ఖైదీ నాగరాజు
రేపల్లె : రేపల్లె పట్టణంలోని సబ్‌జైలు నుంచి బుధవారం రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. సబ్ జైలర్ మోహనరావు కథనం ప్రకారం.. సత్తెనపల్లి మండలం బడుగుబండకు చెందిన కుంచాల నాగరాజు దొంగతనం కేసులో 5 నెలల నుంచి రిమాండ్ ఖైదీగా సబ్‌జైలులో ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం భోజన అనంతరం మరుగుదొడ్డికని వెళ్లిన నాగరాజు ఎంతకూ రాలేదు.Sఅనుమానం వచ్చి మరుగుదొడ్డిలో చూడగా నాగరాజు కనిపించలేదని, చుట్టు పక్కల వెతికినా ఫలితంలేదన్నారు. మరుగుదొడ్డికి వెళ్లే నెపంతో పక్కనే ఉన్న గోడ దూకి పారిపోయాడని గ్రహించి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని మోహనరావు తెలిపారు. అతని కోసం విస్తత గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు.