రిమాండ్ ఖైదీ మృతి | Remand prisoner's death | Sakshi
Sakshi News home page

రిమాండ్ ఖైదీ మృతి

Published Wed, Nov 19 2014 1:43 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

రిమాండ్ ఖైదీ మృతి - Sakshi

రిమాండ్ ఖైదీ మృతి

నెల్లూరు(క్రైమ్): జిల్లాలో రిమాండ్ ఖైదీలు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. జైలులో ఉన్నవారు వరుసగా మరణిస్తుండటంతో తోటివారు నిద్రలేకుండా గడుపుతున్నారు. జిల్లా కేంద్రకారాగారంలో రెండు రోజులుగా జైలులో చికిత్స పొందుతున్న తమిళనాడులోని విల్లిపురం జిల్లా నేలచూకల్లి గ్రామానికి చెందిన ఆడి ఏలుమలై (24) మంగళవారం మరణించాడు.

ఇతను ఎర్రచందనం కూలి. 2013 డిసెంబర్‌లో శేషాచలం అడవుల్లో అటవీ అధికారులకు పట్టుబడ్డాడు. అలాగే అక్రమంగా కలప నరుకుతున్న తమిళనాడుకు చెందిన 346 మందిని రేణిగుంటపోలీసులు అరెస్ట్‌చేశారు. ఆ తర్వాత వీరిని  నెల్లూరు, కడప, తిరుపతి జైళ్లకు రిమాండ్ నిమిత్తం పంపించారు. ఏలుమలై అదే ఏడాది డిసెంబర్ 20 నెల్లూరు జిల్లా కేంద్రకారాగారంలోకి వచ్చాడు.

అరుుతే ఇటీవల పలుమార్లు జ్వరం రావడంతో జైలు వైద్యులే చికిత్స అందించారు. కానీ మళ్లీ రెండు రోజులుగా కాళ్లు, చేతులు వాపుతో పాటు తీవ్ర నొప్పులతో వచ్చారుు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం డీఎస్‌ఆర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రామా వార్డులో వైద్యులు పరీక్షలు నిర్వహిస్తుండగానే మృతి చెందాడు. గుండె ఫెరుుల్యూర్ అరుునట్లు డాక్టర్లు చెప్పారు. సమాచారాన్ని ఉన్నతాధికారులతో పాటు మృతిని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
 
 అనారోగ్యం పాలైన వారు వరుసగా..

 ఈ ఏడాది ఇప్పటివరకు నలుగురు రిమాండ్ ఖైదీలు మృతిచెందారు. అందరూ తీవ్ర అనారోగ్యానికి గురై చివరి నిమిషంలో ఆస్పత్రిలో చనిపోరుునవారే.

  ఏలుమలైతో పాటు విల్లీపురం జిల్లా తల్మదూరు గ్రామానికి చెందిన అన్నదానం పుహలెంది(23) నెల్లూరు జిల్లా కేంద్రకారాగారానికి వచ్చాడు.

  ఈ ఏడాది జూన్ 12వ తేదీ రాత్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఇతన్ని కూడా డీఎస్‌ఆర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

 దొంగతనం కేసులో రిమాండ్ అనుభవిస్తున్న నెల్లూరు రాయపు దళితవాడకు చెందిన శీరం నాగేంద్ర తీవ్ర అనారోగ్యానికి గురై తిరుపతి రుయా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆగస్టు 20వ మరణించాడు.
 బుచ్చిరెడ్డిపాలెం రేబాలకు చెందిన ఓ వ్యక్తి కన్నకుమార్తెపై జరిగిన లైంగికదాడి కేసులో రిమాండ్ అనుభవిస్తున్నాడు. ఈ వ్యక్తి సైతం తీవ్ర అనారోగ్యానికి గురై తిరుపతి రుయా హాస్పిటల్‌లో చేరిన కొద్దిసేపటికే మృతిచెందాడు. ఈ సంఘటన రెండు నెలల క్రిత ం జరిగింది.

 ఏలుమలై నాలుగో వ్యక్తి. అతన్ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చే సమయానికే నడవలేకుండా.. ఊపిరితీసుకుండా ఉన్నాడని.. అప్పటికే పరిస్థితి చేరుుదాటిందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. వరుసగా రిమాండ్ ఖైదీలు ఎందుకు మరణిస్తున్నారో విచారణ చేపట్టాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సకాలంలో చికిత్స అందితే ఈ ఘటనలు పునరావృతం కావంటున్నారు.
 
 ఖైదీలను హింసిస్తున్నారా?
 
 నెల్లూరు కేంద్రకారాగారంలో వివాదాలకు కొదువలేకుండా పోతోంది.  ఖైదీలు, అధికారుల మధ్య విభేదాలు తారస్థారుుకి చేరుకుంటున్నారుు. అధికారులు తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారని,  ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని పలువురు ఖైదీలు బహిరంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే!  ఈ ఏడాది అక్టోబర్ రెండున గాంధీ జయంతి నాడు హత్యకేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన బాలసుబ్రహ్మణ్యం జిల్లా జడ్జికి లేఖ అందజేశాడు.

తనను వేధిస్తున్నారనేది లేఖ సారాంశం. అనంతరం నిద్రమాత్రలు మింగాడు. ఇది అప్పట్లో పెద్ద దుమారం లేపింది. ఇదిలా ఉంటే భోజనం సరిగాలేదని ఖైదీలు రెండురోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై జైలు అధికారులు వివరణ కోరగా అలాంటిదేమి లేదని నాణ్యమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement