రిమాండ్ ఖైదీ అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో శనివారం సాయంత్రం జరిగింది.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : రిమాండ్ ఖైదీ అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దక్కిలి మండలం వెంగుళూరు గ్రామంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన గానుగ శ్రీను(35) ఎర్ర చందనం స్మగ్లింగ్ పాల్పడుతుండగా.. పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ క్రమంలో శనివారం అనారోగ్యానికి గురైన శ్రీనును పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందట అతను మృతిచెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులు హింసించడం వల్లే శ్రీను మృతిచెందాడని ఆరోపిస్తున్నారు.