అమ్మా.. నాన్న పోదాం..పా..! | Ekalapu srinu brutal murder in Miryalaguda | Sakshi
Sakshi News home page

అమ్మా.. నాన్న పోదాం..పా..!

Published Wed, Nov 2 2016 3:15 AM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

అమ్మా.. నాన్న పోదాం..పా..!

అమ్మా.. నాన్న పోదాం..పా..!

 పలువురి హృదయాలను ద్రవింపజేసిన చిన్నారి పిలుపు
 నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం తాళ్లగడ్డకు చెందిన చేపలు పట్టే యువకుడు ఏకాలపు శ్రీను (27) సోమవారం రాత్రి బంగారు గడ్డకు చెందిన ఇమ్రాన్ చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. శ్రీను మృతదేహానికి పోస్టుమార్టం చేయించేందుకు పోలీసులు ఇచ్చే పంచనామా రిపోర్టు కోసం అతడి కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం వన్‌టౌన్ పోలీ స్టేషన్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో శ్రీను భార్య భాగ్యలక్ష్మి చిన్నారులైన ఇద్దరు ఆడపిల్లలు పల్లవి, నిత్యలను పట్టుకుని వేపచెట్టు కింద కూర్చొని కన్నీరు పెట్టుకుంటోంది. ఈ క్రమంలో శ్రీను పెద్ద కుమార్తె అమ్మా నాన్న పోదాం.. పా..అమ్మా.. అని అనడం అక్కడున్న వారందరి హృదయాలను ద్రవింపజేసింది.
   - మిర్యాలగూడ టౌన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement