తెనాలి రూరల్(గుంటూరు జిల్లా): కోర్టు వాయిదాకు తీసుకువచ్చిన ఎస్కార్టు పోలీసుల కళ్లు గప్పి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న నిందితుడిగా ఉన్న ఇతను సునాయాసంగా సిబ్బందిని పక్కదోవ పట్టించి జారుకున్నాడు. వివరాలు.. తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన కొప్పరాజు వెంకటయుగంధర్ అలియాస్ పంతులు, తెనాలి తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
ప్రస్తుతం తెనాలి సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న ఇతన్ని సోమవారం కోర్టు వాయిదా నిమిత్తం ఇద్దరు కానిస్టేబుళ్లు కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు ఆవరణలో ఒక ఎస్కార్ట్ కానిస్టేబుల్ ఏపీపీని కలవడానికి వెళ్లినపుడు.. మిగిలిన కానిస్టేబుల్‌తో తనకు దాహం వేస్తోంది నీరు తాగుతానని చెప్పి యుగంధర్ పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
దాహం వేస్తోంది సారూ! అంతలోనే..
Published Mon, May 23 2016 9:23 PM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM
Advertisement
Advertisement