తాడేపల్లి, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరుకు వెళ్లనున్నారు. ఉదయం సబ్ జైలుకి వెళ్లి మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో ములాఖత్ కానున్నారు. ఆపై క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈద సాంబిరెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయన్ని పరామర్శిస్తారు.
మూడేళ్ల కిందినాటి టీడీపీ మంగళగిరి కార్యాయలంపై దాడి కేసులో.. నందిగం సురేష్‌ను అక్రమంగా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. రిమాండ్ మీద ఆయన గుంటూరు జైలులో ఉన్నారు మరోవైపు.. సాంబిరెడ్డి ఇటీవలె టీడీపీ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ అధినేతగా వాళ్లకు ధైర్యం చెప్పేందుకు జగన్ పరామర్శించనున్నారు.
ఇదీ చదవండి: ఇంత చేతగానితనమా చంద్రబాబు?: వైఎస్ జగన్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment