one town police station
-
ఆకస్మిక తనిఖీలు
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలో ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు పోలీసు శాఖ పనిచేయాలని, పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులకు మౌలిక సదుపాయాలు కల్పించే విషయంపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌గ్రేవల్ అన్నారు. ఏలూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలు, ఫిర్యాదుదారుల విభాగం, స్పందనకు వచ్చే ప్రజలకు అందించే సౌకర్యాలు తదితరాలపై ఆరా తీశారు. రికార్డ్ గది, కంప్యూటర్ రూమ్, స్టోర్ రూ మ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రాంగణంలో మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని స్టేషన్లలో తాను తనిఖీలు చేపడతానన్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చే బాధితులు, ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహించాలన్నారు. జిల్లా అదనపు ఎస్పీ కె.ఈశ్వరరా వు, ఏలూరు డీఎస్పీ ఓ.దిలీప్‌కిరణ్, ఎస్బీ సీఐ రజ నీకుమార్, వన్‌టౌన్ సీఐ వై.బాలబాలాజీ, ఎస్సైలు ఎన్ఆర్ కిషోర్‌బాబు, ఎస్.రామకృష్ణ, అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
దుర్గగుడి ఉద్యోగులపై కేసు నమోదు
సాక్షి, విజయవాడ : వరుస వివాదాలతో వార్తలోకెక్కిన దుర్గగుడిలో తాజాగా మరో వివాదం చేలరేగింది. దసరా ఉత్సావాల్లో అక్రమాలకు పాల్పడినట్లు.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అచ్చుత రామయ్య తనను బెదిరించినట్లు దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నలుగురు దుర్గగుడి ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోద చేసినట్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుడి ఏఈవో అచ్చుత రామయ్య, సూపరిండెంట్ గోపిచంద్, రికార్డ్ అసిస్టెంట్ సునీత, కాంట్రాక్ట్ ఉద్యోగి సైదాలపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. వీరి మీద సెక్షన్ 420, 409, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. -
అమ్మా.. నాన్న పోదాం..పా..!
పలువురి హృదయాలను ద్రవింపజేసిన చిన్నారి పిలుపు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం తాళ్లగడ్డకు చెందిన చేపలు పట్టే యువకుడు ఏకాలపు శ్రీను (27) సోమవారం రాత్రి బంగారు గడ్డకు చెందిన ఇమ్రాన్ చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. శ్రీను మృతదేహానికి పోస్టుమార్టం చేయించేందుకు పోలీసులు ఇచ్చే పంచనామా రిపోర్టు కోసం అతడి కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం వన్‌టౌన్ పోలీ స్టేషన్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో శ్రీను భార్య భాగ్యలక్ష్మి చిన్నారులైన ఇద్దరు ఆడపిల్లలు పల్లవి, నిత్యలను పట్టుకుని వేపచెట్టు కింద కూర్చొని కన్నీరు పెట్టుకుంటోంది. ఈ క్రమంలో శ్రీను పెద్ద కుమార్తె అమ్మా నాన్న పోదాం.. పా..అమ్మా.. అని అనడం అక్కడున్న వారందరి హృదయాలను ద్రవింపజేసింది. - మిర్యాలగూడ టౌన్ -
పోలీస్ స్టేషన్‌కు స్థలం ఇవ్వం..
– వెంకటేశ్వర కాలనీ వాసుల ఆందోళన చిత్తూరు (అర్బన్): వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ తరలింపు ఏ ముహుర్తాన తెరపైకి వచ్చిందోగానీ దీనిపై రోజుకో వివాదం నడుస్తోంది. ఇప్పటికే మూడు చోట్ల స్టేషన్‌కు స్థలం ఇవ్వడం..మరోచోటికి కొత్త ప్రతిపాదన రావడం జరుగుతూ వచ్చింది. తాజాగా వెంకటేశ్వర కాలనీలో స్టేషన్ ఏర్పాటుకు కార్పొరేషన్ కేటాయించిన స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. పాలకులు, అధికారుల ఏక పక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం కాలనీలోని పార్కు స్థలం వద్ద ఆందోళనకు దిగారు. 05 సీటీఆర్ 22 – 26010010 – -
కూతుర్ని 'అమ్మే'సింది
చీరాల పోలీసుల చెంతకు చేరినహైదరాబాద్ బాలిక బాలికను విక్రయించి వదిలించుకున్న తల్లి చెర నుంచి తప్పించుకున్న బాలికను క్షేమంగా పోలీసులకు అప్పగించిన చిలకలూరిపేట యువకులు చీరాల రూరల్: మరో పెళ్లి చేసుకునేందుకు అడ్డుగా ఉందని కన్నకూతురినే విక్రయించేసింది ఓ తల్లి. కొన్న వారి చెంత నానా కష్టాలు అనుభవించిన పదకొండేళ్ల బాలిక వారిచెర నుంచి తప్పించుకుని చిలకలూరిపేట యువకుల కంటపడింది. వారి ద్వారా క్షేమంగా చీరాల పోలీసుల చెంతకు చేరింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి ప్రకాశం జిల్లా వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో చోటుచేసుకుంది. బాలిక రతిక, ఒన్‌టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు... హైదరాబాద్‌కు చెందిన రాజు, పూజ భార్యాభర్తలు వారి కాపురంలో కలతలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె వేరే వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు కుమార్తె రతిక (11) అడ్డుగా ఉందని భావించిన ఆమె మూడు నెలల క్రితం విజయవాడలో తెలిసిన వారికి అమ్మేసింది. వారు అక్కడ నుంచి రితికను చీరాలలోని జాండ్రపేటకు చెందిన వేరొకరివద్దకు పంపించారు. జాండ్రపేటలో బాలికతో నానా చాకిరీ చేయిస్తూ ఇబ్బందులు పెట్టారు. భరించలేని బాలిక సోమవారం అక్కడి నుంచి తప్పించుకొని బయటపడింది. ఆటోలో ఎక్కి కారంచేడులో దిగింది. ఒంటరిగా దిగాలుగా నడుచుకుంటూ వెళుతున్న బాలిక గ్రామంలో మంచాలు విక్రయిస్తున్న చిలకలూరిపేటకు చెందిన అబ్దుల్‌బాషా అనే యువకుడి కంట పడింది. ఆ బాలిక నుంచి వివరాలు సేకరించిన బాషా ఆమెను తన స్వగ్రామమై చిలకలూరిపేట తీసుకెళ్లి తన స్నేహితుల సహాయంతో చిలకలూరిపేట పోలీసులకు అప్పగించాడు. చిలకలూరిపేట పోలీసులు ఆ బాలిక చీరాల పరిధిలో నుంచి వచ్చింది కనుక అక్కడికే తీసుకెళ్లాలని సూచించారు. దీంతో యువకులు వారి పనులుమానుకొని ఆ బాలికను మంగళవారం చీరాల వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. స్పందించిన సీఐ సత్యనారాయణ ఐసీడీఎస్ అర్బన్ సీడీపీవో నాగమణికి సమాచారం అందించి స్టేషన్‌కు పిలిపించారు. బాలికను ఒంగోలులోని ప్రభుత్వ హోమ్‌కు తరలించాలని సూచించి వారికి అప్పగించారు. ఎంతో బాధ్యతగా వ్యవహరించి బాలికను క్షేమంగా పోలీసుస్టేషన్లో అప్పగించిన చిలకలూరిపేట యువకులను సీఐ అభినందించారు. -
