Escort police
-
పోలీస్ ఎస్కార్ట్ మధ్య ట్రోఫీ అందుకున్న ఫార్ములావన్ స్టార్
ఫార్ములావన్ స్టార్.. రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్‌కు అరుదైన గౌరవం లభించింది. సోమవారం జరిగిన మియామి గ్రాండ్ప్రిక్స్ ఫైనల్ ల్యాప్ రేసులో వెర్స్టాపెన్ సూపర్ విక్టరీ సాధించాడు. మొదట మూడో పొజిషన్లో నిలిచినప్పటికి ఆ తర్వాత ఫెరారీ డ్రైవర్లు చార్లెస్ లెక్లెర్క్, కార్లోస్ సెయింజ్లను వెనక్కు నెట్టి తొలి స్థానంలో నిలిచాడు. మొదటి ల్యాప్‌ను మూడో స్థానంతో ప్రారంభించి చివరకు రెండో స్థానంతో పొజిషన్‌ను ముగించాడు. ఆ తర్వాత ఏడు ల్యాప్స్ అనంతరం పోల్ పొజిషన్ సాధించిన వెర్స్టాపెన్ దూసుకెళ్లి రేసు గెలవడంతో పాటు టైటిల్‌ను కొల్లగొట్టాడు. కాగా మియామి ఓపెన్ గ్రాండ్ప్రిక్స్ తొలిసారి నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజేతకు గౌరవం ఇవ్వాలని పోడియం వరకు మేనేజ్మెంట్ పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ముందు, వెనుక పోలీస్ ఎస్కార్ట్ వెళ్లగా.. మధ్యలో ఓపెన్ టాప్ కార్లో వెర్స్టాపెన్ పోడియం వద్దకు చేరుకొని ట్రోఫీని అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''ఈ గెలుపును ఇప్పటికి నమ్మలేకపోతున్నా. నిజంగా ఇది మంచి కమ్‌బ్యాక్. వాస్తవానికి నాకు మంచి ఆరంభం లభించలేదు. ఆ తర్వాత ఫుంజుకొని తొలి స్థానంతో రేస్‌ను ముగించాను. మధ్యలో సెయింజ్ నుంచి గట్టిపోటి ఎదురైనప్పటికి టర్న్ 1 నుంచి అతన్ని దాటాలనే ప్రయత్నం చేశాను. లక్కీగా అది వర్కవుట్ అయింది. ఇక మెయిడెన్ టైటిల్‌ను గెలవడం ఆనందంగా ఉంది'' అంటూ ట్రోఫీ అందుకున్న అనంతరం వెర్స్టాపెన్ చెప్పుకొచ్చాడు. చదవండి: దిగ్గజాలకు షాకిచ్చి మాడ్రిడ్ ఓపెన్‌ను కైవసం చేసుకున్న స్పెయిన్ యువ కెరటం Avinash Sable: 30 ఏళ్ల జాతీయ రికార్డు బద్దలు A special escort to the podium for @Max33Verstappen #MiamiGP #F1 pic.twitter.com/7C4Qifciqm — Formula 1 (@F1) May 9, 2022 -
పోలీసుల కళ్లుగప్పి
నెల్లూరు(క్రైమ్): ఎస్కార్ట్ పోలీసుల కళ్లు గప్పి రిమాండ్ ఖైదీ పరారైన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు పలు కేసుల్లో మోస్ట్‌వాంటెడ్ కావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాలు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లింగేశ్వరనగర్‌కు చెందిన నిమ్మల హరీష్ అలియాస్ హరి చిన్నతనం నుంచే దొంగతనాలకు అలవాటుపడ్డాడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. గుంటూరు జైల్లో ఉన్న సమయంలో హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన విజయకుమార్ అలియాస్ విక్కీ అలియాస్ రెడ్డితో పరిచయమైంది. జైలు నుంచి బయటకొచ్చిన వారు కార్లలో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడేవారు. నిందితులు ఇటీవల కడప పోలీసులకు చిక్కారు. పోలీసుల విచారణలో నెల్లూరు బాలాజీనగర్‌లో 2017లో ఓ ఇంట్లో దొంగతనం చేసినట్లు నిందితులు నేరం అంగీకరించారు. అప్పటి నుంచి నిందితులు తిరుపతి స్పెషల్ సబ్జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల పదిన నెల్లూరు బాలాజీనగర్ పోలీసులు నిందితులను దొంగతనం కేసులో విచారించేందుకు తిరుపతి స్పెషల్ సబ్‌జైల్ నుంచి నెల్లూరు కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో అదే రోజు జిల్లా కేంద్రకారాగారానికి తరలించారు. అనంతరం కోర్టు అనుమతితో 14వ తేదీన హరీష్, విజయకుమార్‌ను బాలాజీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి 15వ తేదీన జిల్లా కేంద్రకారాగారానికి తరలించారు. ఈ నేపథ్యంలో తిరుపతి నగరంలోని తిరుచానూరు పోలీసులు దొంగతనం కేసులో విచారించేందుకు పీటీ వారెంట్‌పై హరీష్‌ను మరో రిమాండ్ ఖైదీని నెల్లూరు కేంద్రకారాగారం నుంచి ఈ నెల 16న తీసుకెళ్లారు. 17వ తేదీన నిందితులను ప్రాపర్టీ రికవరీ కోసం తిరుపతిలోని పద్మావతిపురానికి తీసుకెళ్లగా, శ్రీహరిమెస్ వద్ద పోలీసుల కళ్లుగప్పి హరీష్ పరారయ్యాడు. దీనిపై ఎస్కార్ట్ పోలీసులు అదే రోజు తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. రిమాండ్ ఖైదీ పరారైన ఘటనపై తిరుచానూరు పోలీసులు ఈ నెల 18న నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారానికి సమాచారం అందించారు. నిమ్మ ల హరీష్‌పై తిరుపతిలో 12, మదనపల్లి, చిత్తూరు, కడపల్లో నాలుగు పెండింగ్ వారెంట్లు ఉన్నాయి. -
దాహం వేస్తోంది సారూ! అంతలోనే..
తెనాలి రూరల్(గుంటూరు జిల్లా): కోర్టు వాయిదాకు తీసుకువచ్చిన ఎస్కార్టు పోలీసుల కళ్లు గప్పి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న నిందితుడిగా ఉన్న ఇతను సునాయాసంగా సిబ్బందిని పక్కదోవ పట్టించి జారుకున్నాడు. వివరాలు.. తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన కొప్పరాజు వెంకటయుగంధర్ అలియాస్ పంతులు, తెనాలి తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం తెనాలి సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న ఇతన్ని సోమవారం కోర్టు వాయిదా నిమిత్తం ఇద్దరు కానిస్టేబుళ్లు కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు ఆవరణలో ఒక ఎస్కార్ట్ కానిస్టేబుల్ ఏపీపీని కలవడానికి వెళ్లినపుడు.. మిగిలిన కానిస్టేబుల్‌తో తనకు దాహం వేస్తోంది నీరు తాగుతానని చెప్పి యుగంధర్ పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.