స్థలం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు
– వెంకటేశ్వర కాలనీ వాసుల ఆందోళన
చిత్తూరు (అర్బన్): వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ తరలింపు ఏ ముహుర్తాన తెరపైకి వచ్చిందోగానీ దీనిపై రోజుకో వివాదం నడుస్తోంది. ఇప్పటికే మూడు చోట్ల స్టేషన్‌కు స్థలం ఇవ్వడం..మరోచోటికి కొత్త ప్రతిపాదన రావడం జరుగుతూ వచ్చింది. తాజాగా వెంకటేశ్వర కాలనీలో స్టేషన్ ఏర్పాటుకు కార్పొరేషన్ కేటాయించిన స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. పాలకులు, అధికారుల ఏక పక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం కాలనీలోని పార్కు స్థలం వద్ద ఆందోళనకు దిగారు.
05 సీటీఆర్ 22 – 26010010 –