బెజవాడలో రౌడీల హల్చల్.. హోటల్‌పై దాడి
-
బెజవాడలో రౌడీల హల్చల్.. హోటల్‌పై దాడి
విజయవాడ: నగరంలోని వన్‌టౌన్ పంజా సెంటర్లో రౌడీలు హల్చల్ సృష్టించిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. గతరాత్రి ఓ హోటల్లో పనిచేస్తున్న సిబ్బందిపై రౌడీలు కర్రలతో దాడిచేశారు. ఈ దాడిలో హోటల్లో పనిచేస్తున్న ఈశ్వర్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దాంతో బాధితులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాయపడిన ఈశ్వర్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం
ఆదిలాబాద్: రిమాండ్‌లో ఉన్న ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఓ కేసులో రిమాండ్‌లో ఉన్న బషీర్ అనే ఖైదీ బాత్రూంలో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో బషీర్‌ను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. -
కుటుంబం అదృశ్యంపై దర్యాప్తు
⇒ చనిపోయేందుకు వెళ్తున్నట్టు లేఖ ⇒ పెళ్లికి వచ్చి కనిపించని అక్కాచెల్లెళ్లు ⇒ తల్లిదండ్రులు, బిడ్డలతో కలిసి అదృశ్యం ⇒ కన్నీరు మున్నీరవుతున్న భర్తలు ⇒ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అల్లిపురం: అప్పుల బాధ భరించలేక చనిపోవాలని నిర్ణయించుకున్నామంటూ లేఖ రాసిన ఓ కుటుంబం అదృశ్యమైన సంఘటన వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం గుత్తు కృష్ణమూర్తి, వెంకటలక్ష్మి దంపతులు టౌన్ కొత్తరోడ్డులోని తుమ్మలపల్లి వారి వీధిలో నివసిస్తున్నారు.వీరికి సంతోష్‌లక్ష్మి, రాజ్యలక్ష్మి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో పెద్దమ్మాయి సంతోష్లక్ష్మిని విశాఖ జిల్లా ఎస్.రాయవరానికి చెందిన పడమట వెంకట్రావుతో వివాహం చేశారు. ఈమెకు మోనిక (6), దక్షిత అనే ఇద్దరు ఆడపిల్లలున్నారు. రెండో అమ్మాయిని ఎన్‌ఏడీకి చెందిన ఆటో డ్రయివర్ బండారు నాగరాజుతో వివాహం జరిపించారు. వీరికి 8 నెలల కుమారుడు చరణ్మూర్తి ఉన్నాడు. పుట్టింటికి వెళ్లి మాయం ఈ నెల 6వ తేదీన వన్‌టౌన్ కన్యకాపరమేశ్వరి కల్యాణమండపంలో బంధువుల పెళ్ళికని ఇద్దరు ఆడపిల్లలు తమ భర్తలతో సహా వచ్చారు. పెళ్లి భోజనాల తరువాత ఇద్దరు అల్లుళ్లు వారి ఇళ్ళకు వెళ్లిపోయారు. అక్కాచెల్లెళ్లు సంతోష్‌లక్ష్మి, రాజ్యలక్ష్మి ఇద్దరు కలసి కన్నవారింటికి పిల్లలను తీసుకెళ్లారు. 7వ తేదీన ఇద్దరు అల్లుళ్లు భార్యలకు ఫోన్లు చేయగా అవి స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. దీంతో వారిద్దరు కొత్తరోడ్డులో అత్తింటివారు నివసిస్తున్న ఇంటికి వచ్చి చూడగా తలుపులకు తాళాలు వేసి ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలు వెతికినా వారి ఆచూకి తెలియలేదు. తిరిగి అనుమానం వచ్చిన వారు 10వ తేదీ ఉదయం వచ్చి వీధిలో అందరినీ వాకబు చే సారు. ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించటంతో కిటికీ వద్ద ఒక లేఖ దొరికింది. ‘అప్పులు ఎక్కువగా ఉండటంతో అంతా కలసి ఇల్లు వదిలి చనిపోయేందుకు వెళ్లిపోతున్నాం’ అని రాసి ఉంది. దీంతో అల్లుళ్లు వెంకట్రావు, నాగరాజులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసు బృందాల గాలింపు కేసు నమోదు చేసిన పోలీసులు పరవాడ, వాడ చీపురుపల్లితో పాటు నగరంలో పలు ప్రాంతాలకు బృందాలను పంపించారు. వారితో పాటు వెంకటరావు, నాగ రాజులు కూడా తమ కుటుంబ సభ్యులకోసం తీవ్రంగా వెదుకుతున్నారు. తమ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలిసిన వారు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లు ఫోన్ నంబర్లు 9440796019, 0891-2563632, 8121013250కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. -
నకిలీ నోట్ల ముఠా ఆటకట్టు
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: నకిలీ నోట్లు చలామణి చేసేందుకు యత్నిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని వారినుంచి రూ.10 లక్షలకు పైగా నకిలీ నోట్లు, వాటి తయారీకి వినియోగించిన యంత్రాన్ని స్వాధీ నం చేసుకున్నట్లు డీఎస్పీ నాగరాజ తెలి పారు. సోమవారం స్థానిక వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రాయదుర్గం పట్టణానికి చెందిన వీరయ్య అక్షయ గోల్డ్ ఏజెంట్‌గా పలువురితో ఆ సంస్థలో డిపాజిట్లు చేయించాడు. ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో డిపాజిట్‌దారులు డబ్బు చెల్లించాలంటూ ఒత్తిడి తేవడంతో తనను సమ స్య నుంచి గట్టెక్కించే మార్గం చూపాలం టూ అతను హిందూపురానికి చెందిన తాహిద్ను కోరాడు. ఇదే అదనుగా భావించిన అతను అనంతపురంలోని రాణీ నగర్‌కు చెందిన తన మిత్రుడు మగ్బూల్ అనే వ్యక్తి నకిలీ నోట్లు తయా రు చేస్తాడని, అతనిని కలిస్తే సమస్య పరిష్కారమవుతుందని సూచించాడు. దీంతో ఇద్దరూ కలసి మగ్బూల్‌ను కలువగా రూ.లక్ష నగదు ఇస్తే రూ.30 లక్షల విలువైన నకిలీ నోట్లు ఇస్తానని చెప్పాడు. అతను సూచించిన మొత్తాన్ని వీరయ్య చెల్లించడంతో, ఆ డబ్బుతో కలర్ జెరాక్స్ మెషీన్, ప్రింటర్ తదితర పరికరాలు కొనుగోలు చేశాడు. నగరంలోని వేణుగోపాల్ నగర్‌లోని ఓ ఇంట్లో భార్య ముం తాజ్ సాయంతో నోట్ల తయారీ ప్రారంభించాడు. రూ.3 లక్షల విలువైన నకిలీ నోట్లను వీరయ్యకు అందజేశాడు. తానూ కొన్ని నోట్లను చలామణి చేసేందుకు సోమవారం సాయంత్రం తాడిపత్రి బస్టాండు సమీపంలో తాహీద్తో కలసి ప్రయత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నకిలీ కరెన్సీ తయారీలో శిక్షణ పొందిన మగ్బూల్ గుత్తికి చెందిన మస్తాన్ కూతురు ముంతాజ్‌ను మగ్బూల్ వివాహం చేసుకున్నాడు. మస్తాన్ నకిలీ కరెన్సీ తయారీలో సిద్ధహస్తుడు. అతని వద్దే మగ్బూల్ శిక్షణ పొందాడు. అలా నేర్చుకున్న విద్యతో గతంలోనకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తూ ధర్మవరం, హిందూపురం పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా, ప్రస్తుతం మగ్బూల్, తాహిద్లు పోలీసులకు పట్టుబడగా, వీరయ్య, మగ్బూల్ భార్య ముంతాజ్లుపరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బంది రమేష్, నాగరాజ తదితరులను అభినందించారు.