
సాక్షి, విజయవాడ : వరుస వివాదాలతో వార్తలోకెక్కిన దుర్గగుడిలో తాజాగా మరో వివాదం చేలరేగింది. దసరా ఉత్సావాల్లో అక్రమాలకు పాల్పడినట్లు.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అచ్చుత రామయ్య తనను బెదిరించినట్లు దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నలుగురు దుర్గగుడి ఉద్యోగులపై ఎఫ్‌ఐఆర్ నమోద చేసినట్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుడి ఏఈవో అచ్చుత రామయ్య, సూపరిండెంట్ గోపిచంద్, రికార్డ్ అసిస్టెంట్ సునీత, కాంట్రాక్ట్ ఉద్యోగి సైదాలపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. వీరి మీద సెక్షన్ 420, 409, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment