r.narayana murthy
-
ఆందోళన చెందొద్దు..ఆరోగ్యంగానే ఉన్నా: ఆర్.నారాయణ మూర్తి
‘పీపుల్ స్టార్’ ఆర్. నారాయణ మూర్తి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వల్ప అస్వస్థతకు గురికావడంతో.. బుధవారం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు సైతం నారాయణ మూర్తి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. దీంతో స్వయంగా ఆర్. నారాయణ మూర్తే తన ఆరోగ్యంపై స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం తాను నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని..దేవుడి దయతో బాగానే కోలుకుంటున్నానని చెప్పారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చి.. అన్ని వివరాలు చెబుతానన్నారు.కాగా, నారాయణ మూర్తి ఆరోగ్యంపై నిమ్స్ వైద్యులు సైతం స్పందించారు. నారాయణమూర్తి స్వల్పంగానే అస్వస్థతకు లోనయ్యారని, చికిత్సతో క్రమంగా కోలుకుంటున్నారని, ఆయనకు నిర్వహించినవి కూడా సాధారణ టెస్టులేనని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. -
‘స్థానిక ప్రభుత్వాలు కావాలి’ పుస్తకావిష్కరణ
విజయనగరం మున్సిపాలిటీ : లోకల్ గవర్నమెంట్స్ చాం బర్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన మామిడి అప్పలనాయుడు రాసిన స్థానిక ప్రభుత్వాలు పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయనగరం పట్టణంలో గురువారం నిరా డంబరంగా జరిగింది. ప్రముఖ సినీ నటుడు ఆర్.నారా యణమూర్తి పుస్తకాన్ని ఆవిష్కరించి అందులో పొందుపరిచిన అంశాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పుస్తక రచయిత మామిడిని అభినందించారు. అనంతరం రచయిత అప్పలనాయుడు మాట్లాడుతూ దేశానికి కేంద్ర ప్రభుత్వం... రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లే గ్రామానికి గ్రామ పంచాయతీయే ప్రభుత్వం కావాలన్నదే ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. దేశంలోని కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మద్యప్రదేశ్, సిక్కిం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు పర్యటించి అక్కడ స్థానిక ప్రభుత్వాలు పరిస్థితులు అధ్యయనం చేసినట్టు చెప్పారు. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన 29 అధికారాలు అధ్యయనం చేసి ఏపీతో పాటు దేశంలో స్థానిక ప్రభుత్వాలు ఎలా ఉండాలో ఈ పుస్తకంలో రాసినట్టు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటుకు హమీ ఇస్తుందో ఆ పార్టీకే స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతు ఉం టుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం గౌరవ అధ్యక్షుడు ఎ.ప్రసాద్ పాల్గొన్నారు. -
అవార్డులు ఎవరి సొత్తు కాదు
ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి వరంగల్ వ్యవసాయ మార్కెట్లో సందడి చేశారు. రైతుల సమస్యలపై నిర్మిస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ సినిమా షూటింగ్ నిమిత్తం గురువారం ఆయన ఇక్కడికి వచ్చారు. మార్కెట్లోని రైతులు, గుమస్తాలు, హమాలీలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. షూటింగ్లో వారిని భాగస్వాములను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల ఎంపిక సవ్యంగా లేదన్నారు. ఆధార్ కార్డు, నాన్ రెసిడెన్షియల్ అని ఏపీ మంత్రి లోకేష్ మాట్లాడడం సరికాద న్నారు. తనకు వచ్చిన నంది అవార్డును కూడా స్వీకరించడం లేదని స్పష్టం చేశారు. కళాకారులకు హద్దులు పెట్టొద్దని సూచించారు. సాక్షి, వరంగల్ రూరల్: ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే అవార్డులు అందజేస్తున్నారు.. నంది అవార్డులు ఎవరి సొత్తు కాదు.. అని సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి అన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ సినిమా షూటింగ్ నిమిత్తం గురువారం వరంగల్ నగరానికి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే.. రుద్రమదేవికి అవార్డుఇవ్వకపోవడం దారుణం.. ఝూన్సీలక్ష్మీభాయి బ్రిటిష్ పాలకులపై ఏ విధంగా యుద్ధం చేసిందో తెలుగు జాతి మనుగడ ఐక్యత కోసం రాణి రుద్రమదేవి కృషి చేసింది. ఆ కథను ఆధారంగా చేసుకుని గుణశేఖర్ రూపొందించిన రుద్రమదేవి సినిమాకు నంది అవార్డు ఇవ్వకపోవడం దారుణం. అవార్డుల విషయం పునరాలోచించాలి.. ఇది వరకు ఉత్తమ సినిమాలను ఎంపిక చేసే సమయంలో అవి సమాజం, సంస్కృతీ సంప్రదాయాలపై ఎలా రోల్ ప్లే చేస్తున్నాయని పరిశీలించేవారు. ప్రస్తుతం ఏది బాగా సక్సస్ అయింది.. ఏది హిట్టు అయిందని చూస్తున్నారు. అవార్డుల విషయంలో పునరాలోచించాలి. అవార్డులు ఎవరి సొత్తు కాదు.. ప్రజలు పన్నులు కడుతున్నారు.. వాటితోనే ఇస్తున్నారు. కళాకారులకు హద్దులు పెట్టొద్దు. నరేంద్ర మోదీపై వాఖ్యలు చేస్తే ముక్కు కోసేస్తారా.. తల తీసేస్తారా.. పద్మావతి సినిమా విడుదల కానేలేదు. ఎవరూ చూడలేదు.. డైరెక్టర్ మీద.. అందులో నటించిన దీపిక పడుకొనె తల మీద రూ.ఐదు కోట్లు ప్రకటిస్తారా.. ఇది ప్రజా స్వామ్యమా.. రైతులపై కేంద్ర సర్కారు పట్టింపేది.. పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అన్నం పెట్టే అన్నదాత ఇలా చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. జీఎస్టీ ప్రారంభం రోజున అర్ధరాత్రి సంబరాలు చేసుకున్నారే కాని రైతు ఆత్మహత్యలను అత్యవసర పరిస్థితిగా ప్రకటించి పార్లమెంట్ ఉభయ సభల్లో ఎందుకు చర్చించడం లేదు. ఆత్మహత్యలు ఆపాలంటే గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. సీసీఐ ప్రకటించిన కనీస మద్దతు ధర సైతం రైతుకు దక్కడం లేదు. పత్తికి తేమ ఎక్కువైందని, రంగు మారిందని సాకులు చెప్పి కొనడం లేదు. రైతులు తెచ్చిన పత్తిలో 10 శాతం సీసీఐ, 90 శాతం ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ మాయాజాలాన్ని నిలువరించి రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే డైరెక్ట్‌గా కొనుగోలు చేయాలి. రైతును దృష్టిలో పెట్టుకొని ధర నిర్ణయించాలి. స్వామినాథన్ కమిటీ సిఫార్సును అమలు చేయాలని సినిమా ద్వారా కోరుతా. కేంద్రమే రుణ మాఫీ చేయాలి.. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసినట్లుగా భారతదేశం అంతా కేంద్ర ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేయాలి. పారిశ్రమిక వేత్తలకు రుణాలు మాఫీ చేస్తారు.. మళ్లీ ఇస్తారు. అదే రైతులు ఏం పాపం చేశారు. ఫసల్ యోజన పథకంలో ఒక్కో రైతు దగ్గర కేంద్ర ప్రభుత్వం రూ. 3900 తీసుకుంటోంది. అతివృష్టి అనావృష్టి వచ్చి నష్టపోయినప్పుడు తీసుకున్న ప్రీమియం మొత్తం నష్టపరిహారం చెల్లించాలి. -
తీవ్ర వాగ్వాదం.. ఆగిన సినిమా షూటింగ్
- ఆర్.నారాయణమూర్తిని అడ్డుకున్న స్థానిక నేతలు సాక్షి, హైదరాబాద్: విప్లవ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆర్.నారాయణమూర్తికి చేదు అనుభవం ఎదురైంది. తమ ప్రాంతంలో షూటింగ్‌కు అనుమతి లేదంటూ స్థానిక నాయకులు అడ్డుపడటంతో ఆయన అగ్రహానికి లోనయ్యారు. తీవ్రవాగ్వాదం చోటుచేసుకోవడంతో చివరికి షూటింగ్ రద్దయింది. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం బొర్రంపాలెం వద్ద శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ‘అన్నదాతా సుఖీభవ’ సినిమాను రూపొందిస్తున్న నారాయణమూర్తి.. యూనిట్‌తో కలిసి బొర్రంపాలెం వద్దగల పుష్కర ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ వద్ద సినిమా షూటింగ్ తలపెట్టారు. అయితే అనుమతి లేకుండా సినిమా తీయవద్దంటూ గండేపల్లి జెడ్పీటీసీ యర్రంశెట్టి చంద్రరావు, కొందరు స్థానికులు షూటింగ్‌ను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి లోనైన నారాయణమూర్తి.. స్థానికులతో వాగ్వాదానికి దిగారు. అక్కడి దృశ్యాలను చిత్రీకరిస్తోన్న మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు వచ్చి ఇరు వర్గాలను శాంతింపజేశారు. నారాయణమూర్తి సహా సినిమా యూనిట్ మొత్తం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై ప్రస్తుతానికి ఎలాంటి కేసు నమోదుకాలేదు. -
తీవ్ర వాగ్వాదం.. ఆగిన సినిమా షూటింగ్
-
‘ఓటుకు కోట్లు’ జుగుప్సాకరం
భ్రష్ట రాజకీయాలకు ఇది ప్రతీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తగదు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ఒంగోలు కల్చరల్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అడ్డదారులు తొక్కడంపై ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం జుగుప్సాకరమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చ అని, భ్రష్టరాజకీయాలకు ప్రతీకని నారాయణమూర్తి అభివర్ణించారు. ప్రజా కళాకారుడు డాక్టర్ గాండ్ల వెంకటరావు రెండో వర్ధంతి సభలో పాల్గొనేందుకు గురువారం ఒంగోలు వచ్చిన ఆర్.నారాయణమూర్తి ‘సాక్షి’తో వర్తమాన రాజకీయాలపై మాట్లాడారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో తప్పెవరిదో తేల్చకుండా రాజకీయ నాయకులు, పార్టీలు పరస్పరం ఆరోపణలకు దిగడాన్ని తప్పుబట్టారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు, చిచ్చుపెట్టేందుకు నాయకులు కుట్రలు పన్నుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. రాష్ట్రాన్ని విభ జించే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ హామీలిచ్చిన నాయకులు, పార్టీలు ప్రస్తుతం మాట మారుస్తున్నాయన్నారు. ఎన్నికల సయమంలో కూడా ప్రత్యేక హోదా సాధిస్తామంటూ పలు ప్రకటనలు చేశారని, అయినా నేటికీ హోదా దక్కలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఈ సిఫార్సులను తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేసి, ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. -
సమాజ హితం కోసమే ‘రాజ్యాధికారం’
మెదక్‌టౌన్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో దళిత, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందడం లేదని ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మెదక్ వచ్చిన సందర్భంగా స్థానిక టీఎన్జీఓ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 19న విడుదల కానున్న రాజ్యాధికారం సినిమా ప్రజాస్వామ్యవాదులను, దళిత, బడుగు, బలహీన వర్గాల వారి మనస్సులను హత్తుకునేలా ఉంటుందన్నారు. సమాజ హితం కోసమే రాజ్యాధికారం సినిమా తీసినట్లు తెలిపారు. సామాజిక ఇతివృత్తాలతో తీస్తున్న సినిమాలకు ఆదరణ కరువవుతుందన్నారు. ప్రేమ, యాక్షన్ సినిమాలు కాకుండా సమాజాన్ని చైతన్యం చేసే సినిమాలు రావాలని అభిప్రాయ పడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు ఓటుహక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. అప్పుడే ఆట్టడుగు వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందినట్లని అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి పాటు పడాలన్నారు. రెండు తెలుగు ప్రభుత్వాలు ఒకరినొకరు సహకరించుకొని సినిమా రంగాభివృద్ధికి తోడ్పాటు నందించాలన్నారు. సినిమా రంగంలో వ్యాపార దృక్పథం పెరిగిపోయిందన్నారు. తన సినిమాల పట్ల ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
పాలకుల తీరును కళ్లకు కట్టిన ‘రాజ్యాధికారం’
చిక్కడపల్లి: రాజ్యాధికారం అంటే ఏమిటి, అది సాధిస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయో కళ్లకు కట్టినట్లు ఆర్.నారాయణమూర్తి తన ‘రాజ్యాధికారం’ సినిమాలో చూపించారని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. సోమవారం గాంధీనగర్‌లోని ఉషా మయూరి థియేటర్లో ఆర్.నారాయణమూర్తి దర్శకత్వం వహించి నటించి నిర్మించిన రాజ్యాధికారం చిత్రాన్ని ఆయన వీక్షించారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ..దేశంలో 80 శాతమున్న దళితులు, బీసీలు, మైనార్టీలు ఎందుకు రాజ్యాధికారం సాధించలేకపోతున్నారో ఈ సినిమా కళ్లకు కట్టిందని పేర్కొన్నారు. రాజ్యాధికారం సాధించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలుంటాయో చక్కగా చూపించారని, అందువల్ల ఈ చిత్రం ప్రజలు తప్పకుండా చూడాల్సిన అవసరముందన్నారు. భారతదేశంలో ప్రజలే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, మీడియా, సినిమా ద్వారా సమాజాన్ని ఎలా రక్షించాలో నారాయణమూర్తి చూపించారని పేర్కొన్నారు. అనంతరం చిత్రదర్శకుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ మన దేశంలో ప్రజాస్వామ్యం పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. కోట్లు గుమ్మరించి ఓట్లు సాధిస్తున్నారని, ఈవిధానం పోవాలన్నారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, అణగారిని హక్కుల పరిరక్షన కమిటీ కన్వీనర్ ఎల్.ఎ.యాదగిరి, ఓయూ జేఏసీ నాయకులు అంబేడ్కర్, చిత్ర బృందం గద్దర్ వెంట ఉన్నారు. -
‘రాజ్యాధికారం’ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్
-
రాజ్యాధికారం మూవీ ఆడియో లాంచ్
-
నిర్భయ తీర్పుపై నారాయణమూర్తి స్పందన