పశ్చిమగోదవరి: తప్పుచేసిన తనతో కుటుంబ సభ్యులు మాట్లాడంలేదని.. మనస్తాపానికి గురైన ఖైదీ బాత్‌రూంలోని ట్యూబ్‌లైట్‌ను పగలగొట్టి దానితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకు సబ్‌జైల్లో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
వివరాలు.. జుట్టిగ యోహాన్ అత్యాచారం కేసులో జూన్16 నుంచి సబ్‌జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. అప్పటినుంచి అతన్ని చూడడానికి అతని కుటుంబ సభ్యులు ఎవరు జైలుకు రాకపోవడంతో పాటు.. ఎన్నిసార్లు ఫోన్ చేసిన మాట్లాడక పోవడంతో.. మనస్తాపానికి గురైన యోహాన్ ఈ రోజు ఉదయం స్నానానికని బాత్‌రూంకు వెళ్లి.. అక్కడ ఉన్న ట్యూబ్‌లైట్ పగలగొట్టి దానితో కడుపులో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఇది గమనించిన జైలు సిబ్బంది అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.