కర్ణాటక ,యశవంతపుర : రిమాండ్ ఖైదీ పుట్టిన రోజు వేడుకలు పోలీసు స్టేషన్‌లో జరిగాయి. ఈ విచిత్ర ఘటన విద్యారణ్య పోలీసు స్టేషన్‌లో జరిగింది. పోలీసు అధికారి పేరిట ప్రజల నుండి డబ్బులు వసూలు చేసిన కేసులో అభిషేక్ అలియాస్ అభిని గతేడాది పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో అభి పుట్టిన రోజు వేడుకలను పోలీసు స్టేషన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితుడు అభికి ఆ పోలీసు స్టేషన్ ఎస్‌ఐ కేక్ తినిపిస్తున్న ఫోటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఎస్‌ఐ, స్టేషన్ సిబ్బంది నిందితుడికి కేక్ తినిపిస్తున్న వీడియో, ఫోటోలు వైరల్ కావడంతో ప్రజల ఆక్రోశానికి గురవుతున్నారు. బాడుగకు తీసుకున్న కారును ధ్వసం చేసిన నిందితుడు అభిషేక్.. కారు యజమాని రిపేర్‌కు డబ్బులు అడిగితే నేను పోలీసును, నన్నే డబ్బులు అడుగుతావా.. కేసు నమోదు చేస్తానంటూ కారు యజమానిని బెదిరించారు.
ఇదే కాకుండాకారు యజమాని నుంచి వేల రూపాయలను వసూలు చేశాడు. ఇందుకు సంబంధించి దాసరహళ్లి నివాసి కార్తీక్ విద్యారణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అభిషేక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి జతలో పోలీసులు కేక్ తిన్న విషయంపై ఉన్నత అధికారులను వివరణ కోరగా నిందితుడు పోలీసులతో సన్నిహితంగా ఉండేవాడు. ఏడాది క్రితం పుట్టిన రోజును స్టేషన్‌లో జరిపారు. అయితే నాలుగు నెలల క్రితం అక్కడి ఎస్‌ఐతో పాటు పోలీసులు బదిలీ అయినట్లు వివరించారు. ఎవరిపై చర్యలు తీసుకోవాలో అర్థం కావటంలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment