
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సినీ నటుడు నారాయణమూర్తి తదితరులు
విజయనగరం మున్సిపాలిటీ : లోకల్ గవర్నమెంట్స్ చాం బర్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన మామిడి అప్పలనాయుడు రాసిన స్థానిక ప్రభుత్వాలు పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయనగరం పట్టణంలో గురువారం నిరా డంబరంగా జరిగింది. ప్రముఖ సినీ నటుడు ఆర్.నారా యణమూర్తి పుస్తకాన్ని ఆవిష్కరించి అందులో పొందుపరిచిన అంశాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పుస్తక రచయిత మామిడిని అభినందించారు.
అనంతరం రచయిత అప్పలనాయుడు మాట్లాడుతూ దేశానికి కేంద్ర ప్రభుత్వం... రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లే గ్రామానికి గ్రామ పంచాయతీయే ప్రభుత్వం కావాలన్నదే ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. దేశంలోని కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మద్యప్రదేశ్, సిక్కిం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు పర్యటించి అక్కడ స్థానిక ప్రభుత్వాలు పరిస్థితులు అధ్యయనం చేసినట్టు చెప్పారు.
73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన 29 అధికారాలు అధ్యయనం చేసి ఏపీతో పాటు దేశంలో స్థానిక ప్రభుత్వాలు ఎలా ఉండాలో ఈ పుస్తకంలో రాసినట్టు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటుకు హమీ ఇస్తుందో ఆ పార్టీకే స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతు ఉం టుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం గౌరవ అధ్యక్షుడు ఎ.ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment