులు గాయాలు మానేంతవరకూ రహస్యస్థావరంలో ఉంచారని చెబుతున్నారు. ఈ విషయం బుధవారం ఉదయం పట్టణంలో సంచలనం సృష్టించింది. -
సుశృత మామ జైల్లో గుండెపోటుతో మృతి
హైదరాబాద్: వారం రోజుల క్రితం నగరంలో సంచలనం రేపిన వివాహిత సుశృత ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె మామ శంకర్ రావు ఆదివారం ఉదయం హార్ట్ఎటాక్తో మృతిచెందాడు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన ఆదివారం ఉదయం గుండెపోటుకు గురయ్యాడు. నగరంలోని సైదాబాద్ పూసలబస్తీకి చెందిన సుశృతను వాటర్ హీటర్ ఎక్కువసేపు వాడిందనే నెపంతో వారం రోజుల క్రితం ఆమె భర్త తీవ్రంగా కొట్టాడు. చదవండి: హీటర్ ఎక్కువసేపు పెట్టానని కొట్టిండు! బాత్రూంలో ఉన్న ఆమెను వివస్త్రగా ఉండగానే కుటుంబసభ్యుల ఎదుట తీవ్రంగా కొట్టడంతో మనస్తాపానికి గురైన ఆమె అదే రోజు వాట్సప్‌లో తన తండ్రికి మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తతో పాటు మామ శంకర్రావును అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం శంకర్రావు గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
సబ్ జైలు నుంచి ఖైదీ పరారీ
రేపల్లె : రేపల్లె పట్టణంలోని సబ్‌జైలు నుంచి బుధవారం రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. సబ్ జైలర్ మోహనరావు కథనం ప్రకారం.. సత్తెనపల్లి మండలం బడుగుబండకు చెందిన కుంచాల నాగరాజు దొంగతనం కేసులో 5 నెలల నుంచి రిమాండ్ ఖైదీగా సబ్‌జైలులో ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం భోజన అనంతరం మరుగుదొడ్డికని వెళ్లిన నాగరాజు ఎంతకూ రాలేదు.Sఅనుమానం వచ్చి మరుగుదొడ్డిలో చూడగా నాగరాజు కనిపించలేదని, చుట్టు పక్కల వెతికినా ఫలితంలేదన్నారు. మరుగుదొడ్డికి వెళ్లే నెపంతో పక్కనే ఉన్న గోడ దూకి పారిపోయాడని గ్రహించి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని మోహనరావు తెలిపారు. అతని కోసం విస్తత గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. -
ఖైదీ నాటకం
రిమాండ్ ఖైదీ పరార్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి.. కడుపు నొప్పి అంటూ డ్రామా.. హెడ్ కానిస్టేబుల్‌ను బాత్రూంలో బంధించి.. నిజామాబాద్ క్రైం: ఆటోడ్రైవర్ హత్య కేసులో పట్టుబడిన రిమాండ్ ఖైదీ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. డ్యూటీలోని హెడ్ కానిస్టేబుల్‌ను బాత్రూమ్లోకి తోసి మరీ తప్పించుకు పోయిన ఘటన పోలీసు వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది. విధుల్లో నలుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉండటంతో ఖైదీ సులభంగా తప్పించుకుని పారిపోయాడు. సిబ్బంది నిర్లక్ష్యం, ఖైదీ పరారీపై జిల్లా ఎస్పీ తీవ్రంగా పరిగణిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన నీరడి అరుణ్ బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లి నెల రోజుల క్రితం తిరిగి వచ్చాడు. ఇదే గ్రామానికి చెందిన మంగలి హన్మాండ్లు, నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన రాజ్‌కుమార్ పాత స్నేహితులు. అరుణ్ ఇటీవల తన మకాన్ని నిజామాబాద్‌కు మార్చాడు. ఈ క్రమంలో ఆటోడ్రైవర్ షేక్ మహమూద్తో పరిచయం ఏర్పడింది. గల్ఫ్ నుంచి వచ్చిన అరుణ్ వద్ద డబ్బులు లేక పోవటంతో షేక్ మహమూద్‌ను హతమార్చి ఆటోను అమ్మి సొమ్ము చేసుకునేందుకు స్నేహితులు హన్మండ్లు, రాజ్‌కుమార్‌లతో కలిసి కుట్ర పన్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 5న విందు పేరుతో ముగ్గురు కలిసి మహమూద్‌ను జక్రాన్‌పల్లి మండలం బ్రాహ్మణపల్లి శివారుకు తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం మహమూద్‌పై దాడిచేసి హతమార్చారు. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి పెర్కిట్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై పారవేశారు. ఈ నెల 14న ఆటోడ్రైవర్‌ను హత్యచేసిన ముగ్గురు ఆటోను నిర్మల్‌లో విక్రయించేందుకు బయలుదేరారు. ఆర్మూర్ పోలీసులు మామిడిపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ఆటోను ఆపి రిజిస్ట్రేషన్ పత్రాలు అడుగగా చూపించక పోవడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అరుణ్ హత్య వెలుగు చూసింది. పోలీసులు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుచగా కోర్టు రిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా సారంగపూర్ జిల్లా జైలులో ఉన్న ప్రధాన నిందితుడు అరుణ్ ఈ నెల 15న తనకు ఆరోగ్యం బాగా లేదని జైలు అధికారులకు తెలిపాడు. దాంతో వారు ఎస్కార్ట్ పోలీసులతో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఖైదీల వార్డుకు తరలించారు. ఆదివారం ఉదయం విధుల్లో హెడ్‌కానిస్టేబుల్ పాపారావు ఉన్నారు. వార్డుకు కాపాలగా హెడ్‌కానిస్టేబుల్ ఒక్కరే ఉండడం గమనించిన అరుణ్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. తనకు కడుపునొప్పి తీవ్రంగా ఉందంటూ డ్రామా ఆడాడు. అరుణ్‌ను హెడ్‌కానిస్టేబుల్ బాతూరూంకు తీసుకువెళ్లాడు. బాత్రూంలోకి వెళ్లిన అరుణ్ అందులో నీళ్లు రావటంలేదని చెప్పటంతో హెడ్‌కానిస్టేబుల్ బాత్రూంలోకి వెళ్లి పరిశీలిస్తుండగా అతడిని ఒక్కసారిగా లోపలకు తోసి బయట నుంచి గొళ్లెం పెట్టేశాడు. నైట్‌ప్యాంట్ ధరించి ఉన్న హెడ్‌కానిస్టేబుల్ వార్డు ఇనుప డోర్‌కు వేసిన తాళాం చెవిని బెంచ్‌పై పెట్టాడు. ఆ తాళం చెవితో డోర్ తీసుకుని అరుణ్ తాపీగా పారిపోయాడు. వార్డులో ఉన్న మరోఖైదీ యాదయ్య అరుస్తూ అతనికి కేటాయించిన మంచానికి చేతికి గొలుసుతో తాళం వేసి ఉన్నప్పటికీ మంచంతో పాటు బాత్రూం వద్దకు వచ్చి గొళ్లెల తీశాడు. బాత్రూం నుంచి బయటకు వచ్చిన హెడ్‌కానిస్టేబుల్ ఆస్పత్రి పరిసరాలలో గాలించినప్పటికీ అప్పటికే అరుణ్ పారిపోయాడు. ఒకటవ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో అప్రమత్తపై గాలింపు చర్చలు చేపట్టారు. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అరుణ్ పారిపోయిన చిత్రాలు సరిగ్గా రికార్డు కాలేదు. దాంతో వన్‌టౌన్ పోలీసులు ప్రధాన చౌరస్తాలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. విధుల్లో ఒక్కరే.. ఆస్పత్రిలో ఖైదీ వార్డుల బందోబస్తు కోసం ఏఆర్ విభాగానికి చెందిన వారిని నియమిస్తారు. ఏఆర్ ఏఎస్సై గులాం దస్తాగిరి, హెడ్‌కానిస్టేబుళ్లు నాగేశ్వర్, గోవింద్, ప్రసాద్‌లు వంతుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో ఆదివారం ఉదయం పాపారావు ఒక్కరే విధుల్లో ఉండటంతో ఖైదీ గమనించి పారిపోయాడు. నలుగురి సస్పెన్షన్ నిజామాబాద్ క్రైం : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పారిపోయిన ఘటనలో నలుగురు పోలీసు సిబ్బందిపై జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ సస్పెన్షన్ వేటు వేశారు. సారంగాపూర్ జిల్లా జైలులో హత్యనేరంపై రిమాండ్‌లో ఉన్న ఖైదీ అరుణ్‌ను ఈ నెల 15న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. జైల్ నుంచి అరుణ్‌ను ఏఆర్ ఏఎస్సై గులాం దస్తగిరి, హెడ్‌కానిస్టేబుళ్లు పాపారావు, ప్రసాద్, నాగేశ్వరరావులు వైద్య పరీక్షల కోసం తీసుకువచ్చారు. ఆదివారం ఉదయం విధి నిర్వహణలో పాపారావు ఒక్కరే ఉండటంతో పథకం ప్రకారం హెడ్‌కానిస్టేబుల్‌ను బాత్రూంలోకి తోసి పారిపోయాడు. ఆ సమయంలో ఖైదీల గది మెయిన్ డోర్‌కు తాళం వేయాలి కాని, పాపారావు తాళం వేయకుండా నిర్లక్ష్యం వహించాడు. దాంతో ఖైదీ పారిపోయాడు. మిగతా సిబ్బంది ముగ్గురు విధులకు గైర్హాజరు కావటంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను మొత్తం నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. పారిపోయిన ఖైదీపై అండర్ సెక్షన్ 342 ప్రకారం కేసు నమోదు చేసి పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. విధులను నిర్వర్తించే క్రమంలో ఎవరైనా అలసత్వం కాని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. -
దాహం వేస్తోంది సారూ! అంతలోనే..
తెనాలి రూరల్(గుంటూరు జిల్లా): కోర్టు వాయిదాకు తీసుకువచ్చిన ఎస్కార్టు పోలీసుల కళ్లు గప్పి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న నిందితుడిగా ఉన్న ఇతను సునాయాసంగా సిబ్బందిని పక్కదోవ పట్టించి జారుకున్నాడు. వివరాలు.. తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన కొప్పరాజు వెంకటయుగంధర్ అలియాస్ పంతులు, తెనాలి తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం తెనాలి సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న ఇతన్ని సోమవారం కోర్టు వాయిదా నిమిత్తం ఇద్దరు కానిస్టేబుళ్లు కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు ఆవరణలో ఒక ఎస్కార్ట్ కానిస్టేబుల్ ఏపీపీని కలవడానికి వెళ్లినపుడు.. మిగిలిన కానిస్టేబుల్‌తో తనకు దాహం వేస్తోంది నీరు తాగుతానని చెప్పి యుగంధర్ పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం
తెనాలి రూరల్ (గుంటూరు జిల్లా) : ఓ హత్య కేసుకు సంబంధించి రిమాండ్‌లో ఉన్న ఖైదీ అధిక మోతాదులో ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలి సబ్ జైలులో సోమవారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. నందులపేటకు చెందిన వృద్ధుడి హత్యకేసులో పట్టణ ఐతానగర్‌కు చెందిన వల్లభాపురం రాజేష్ నిందితుడు. 41 రోజులు నుంచి సబ్జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురికావటంతో వైద్య సేవలు పొందిన రాజేష్, ఆ సమయంలో వైద్యులు ఇచ్చిన ట్యాబ్లెట్లు తన వద్దే ఉంచుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతని బెయిల్ విషయంలో కుటుంబసభ్యులు సహకరించకపోవటంతో విరక్తి చెంది అధిక మోతాదులో ట్యాబ్లెట్లు మింగినట్లు తెలిసింది. విషయం గమనించిన జైలు సిబ్బంది చికిత్స నిమిత్తం రాజేష్‌ను తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
రిమాండ్ ఖైదీ అనుమానాస్పద మృతి
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : రిమాండ్ ఖైదీ అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దక్కిలి మండలం వెంగుళూరు గ్రామంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన గానుగ శ్రీను(35) ఎర్ర చందనం స్మగ్లింగ్ పాల్పడుతుండగా.. పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో శనివారం అనారోగ్యానికి గురైన శ్రీనును పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందట అతను మృతిచెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులు హింసించడం వల్లే శ్రీను మృతిచెందాడని ఆరోపిస్తున్నారు. -
సబ్జైల్లో రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం
పశ్చిమగోదవరి: తప్పుచేసిన తనతో కుటుంబ సభ్యులు మాట్లాడంలేదని.. మనస్తాపానికి గురైన ఖైదీ బాత్రూంలోని ట్యూబ్‌లైట్‌ను పగలగొట్టి దానితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకు సబ్జైల్లో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. జుట్టిగ యోహాన్ అత్యాచారం కేసులో జూన్16 నుంచి సబ్జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. అప్పటినుంచి అతన్ని చూడడానికి అతని కుటుంబ సభ్యులు ఎవరు జైలుకు రాకపోవడంతో పాటు.. ఎన్నిసార్లు ఫోన్ చేసిన మాట్లాడక పోవడంతో.. మనస్తాపానికి గురైన యోహాన్ ఈ రోజు ఉదయం స్నానానికని బాత్రూంకు వెళ్లి.. అక్కడ ఉన్న ట్యూబ్‌లైట్ పగలగొట్టి దానితో కడుపులో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన జైలు సిబ్బంది అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
రిమాండ్ ఖైదీ పరారీ
గుంటూరు(నరసరావుపేట): పోలీసుల కళ్ళుగప్పి రిమాండ్ ఖైదీ పరారైన సంఘటన గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంతర్ జిల్లాల నేరస్తుడు ఏరియా వైద్యశాల నుంచి పోలీసుల కళ్లుకప్పి పారిపోయాడు. ఈ వ్యవహారంపై పోలీసు, సబ్‌జైలు అధికారులు అత్యంత గోప్యంగా విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే. ప్రకాశం జిల్లా ఒంగోలు ఇస్లాంపేట 4వ వీధికి చెందిన షేక్ రఫీ, తండ్రి మస్తాన్‌వలిపై గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలు కేసులు ఉన్నాయి. మూడు నెలల క్రితం నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్‌నగర్‌లో జరిగిన ద్విచక్రవాహన చోరీ కేసులో రఫీ నిందితుడు. అతనిని ఒంగోలు రూరల్ పోలీసులు దొంగతనం కేసులో రెండు నెలల క్రితం అరెస్టుచేసి సబ్‌జైలుకు తరలించారు. రఫీ సబ్‌జైలులో ఉన్నాడని తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు ఈనెల 6వ తేదీన అతడిని పీటీ వారంట్‌పై ద్విచక్రవాహన దొంగతనం కేసులో న్యాయస్థానం ఎదుట హాజరుపర్చి నరసరావుపేట సబ్‌జైలుకు తరలించారు. అప్పటి నుంచి అతను సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. ఈనెల 12వ తేదీన రఫీకి జ్వరం రావటంతో సబ్‌జైలు సిబ్బంది ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు తమ పర్యవేక్షణలో ఉంచి చికిత్స చేయాలని సూచించటంతో వైద్యశాలలో ఉంచారు. ఈ క్రమంలో 14వ తేదీ తెల్లవారుజామున ఎస్కార్టు విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసు సిబ్బంది కళ్లు గప్పి రఫీ పరారయ్యాడు. ఈ సంఘటనపై అదే రోజు వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. విషయం బయటకు పొక్కకుండా పోలీసులు, సబ్‌జైలు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. -
రిమాండ్ ఖైదీ ఆత్మహత్యా యత్నం
మహబూబ్ నగర్: విచారణలో ఉన్న రిమాండ్ ఖైదీ గొంతు కొసుకుని బలవన్మరణానికి యత్నించాడు. ఈ ఘటన మంగళవారం గద్వాల్లో వెలుగులోకి వచ్చింది. రాజు అనే పాత నేరస్తుడిని ఓ దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా స్టేషన్ ఆవరణలో బ్లేడుతో గొంతుకొసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో పోలీస్ సిబ్బంది సదరు వ్యక్తిని కర్నూలులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చికిత్సపొందుతూ రిమాండ్ ఖైదీ మృతి
గుంటూరు: గుంటూరు సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న ఖైదీ షేక్ నజీర్ (52) అస్వస్థతకు గురై స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆస్పత్రి ఔట్ పోస్టు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం తాడేపల్లికి చెందిన షేక్ నజీర్ రైల్వేలో 4వ తరగతి ఉద్యోగిగా నల్లపాడు రైల్వేస్టేషన్ లో పనిచేసేవాడు. రెండు నెలల కిందట నల్లపాడు రైల్వేస్టషన్ వద్ద మూగ యువతిపై అత్యాచారం చేసి హత్యచేసిన ఘటనలో ప్రధాన నిందితుడు. ఈ కేసులో అతడు సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న అతడు అస్వస్థతకు గురవడంతో జైలు పోలీసులు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.