
సాక్షి, తూర్పు గోదావరి: కాకినాడ ప్రభుత్వాస్పత్రి నుంచి రిమాండ్‌లో ఉన్న ఓ ఖైదీ పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే.. సామర్లకోట మండలం గూడపర్తి గ్రామంలో జరిగిన బండి సత్యవతి హత్యకేసులో ప్రధాన ముద్దాయి, హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సురేష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతన్ని నిన్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఈ క్రమంలో తప్పించుకున్న రిమాండ్ ఖైదీ బండి సురేష్ ఇదే అదనుగా భావించి పరారయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment