ఆదిలాబాద్: రిమాండ్లో ఉన్న ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని వన్టౌన్ పోలీస్స్టేషన్లో శుక్రవారం చోటుచేసుకుంది. ఓ కేసులో రిమాండ్లో ఉన్న బషీర్ అనే ఖైదీ బాత్రూంలో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో బషీర్ను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.