illnes
-
మధ్యాహ్న భోజనం తిని 9మంది విద్యార్థులకు అస్వస్థత
చాట్రాయి: మధ్యాహ్న భోజనం తిని తొమ్మిదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఏలూరు జిల్లా, చాట్రాయి మండలంలోని కోటపాడు యూపీ స్కూల్లో బుధవారం మధ్యాహ్నం 39 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ ప్రకారం దుంప కుర్మా వారికి వడ్డించారు. భోజనం తిన్న అర గంట తర్వాత ఎన్.కల్పన, టి.క్రాంతి మేఘన, ఉమా యశ్వంత్, ఎం.దుర్గామనీష్, ఎన్.అమృత, ఎన్.లాస్య, టి.సిరి స్పందన, ఎన్.ఉదయకుమార్, టి.వర్షిణి కడుపు నొప్పితో బాధపడ్డారు. విషయం తెలిసిన చాట్రాయి పీహెచ్సీ వైద్యాధికారి విజయలక్ష్మి పాఠశాలకు వెళ్లి వారికి వైద్యం అందించారు. మళ్లీ గురువారం చనుబండ పీహెచ్సీ వైద్యాధికారి దుర్గాప్రసాద్ వెళ్లి విద్యార్థులకు వైద్యం చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. గురువారం మధ్యాహ్నం భోజనం చేయగానే వీరిలో ఒకరికి కడుపు నొప్పి, మరొకరికి వాంతులు అవడంతో ఎంఈవో బ్రహ్మచారి 9 మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బుధవారం మెనూలో దుంప కుర్మా కూరలో రాగి పిండి కలిపి భోజనం పెట్టారని, విద్యార్థుల్లో అరుగుదల లేకపోవడం వలన గ్యాస్ కారణంగా కడుపు నొప్పి వచ్చిందని చాట్రాయి పీహెచ్సీ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. -
ఆందోళన చెందొద్దు..ఆరోగ్యంగానే ఉన్నా: ఆర్.నారాయణ మూర్తి
‘పీపుల్ స్టార్’ ఆర్. నారాయణ మూర్తి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వల్ప అస్వస్థతకు గురికావడంతో.. బుధవారం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు సైతం నారాయణ మూర్తి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. దీంతో స్వయంగా ఆర్. నారాయణ మూర్తే తన ఆరోగ్యంపై స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం తాను నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని..దేవుడి దయతో బాగానే కోలుకుంటున్నానని చెప్పారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చి.. అన్ని వివరాలు చెబుతానన్నారు.కాగా, నారాయణ మూర్తి ఆరోగ్యంపై నిమ్స్ వైద్యులు సైతం స్పందించారు. నారాయణమూర్తి స్వల్పంగానే అస్వస్థతకు లోనయ్యారని, చికిత్సతో క్రమంగా కోలుకుంటున్నారని, ఆయనకు నిర్వహించినవి కూడా సాధారణ టెస్టులేనని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. -
హాస్పిటల్లో మాదాల
విప్లవ నటుడు, నిర్మాత ‘రెడ్ స్టార్’ మాదాల రంగారావు శనివారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర అస్వస్థత, శ్వాసకోస సమస్యతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఓ ప్రముఖ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన కుమారుడు, నటుడు మాదాల రవి మాట్లాడుతూ – ‘‘నాన్నగారికి గత ఏడాది గుండెపోటు రావడంతో ఆపరేషన్ చేయించాం. అప్పటి నుంచి ఆయన డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంటున్నారు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హాస్పిటల్లో జాయిన్ చేశాం. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. డయాలసిస్ జరుగుతోంది. ఆయన్ని రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు. -
అనారోగ్యంతో వీఆర్వో ఆత్మహత్య
ఇల్లంతకుంట : అనారోగ్యంతో ఇల్లంతకుంట మండలం గుండారం గ్రామ నివాసి, సిరిసిల్ల మండలం నర్సింహులపల్లి వీఆర్వో ఎలుక బాబు (45) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాబు ఆర్నెల్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. మృతుడికి భార్య విజయ, కుమారుడు ఉన్నారు. బాబు మృతదేహాన్ని పరిశీలించిన తహసీల్దార్ సిరిసిల్ల రూరల్ : బాబు మృతదేహాన్ని సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా.. తోటి వీఆర్వోలు కంటతడిపెట్టారు. తహసీల్దార్ రాజు మృతదేహన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. తాత్కాలిక సాయం కింద రూ.20వేల సాయాన్ని రెవెన్యూశాఖ తరఫున అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇల్లంతకుంట ఏఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. -
కూతురుతోసహా తల్లి ఆత్మహత్య
► అనారోగ్యాన్ని భరించలేక బావిలో దూకి అఘాయిత్యం ► మల్యాలలో ఘటన చందుర్తి(కరీంనగర్): అనారోగ్యం భరించలేక ఓ మహిళ తన కూతురుతోసహా ఆత్మహత్య చేసుకుంది. తాను చనిపోతే రెండేళ్ల తన కూతురు బతకలేదని చిన్నారితో సహా బావిలో దూకింది. ఈ విషాద సంఘటన చందుర్తి మండలం మల్యాలలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మల్యాలకు చెందిన మదాం సుజాత(32) రెండు నెలలుగా పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతోంది. చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. దీంతో మనస్తాపం చెందిన సుజాత ఉదయం కొడుకు వంశీ(10)ని పాఠశాలకు పంపించింది. భర్త, కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగానే తన కూతురు విష్నిత(2)ను తీసుకుని గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త సంతోష్ మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా తల్లి, కూతురు కనిపించలేదు. చుట్టు పక్కల వ్యవసాయ బావుల్లో గాలించగా గ్రామ శివారులోని బావిలో ఇద్దరూ శవమై కనిపించారు. చందుర్తి పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించారు. సుజాత తండ్రి గొంటి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు.