తిరువనంతపురం: రిమాండ్ ఖైదీకి కరోనా పాజిటివ్ రావడంతో 100 మంది క్వారంటైన్‌కు వెళ్లిన సంఘటన కేరళలో చోటుచేసుకుంది. వారిలో ఓ కోర్టు జడ్జితో పాటు, మరో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కూడా ఉన్నారు. అక్రమ మద్యం కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్టవగా వారిని నెడుమాంగడ్ కోర్టులో ఆదివారం ప్రవేశపెట్టారు. కోర్టు వారికి 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. దీంతో పూజాపుర సెంట్రల్ జైలుకు వారిని తరలించారు. అయితే, అంతకు క్రితమే సేకరించిన వారి లాలాజల నమూనాలను పరీక్షించగా.. ఆ ముగ్గురిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది.
(చదవండి: కేరళ ఆఫర్‌కు ఓకే చెప్పిన 'మహా' సర్కార్)
విషయం తెలుసుకున్న జిల్లా కోవిడ్ నియంత్రణ అధికారులు నిందితులను ప్రవేశపెట్టిన కోర్టు జడ్జి, అరెస్టు చేసి లాకప్‌లో ఉంచిన వెంజరాముడు పోలీస్ స్టేషన్‌కు చెందిన 34 మంది పోలీసు సిబ్బంది, 12 మంది పూజాపుర సెంట్రల్ జైలు సిబ్బంది, లాలాజల నమూనాలు సేకరించిన ప్రభుత్వాస్పత్రి సిబ్బందిని క్వారైంటన్‌కు పంపించారు. ఇదిలాఉండగా.. మలయాళ నటుడు సూరజ్ వెంజరాముడు, వామన్‌పురం ఎమ్మెల్యే డీకే మురళి (సీపీఐ) కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. వెంజరాముడు సీఐ పాల్గొన్న విందులో వీకు కూడా పాల్గొనడమే దీనికి కారణం.
(చదవండి: కరోనా: అప్పుడు కుదరలేదు.. ఇప్పుడైనా వెళ్లండి!)
Comments
Please login to add a commentAdd a comment