
‘పీపుల్ స్టార్’ ఆర్. నారాయణ మూర్తి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వల్ప అస్వస్థతకు గురికావడంతో.. బుధవారం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు సైతం నారాయణ మూర్తి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.
దీంతో స్వయంగా ఆర్. నారాయణ మూర్తే తన ఆరోగ్యంపై స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం తాను నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని..దేవుడి దయతో బాగానే కోలుకుంటున్నానని చెప్పారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చి.. అన్ని వివరాలు చెబుతానన్నారు.
కాగా, నారాయణ మూర్తి ఆరోగ్యంపై నిమ్స్ వైద్యులు సైతం స్పందించారు. నారాయణమూర్తి స్వల్పంగానే అస్వస్థతకు లోనయ్యారని, చికిత్సతో క్రమంగా కోలుకుంటున్నారని, ఆయనకు నిర్వహించినవి కూడా సాధారణ టెస్టులేనని నిమ్స్ వైద్యులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment